• search
  • Live TV
మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

భార్యపై కోపం.. నాలుక ఖతం.. ఓ భర్త చేసిన పనికి..!

|

అమ్రాబాద్‌ : కుటుంబం అన్నాక గొడవలు, తగాదాలు సహజం. ఇక భార్యాభర్తలంటే అవి కాస్తా ఎక్కువని చెప్పొచ్చు. ఒకే దగ్గర ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏదో విషయంలో తగవు పడటం సహజం. అయితే వాటిని ఓర్పుతో, సామరస్యంగా పరిష్కరించుకుంటే ఖేల్ ఖతం, దుకాణం బంద్ అనే రీతిలో అవి అక్కడికక్కడే సమసిపోతాయి. అయితే కొందరు చిన్న చిన్న తగాదాలను భూతద్దంలో చూస్తూ లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నారు. అదే క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఘటన చర్చానీయాంశంగా మారింది.

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం సార్లపల్లికి చెందిన చిగుర్ల చంద్రయ్య, లింగమ్మ దంపతులు. వీరి కాపురంలో తరచుగా గొడవలు జరుగుతుండేవి. అదే క్రమంలో మంగళవారం నాడు కూడా భార్యతో గొడవపడ్డాడు చంద్రయ్య. ఆ నేపథ్యంలో భార్య తన మాట వినలేదని కోపంతో ఊగిపోయాడు. ఆ రాత్రంతా సరిగా నిద్రపోక లేనిపోని ఆలోచనలతో పిచ్చెక్కిపోయాడు. మరునాడు బుధవారం ఉదయం నిద్ర లేచాక కత్తితో నాలుక కోసుకున్నాడు.

a husband cuts his tongue while quarrel with his wife

నగ్న చిత్రాలు పంపు.. యువతికి ఫ్రెండ్ బెదిరింపు.. చివరకు..!

అయితే కొడుకు నోటి నుంచి రక్తస్రావం జరుగుతుండటంతో తల్లి ముత్తమ్మ కంగారు పడింది. ఇదేంట్రా అని ఆరా తీయడంతో కోసిన నాలుక భాగాన్ని ఆమె చేతిలో పెట్టడంతో అవాక్కైంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అచ్చంపేట ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే అక్కడి వైద్యులు జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో అక్కడకు తీసుకెళ్లింది. అదలావుంటే మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పడంతో చేసేదేమీ లేక అక్కడకు కూడా పట్టుకెళ్లింది. అయితే సినిమా డైలాగు మాదిరి పది నిమిషాల ముందు వస్తే బతికేవారు అనే స్టైల్లో.. కొంచెం ముందు వస్తే నాలుక అతుక్కునేది.. ఇప్పుడేమీ చేయలేమంటూ డాక్టర్లు తేల్చి చెప్పడం గమనార్హం.

క్షణికావేశంలో చంద్రయ్య తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆయనకు మాటల్లేకుండా చేసింది. భార్యతో గొడవపడిన తరుణంలో ఏ మాత్రం ఆలోచించకుండా కోపంతో రగిలిపోయి నాలుక కోసుకోవడంతో చంద్రయ్యకు మాట్లాడటం ఇకపై కష్టమే మరి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chigurla Chandraiah and Lingamma are a couple from Sarlapalli in Amrabad zone of Nagar Kurnool district. There were frequent clashes in this camp. Chandraiah also clashed with his wife on Tuesday in the same order. The wife cried out in anger that she did not listen. That night he was mad at the thoughts of not sleeping properly. He woke up the next morning and cut his tongue with a knife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more