బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుండె‌: 3నిమిషాల్లో బేగంపేట-సికింద్రాబాద్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మరో అరుదైన గుండె మార్పిడి ఆపరేషన్‌కు సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రి సిద్ధమయ్యారు. బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి గుండెను బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో శనివారం తీసుకొచ్చారు. బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న గుండెను ప్రత్యేక అంబులెన్స్‌లో యశోద ఆస్పత్రికి తరలించారు. గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. 12 మంది వైద్యులు ఇందులో పాల్గొన్నారు.

కేవలం మూడు నిమిషాల్లోనే ఎయిర్‌పోర్టు నుంచి యశోదకు తరలించారు. ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా సహకరించారు. కాగా, ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన మహిళకు గుండె మార్పిడి ఆపరేషన్ ప్రారంభమైందని యశోద వైద్యులు తెలిపారు.

గుండె మార్పిడికి 5 నుంచి 6 గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి కేవలం 2 నిమిషాల 48 సెకన్లలోనే ఆస్పత్రికి గుండెను తీసుకొచ్చామని చెప్పారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు గుండె తీసుకురావడానికి సహకరించిన ప్రభుత్వాలకు, పోలీసులకు వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు.

గత నెల 26న కూడా గుండె మార్పిడి చేశామని వైద్యులు గుర్తు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో గుండెను రిట్రైవల్ బాక్స్‌లో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న గుండెను ప్రత్యేక అంబులెన్స్‌లో యశోదకు తరలించారు.

బేగంపే నుంచి..

బేగంపే నుంచి..

మరో అరుదైన గుండె మార్పిడి ఆపరేషన్‌కు సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రి సిద్ధమయ్యారు.

బేగంపేట నుంచి..

బేగంపేట నుంచి..

బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి గుండెను బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో శనివారం తీసుకొచ్చారు.

బేగంపేట నుంచి..

బేగంపేట నుంచి..


బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న గుండెను ప్రత్యేక అంబులెన్స్‌లో యశోద ఆస్పత్రికి తరలించారు.

బేగంపేట నుంచి

బేగంపేట నుంచి

కేవలం మూడు నిమిషాల్లోనే ఎయిర్‌పోర్టు నుంచి యశోదకు తరలించారు. ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా సహకరించారు.

బేగంపేట నుంచి

బేగంపేట నుంచి

ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన మహిళకు గుండె మార్పిడి ఆపరేషన్ ప్రారంభమైందని యశోద వైద్యులు తెలిపారు.

బేగంపేట నుంచి ఆస్పత్రికి

బేగంపేట నుంచి ఆస్పత్రికి

గుండె మార్పిడికి 5 నుంచి 6 గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు.

బేగంపేట నుంచి ఆస్పత్రికి

బేగంపేట నుంచి ఆస్పత్రికి

బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి కేవలం 2 నిమిషాల 48 సెకన్లలోనే ఆస్పత్రికి గుండెను తీసుకొచ్చామని చెప్పారు.

ఆపరేషన్ ప్రారంభం

ఆపరేషన్ ప్రారంభం

బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు గుండె తీసుకురావడానికి సహకరించిన ప్రభుత్వాలకు, పోలీసులకు వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు.

English summary
A 30 year old man who met with an accident near Electronic city two days ago, is now a savior for four different patients. The man, declared brain dead at PMSSY hospital on Saturday early morning, used to earn his living as a labourer in the city and was a native of Sholapur in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X