• search
 • Live TV
ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నర్సుకు కడుపు చేసిన డాక్టర్ .. మందుల చీటీపై ఏమి రాసిచ్చాడంటే

|

చాలా పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి కూడా ఓ డాక్టర్ పాడు పని చేశాడు. ఆస్పత్రి పని చేస్తున్న నర్సునే లోబరుచుకుని ఆమెకు కడుపు చేశాడు. తీరా కడుపని తెలిశాక గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించుకోవాలని ఆ మహిళ పై ఒత్తిడి పెట్టాడు . అంతేనా ఆమెకు మందుల చీటీపై పలు హామీలను రాసిచ్చాడు . ఇప్పుడు సదరు డాక్టర్ గారి హామీల చీటీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రిస్క్రిప్షన్ మీద ఆ డాక్టర్ రాసిచ్చిన హామీలను చదివిన వారు అవాక్కయ్యారు. ఇదేం మాయ రోగం.. పాడుపని చెయ్యటం ఎందుకు ? కడుపు వచ్చిందని అబార్షన్ చేయించుకోమనటం ఎందుకు అని చర్చ పెడుతున్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులు బౌన్స్ పై సీఎం జగన్ సీరియస్ .. టీడీపీకి షాక్ ఇచ్చేందుకు ప్లాన్ రెడీ

  రోజుకో రకమైన దొంగ బంగారం తాకట్టు
  కోదాడలో ఓ వైద్యుడి నిర్వాకం .. నర్సుతో ప్రేమాయణం .. గర్భవతి అయిన నర్సు

  కోదాడలో ఓ వైద్యుడి నిర్వాకం .. నర్సుతో ప్రేమాయణం .. గర్భవతి అయిన నర్సు

  ఇక అసలు విషయానికి వస్తే కోదాడలో ఓ ప్రముఖ వైద్యుడు గా పేరున్న ఓ డాక్టర్ తన వద్ద నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిని లైంగికంగా లోబర్చుకున్నాడు. దీంతో ఆమె గర్భవతి అయ్యింది. ఇక విషయం ఆస్పత్రిలోనే కాదు , డాక్టర్ గారి భార్య దాకా వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన భార్య సదరు నర్సును వైద్యశాలనుంచి బయటకు పంపించింది. అయినా సదరు వైద్యుడు ఆ నర్సుతో స్థానికంగానే వేరే చోట రహస్య కాపురం పెట్టించాడు. నీకు నేను అండగా ఉంటానని నమ్మించాడు . ఇక ఆమెను అబార్షన్‌ చేయించుకోవాలని ఒత్తిడి పెంచాడు. అందుకు ఆమె ససేమిరా అంటూ ఒప్పుకోకపోవడంతో ఆమెకు పరిహారంగా తాను ఇస్తానని మాట ఇచ్చిన వాటిని రోగులకు మందులు రాసే చిట్టీ మీద తన ఇష్టపూర్తిగా రాసి ఇచ్చారు .

   అబార్షన్ చేయించుకోవాలని హామీలను మందుల చీటీ మీద రాసిచ్చిన వైద్యుడు

  అబార్షన్ చేయించుకోవాలని హామీలను మందుల చీటీ మీద రాసిచ్చిన వైద్యుడు

  ఇక ,మందుల చీటీ మీద రాసిన ఆ హామీల చిట్టా చూస్తే యువతి పేరు మీద రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తానని, 100 గజాల స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తానని, రూ.3 లక్షల విలువ చేసే బంగారం ఇస్తానని సంతకం చేసి ఇచ్చాడు. దీంతో ఆమె అబార్షన్‌ చేయించుకోవడానికి ఒప్పుకుంది. ఇక కోదాడలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాల వైద్యుడిని సంప్రదించి అబార్షన్ చెయ్యాలని కోరింది. ఆయన అబార్షన్‌ చేయడానికి నిరాకరించి విషయం ఆరా తియ్యగా సదరు యువతి తనకు వైద్యుడు రాసి ఇచ్చిన హామీల చీటీని ఆ వైద్యుడికి చూపించింది.

  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మందుల చీటీ పై డాక్టర్ గారి హామీల చీటీ .. నోరెళ్ళబెడుతున్న జనాలు

  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మందుల చీటీ పై డాక్టర్ గారి హామీల చీటీ .. నోరెళ్ళబెడుతున్న జనాలు

  ఇక దీంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఇక సోషల్ మీడియా లో వైరల్ చెయ్యటానికి ఎవరు పోస్ట్ పెట్టారో ఏమోగాని ఈ చీటీ ఇప్పుడు స్థానిక సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కోదాడలో ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ జరుగుతోంది. డాక్టర్ గారి నిర్వాకంపై జనం నోరెళ్ళబడుతున్నారు. పవిత్రమైన వృత్తిలో ఉండి అపవిత్రమైన పనులు చెయ్యటం దేనికి అని ప్రశ్నిస్తున్నారు. అబార్షన్ చేయించుకుంటే మాత్రం ఆ యువతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందా ? డాక్టర్ అయి ఉండి ఇదేం పాడుపని అంటూ తలా ఓ మాట అంటున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Even in a very sacred medical profession, a doctor did worse with a nurse . The doctor subdued and stomped hospital nurse. Knowing the shore, he pressured the woman to undergo abortion rather than rupture. He also wrote several promises on her in a medical prescription. Dr.'s assassination has now gone viral on social media. Those who read the doctor's assurances on prescription is now hot topic .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more