వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీ భర్తకు చెబుతా.!: ఆమెకు ఇద్దరితో సాన్నిహిత్యం, ఒకరితో మరొకరిని చంపించి.. తానూ ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

గద్వాల: ఆ యువతికి అప్పటికే వివాహమైంది. అయితే, ఆమెకు పరిచయం ఉన్న ఓ వ్యక్తి తమ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఆమె భర్తకు, అత్తింటివారికి చెబుతానంటూ బెదిరింపులకు గురిచేశాడు. దీంతో ఆందోళన చెందిన ఆమె అతడ్ని హత్య చేయించింది. అయితే, ఈ విషయం బయటపడేసరికి ఏం చేయాలో తెలియని స్థితిలో బలవన్మరణానికి పాల్పడిందా వివాహిత. దీంతో ఇద్దరి జీవితాలు అర్ధాంతరంగా ముగిశాయి. ఈ ఘటన గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది.

ఇద్దరితో స్నేహంగా..

ఇద్దరితో స్నేహంగా..

ఈ ఘటనలకు సంబంధించిన వివరాలను గద్వాల డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ హనుమంతు మీడియాకు వెల్లడించారు. గద్వాలలోని బురదపేటకు చెందిన ప్రైవేటు ఉద్యోగి కార్తీక్(31) . గద్వాలకు చెందిన రాగసుధ వివాహం అనంతరం మహూబ్‌నగర్‌లో స్థిరపడింది. అయితే, కాలేజీలో తనతోపాటు చదివిని కార్తీక్‌ ఆమెతో తరచూ మాట్లాడేవాడు. తన సూపర్ సీనియర్ అయిన రవితో కూడా ఆమె సన్నిహితంగా ఉండేది.

బెదిరించడంతో కార్తీక్‌ను చంపించింది..

బెదిరించడంతో కార్తీక్‌ను చంపించింది..

కాగా, కార్తీక్, రాగసుధల మధ్య ఇటీవల మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో తమ పరిచయం సంగతి ఆమె భర్తకు, కుటుంబసభ్యులకు చెబుతానని పలుమార్లు కార్తీక్ అమెను బెదిరింపులకు గురిచేశాడు. దీంతో కార్తీక్‌ను ఎలాగైనా తుదముట్టించాలనుకుంది. రవితో కలిసి కార్తీక్ హత్యకు ప్లాన్ వేసింది. రవి, అతడి స్నేహితులు అనిల్, రంజిత్, వసంత్, వీరేశ్, భీం, సునీల్, ఉదయ్ కలిసి ఫిబ్రవరి 24-25 తేదీల మధ్య కార్తీక్‌ను గద్వాల సమీపంలోని నదీ ఆగ్రహారం వద్దకు తీసుకెళ్లారు. కార్తీక్‌కు మద్యం తాగించి ఆ తర్వాత ఇనుపరాడ్లతో కొట్టి చంపారు.

నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

అనంతరం కార్తీక్ మృతదేహాన్ని కారులో కొండపల్లి గుట్టలపైకి తీసుకెళ్లి అక్కడే పాతిపెట్టి పరారయ్యారు. కార్తీక్ మృతదేహం శుక్రవారం బయటపడటంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో తన పేరు బయటపడుతుందనే భయంతో రాగసుధ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో కార్తీక్ హత్య కేసులో నిందితులైన రవి, అనిల్, వసంత్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగితా నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరో నిందితుడు ఉన్నాడంటూ కార్తీక్ తల్లిదండ్రులు..

మరో నిందితుడు ఉన్నాడంటూ కార్తీక్ తల్లిదండ్రులు..

కాగా, రాగసుధ ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన ఏడు పేజీల సూసైడ్ నోట్‌ను, ఆమె ఫోన్ స్వాధీనం చేసుకున్న మహబూబ్‌నగర్ పోలీసులు గద్వాల జిల్లా పోలీసులకు అందించారు. తమ కుమారుడి హత్యపై తమకు అనుమానాలున్నాయని, రవితోపాటు అజయ్ అనే వ్యక్తి కూడా నిందితుల్లో ఉన్నారని, అతడ్ని ఎందుకు కేసులో చేర్చలేదని కార్తీక్ తల్లిదండ్రులు పోలీసులను ప్రశ్నించారు. తమ కుమారుడి హత్య కారణమైనవారందర్నీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇదే నా చివరి మెసేజ్: రుద్రవరం ఎస్ఐ అదృశ్యం, ఎస్పీ మందలింపే కారణమా?ఇదే నా చివరి మెసేజ్: రుద్రవరం ఎస్ఐ అదృశ్యం, ఎస్పీ మందలింపే కారణమా?

English summary
A married woman committed suicide after her friend murdered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X