హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సుప్రీంకు చేరిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు

|
Google Oneindia TeluguNews

దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై సుప్రీం కోర్టులో పటిషన్ ధాఖలు అయింది. ఎన్‌కౌంటర్‌ చట్టబద్దంగా కొనసాగలేదని పలువురు న్యాయవాదులు సుప్రీంను ఆశ్రయించారు. ఎన్‌కౌంటర్ నేపథ్యంలోనే పోలీసులు సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించలేదని ,ఘటనపై విచారణకు ఆదేశించాలని కోరుతూ.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Disha case encounter : దిశ కేసులో షాకింగ్ నిజాలు.. అసలు ఎన్ కౌంటర్ చెయ్యటానికి కారణాలు ఇవేనా ?Disha case encounter : దిశ కేసులో షాకింగ్ నిజాలు.. అసలు ఎన్ కౌంటర్ చెయ్యటానికి కారణాలు ఇవేనా ?

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై న్యాయపరమైన చిక్కులు

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై న్యాయపరమైన చిక్కులు

దిశ హత్యచారం అనంతరం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో నిందితులను కఠినంగా శిక్షించాలని, వారికి కూడ మరణశిక్ష విధించాలని కోరుతూ..ఆందోళన ఏ మేరకు సంచలనం సృష్టించిందో.. అంతకంటే ఎక్కువగా ఎన్‌కౌంటర్ వివాదం కూడ అవుతోంది. ప్రజలంతా దిశకు న్యాయం జరిగిందని భావిస్తుంటే... మేధావులు, మరికొంతమంది రాజకీయా నాయకులు మాత్రం ఇలాంటీ సంఘటనపై చట్టబద్దతను ప్రశ్నిస్తున్నారు. ఇలా చంపుకుంటూ పోతే భవిష్యత్ పరిణామాలపై ప్రభావం చూపిస్తుందని అందోళన వ్యక్తం చేస్తున్నారు.

సుప్రీంను తాకిన దిశ ఎన్‌కౌంటర్

సుప్రీంను తాకిన దిశ ఎన్‌కౌంటర్

ఈనేపథ్యంలోనే ఇప్పటికే దిశ సంఘటనపై రాష్ట్ర హైకోర్టుకు వెళ్లడంతో ఇప్పటికే నిందితుల మృతదేహాలను భద్రపరచాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్‌కౌంటర్ కేసును సోమవారం నాడు మరోసారి విచారించనున్నట్టు స్పష్టం చేసింది. మరోవైపు ఎన్‌హెచ్‌ఆర్సీ సైతం ఎన్‌కౌంటర్ స్థలానికి చేరుకుని విచారణ చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్‌కౌంటర్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకు సైతం వెళ్లారు. ఎన్‌కౌంటర్లపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలను తెలంగాణ పోలీసులు ఫాలో కాలేదని పిటిషన్ ధాఖలు చేశారు.

 ఎన్‌కౌంటర్లపై సుప్రీం మార్గదర్శకాలు

ఎన్‌కౌంటర్లపై సుప్రీం మార్గదర్శకాలు

ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో ఎన్‌కౌంటర్లు జరిగినప్పుడు సంబంధిత పోలీసులు ఈ క్రింది మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎదైన సంఘటన జరిగినప్పుడు 1, నిందితులు ఆయా ప్రాంతాల్లో ఉన్నారనే సమాచారాన్ని వెంటనే పోలీసుల రికార్డ్ చేయాల్సి ఉంటుంది. 2 అనంతరం ఎన్‌కౌంటర్ మరణాలను తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. 3 ఎన్‌కౌంటర్‌పై పోలీసుల దర్యాప్తుతోపాటు సీఐడీ దర్యాప్తు కూడ చేయడంతో పాటు మొత్తం పోస్ట్ మార్టంను వీడియో తీయించాలి.4 నాలుగు మెజస్టీయల్ విచారణ జరిపించాలి. 5 ఎన్‌కౌంటర్ తర్వాత జాతీయ మానవహక్కుల కమీషన్‌కు వెంటనే సమాచారం అందించాలి. 6. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను సాధ్యమైనంత త్వరగా కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.

7 వీటితో పాటు మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. 8 ఎన్‌కౌంటర్‌ జరిగిన వెంటనే పోలీసులు తుపాకీలను పై అధికారుల ముందు సరెండర్‌ చేయాలి, 9 ఇక ఎన్‌కౌంటర్లు జరిగిన తర్వాత బాధిత కుటుంబాలు కోర్టులను ఆశ్రయించవచ్చనే నిబంధనలతో పాటు ఇతర నిబంధనలు కూడ ఉన్నాయి.అయితే ఇవన్నింటిని కూడ పోలీసులు అధికారకంగా చేశారా లేదని హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టు విచారణలో తేలాల్సి ఉంటుంది.

English summary
A Petition was filed in Supreme Court against encounter in disha case. advocates have resorted to the Supreme Court to saying that police did not fallow the sc guidelines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X