వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్ బుక్ ద్వారా మహిళకు కుచ్చుటోపీ : 7లక్షలు స్వాహా

|
Google Oneindia TeluguNews

పాలకుర్తి : మానవ సంబంధాలన్నీ ఫేస్ బుక్ ఖాతాలతో ముడిపడి పోతున్న నేపథ్యంలో.. ఛాటింగులతోనే స్నేహాలు ఖండాంతరాలు దాటిపోతున్నాయి. అయితే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్లు.. ఫేస్ బుక్ సంబంధాలు కూడా ఆర్థిక సంబంధాలుగానే మారిపోతున్నాయి. అమాయకులకు కుచ్చు టోపీ పెట్టడానికే కాచుకు కూర్చునేవారు ఫేస్ బుక్ లో కోకొల్లలలు.

తాజాగా మహబూబ్ నగర్ జిల్లా పాలకుర్తికి చెందిన అనంతోజు రజిత అనే మహిళ ఇదే తరహాలో మోసపోయింది. ఫేస్ బుక్ లో పరిచయమైన టోని మార్క్ అనే అమెరికా వ్యక్తిని గుడ్డిగా నమ్మి రూ.7 లక్షలు ముట్టజెప్పింది. తీరా అతడు మోసం చేశాడని తెలిశాక ఇప్పుడు రజిత బాధ అరణ్య రోదనగా మారింది.

A mahaboob nagar woman cheated by an American through facebook

పాలకుర్తి మండల కేంద్రంలో ఉండే రజిత సొంతంగా కొన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వాటికి సంబంధించిన ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేసేది. ఇదే క్రమంలో ఆ ఫోటోలను చూసిన టోని మార్క్ అనే అమెరికా వ్యక్తి సేవా కార్యక్రమాలు బాగా చేస్తున్నారంటూ రజితతో ఫేస్ బుక్ లోనే మాటలు కలిపాడు.

అంతేకాదు.. రజిత సేవా కార్యక్రమాలకు తానూ ఆర్థిక సహాయం అందిస్తానని రజితకు మాయ మాటలు చెప్పాడు. అయితే అంతకుముందు తనకు ఓ అత్యవసరం ఏర్పడిందని.. అందుకు రూ.7లక్షలు సర్దాలని రజితను కోరగా.. టోనీ చెప్పినట్లుగానే అతని ఖాతాలో రూ.7లక్షలు వేసింది రజిత. బంధువులు, స్నేహితుల వద్ద అప్పుచేసి అంత డబ్బు తెచ్చిన రజిత.. తీరా టోనీ ప్లేటు ఫిరాయించడంతో లబోదిబో అంటోంది.
తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్న రజిత.. ఆఖరికి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

English summary
A mahaboob nagar woman namely anantoju rajita who lives in palakurthy was cheated by an American through facebook. She transfered 7 lakh rupees to him
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X