వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జనగామలో కానిస్టేబుల్ నిర్వాకం: పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కుమార్తె పుట్టినరోజు వేడుకలు..!

|
Google Oneindia TeluguNews

వరంగల్: భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. లాక్‌డౌన్‌ను నిబంధనలను ఉల్లంఘించడానికి పోలీసులు కుటుంబాలను వదిలి, రోజంతా రోడ్ల మీదే గడుపుతున్నారు. పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కరోనా వైరస్ విస్తరిస్తోన్నప్పటికీ.. పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధుల్లో పాల్గొంటున్నారు.

ఈ పరిస్థితుల్లో ఓ కానిస్టేబుల్ తన కుమార్తె మొట్టమొదటి పుట్టినరోజు వేడుకలను నిర్వహించడానికి పోలీస్ స్టేషన్ ఆవరణనే వేదికగా చేసుకున్నారు. ఆయన పేరు నాగరాజు. జనగామ జిల్లా గుండాల పోలీస్ స్టేషన్‌ ఆయన పని చేస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయం పరిధిలోకి వస్తుందీ పోలీస్ స్టేషన్. లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేయాల్సిన కానిస్టేబుల్.. ఏకంగా పోలీసు స్టేషన్ ఆవరణలోని తన క్వార్టర్స్‌లో కుమార్తె పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం కలకలానికి దారి తీసింది.

A Police constable organised his daughters 1st birthday in the Police Station premises

ఈ వేడుకల కోసం ఆయన స్థానిక ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. తోటి పోలీసు సిబ్బందితో పాటు బంధుమిత్రులను ఈ పుట్టిన రోజు కార్యక్రమానికి ఆహ్వానించారని అంటున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కార్యక్రమానికి హాజరైన వారు కనీసం సోషల్ డిస్టెన్సింగ్ కూడా పాటించలేదనే విషయం వీడియో ద్వారా స్పష్టమౌతోంది. వచ్చినవారంతా గుంపులు గుంపులుగా నిల్చొని కనిపించారు.

Recommended Video

విలాసవంతమైన జీవితం కోసం 'పటాస్' కమెడియన్ దొంగగా మారాడు

బర్త్‌డే వేడుకలను హాజరైన వారిలో ఏ ఒక్కరికైనా కరోనా వైరస్ సోకి ఉంటే.. అది ఆ చిన్నారిని కూడా వదలదనే విషయం తెలియనిది కాదు. అయినప్పటికీ.. నిర్లక్ష్యంగా వ్యవహరించారా కానిస్టేబుల్. కనీసం సామాజిక దూరాన్నయినా పాటించి ఉండాల్సిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్ల మీదికి వస్తోన్న జనాన్ని చితక్కొడుతున్న పోలీసులే ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఎలా అని జనం ప్రశ్నిస్తున్నారు.

English summary
Nagaraju, a police constable posted at Gundala police station under Warangal police commissionerate, organised his daughter’s 1st birthday. He invited several people to the party held outside his quarter which is located close to the police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X