• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వామ్మో కిలాడీ.. ముంచింది లేడీ.. ఉద్యోగాలంటూ బురిడీ

|

సిరిసిల్ల : దూరపు కొండలు నునుపు అంటారు. తీరా దగ్గరకు వెళ్లి చూస్తే అంతా గరుకు గరుకు. ఇది గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకునే వారికి సరిగ్గా సరిపోతుంది. ఉన్న ఊరిలో ఉపాధి కరువై.. కడుపు చేత పట్టుకుని జీవన పోరాటానికి ఎడారి దేశాల బాట పడితే ఎంత కష్టం కష్టం. నమ్మించి మోసం చేసే ఏజెంట్లు ఒకవైపు.. డబ్బులు గుంజి ఏ దారి చూపక వెన్ను చూపే బ్రోకర్లు మరోవైపు.. ఇలా ప్రతి నిత్యం గల్ఫ్ మోజులో ఎంతో మంది మోసపోతూనే ఉన్నారు. ఆ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ లేడీ కిలాడీ పలువురి నుంచి లక్షల్లో డబ్బు గుంజి పత్తా లేకుండా పోయిన ఘటన చర్చానీయాంశమైంది.

గల్ఫ్ ఉద్యోగాల పేరిట మోసం.. లక్షలు గుంజిన లేడీ కిలాడీ

గల్ఫ్ ఉద్యోగాల పేరిట మోసం.. లక్షలు గుంజిన లేడీ కిలాడీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ మాయ లేడీ పలువురిని నిండా ముంచింది. గల్ఫ్ ఉద్యోగాల పేరిట లక్షల రూపాయలు కొల్లగొట్టింది. బాధితులు పదుల సంఖ్యలో ఉండటంతో దాదాపు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అగ్రిమెంట్ రాసిచ్చి అందినకాడికి దండుకుని పత్తా లేకుండా పరారైంది. ఆ లేడీ కిలాడీ మాయ మాటలతో నిండా మునిగిన బాధితులు ఇప్పుడు లబోదిబమంటున్నారు.

లొత్తునూర్ గ్రామానికి చెందిన అప్పని దస్తగిరి కొంతకాలం కిందట ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అక్కడ విశాఖపట్నంకు చెందిన పద్మ అనే యువతి పరిచయమైంది. అది కాస్తా ముదిరి ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఇటీవల దస్తగిరి గ్రామమైన లొత్తునూర్‌కు వచ్చి స్థానికులను నమ్మించి నిండా ముంచి పోయింది సదరు లేడీ కిలాడీ.

అతిథి గృహాలు కాదు.. వ్యభిచార కొంపలు.. కొరడా ఝలిపిస్తున్న పోలీసులు..!

లోకల్ కదా అని నమ్మితే నట్టేట ముంచి పరార్..!

లోకల్ కదా అని నమ్మితే నట్టేట ముంచి పరార్..!

దుబాయ్ నుంచి భార్యతో సహా తిరిగొచ్చిన దస్తగిరి సొంత గ్రామమైన లొత్తునూరుకు చేరుకున్నాడు. అక్కడ కొంత కాలం నుంచి ఉండి స్థానికులతో పరిచయం పెంచుకుంది పద్మ. ఆ క్రమంలో గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకునేవారికి తాను సాయం చేస్తానంటూ నమ్మించింది. తమ గ్రామానికే చెందిన దస్తగిరి భార్య కావడం.. ఇదివరకు దుబాయ్‌లో ఉండొచ్చిన నేపథ్యం ఆమెకు ఉంది కాబట్టి చాలామంది గుడ్డిగా నమ్మేశారు.

ఆ క్రమంలో తనకు పరిచయస్తుడైన ఏజెంట్ చాలా నమ్మకస్తుడని.. గల్ఫ్ దేశాల్లో మంచి కంపెనీల్లో పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తాడని పిట్ట కథ చెప్పింది. అయితే ఉన్న ఊరిలో ఉపాధి లేక అల్లాడుతున్న కొందరు ఆమె మాటలకు అట్రాక్ట్ అయ్యారు. దాంతో చాలామంది గల్ఫ్ వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఆ నేపథ్యంలో పలువురి నుంచి 20 వేలు, 30 వేలు, 80 వేలు.. అలా అందినకాడికి దండుకుంది. దాదాపు 8 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

 గడువు తేదీ తర్వాత మాయం.. లక్షలు వసూలు చేసిన వైనం

గడువు తేదీ తర్వాత మాయం.. లక్షలు వసూలు చేసిన వైనం

2018, అక్టోబర్ నెలలో ఈ మోసానికి తెర తీసింది పద్మ. కొందరికి నమ్మకం కలిగేలా బాండ్ పేపర్లు కూడా రాసిచ్చింది. ఫలానా తేదీలోగా గల్ఫ్ దేశాలకు పంపకుంటే మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తానంటూ బురిడీ కొట్టించింది. ఆ క్రమంలో గడువు తేదీ ముగిశాక బిచాణా ఎత్తేసింది. గ్రామంలో కనిపించకుండా పోవడంతో బాధితులంతా లబోదిబమంటున్నారు. చివరకు ఆమెది విశాఖపట్నం కావడంతో అక్కడకు వెళ్లి కూడా విచారించారు. అయినా జాడ దొరకలేదు. ఇన్ని రోజులు ఆమె తిరిగి వస్తుందని ఆశించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.

English summary
Who want to go to the Gulf countries, How hard it is to get to the desert countries to fight for a living. On the one hand, the agents who believe and betray the money, the brokers on the other hand. To that end, a lady in Rajanna Sirisilla district has Collected huge money from youth in the name gulf job.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more