• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీ , నిజామాబాద్ ఎంపీ అరవింద్ ముందుంది అసలు టాస్క్ .. ఇల్లలకగానే పండుగ కాదు

|

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించిన ధర్మపురి అరవింద్ ఇల్లలకగానే పండగ కాదు అని అంటున్నారు నిజామాబాద్ ప్రజలు. ఎందుకంటే తెలంగాణ లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తాను ఎంపీగా గెలిచిన 5 గంటల లో పసుపు బోర్డు ఏర్పాటును చేసి చూపిస్తానని ఎన్నికలకు ముందు నిజామాబాద్ ఓటర్లకు, రైతులకు చెప్పిన అరవింద్ కు, అలాగే తెలంగాణ బీజేపీకి ఇప్పుడు అసలు టాస్క్ మొదలైంది. తాను చెప్పిన మాట చేసి చూపిస్తానని

కోమటి రెడ్డి సంచలనం .. వైఎస్సార్ ఒకడుగు వేస్తే జగన్ రెండు అడుగులేస్తారుకోమటి రెడ్డి సంచలనం .. వైఎస్సార్ ఒకడుగు వేస్తే జగన్ రెండు అడుగులేస్తారు

పసుపు బోర్డు ఏర్పాటు కోసం మాటిచ్చిన బాండ్ రాసిచ్చిన ధర్మపురి అరవింద్ .. పసుపు బోర్డు ఏర్పాటు మొదటి టాస్క్

పసుపు బోర్డు ఏర్పాటు కోసం మాటిచ్చిన బాండ్ రాసిచ్చిన ధర్మపురి అరవింద్ .. పసుపు బోర్డు ఏర్పాటు మొదటి టాస్క్

నిజామాబాద్ రైతులు పసుపు బోర్డు ఏర్పాటు కోసం, పసుపు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్ తో చాలాకాలం ఆందోళన చేశారు. నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో 176 మంది రైతులు బరిలోకి దిగి కెసిఆర్ తనయ కవిత ఓటమికి కారణమయ్యారు. అలాంటి రైతులకు పసుపు కోర్టు ఏర్పాటుకు తాను కృషి చేస్తానని పసుపు బోర్డు తీసుకున్న పక్షంలో, పసుపు ఎర్రజొన్న గిట్టుబాటు ధర తీసుకురా లేనిపక్షంలో తన పదవికి రాజీనామా చేసి తాను సైతం రైతులతో కలిసి ఉద్యమంలో పాల్గొంటానని మాటిస్తున్నాను అంటూ ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ మీద రాసి రైతులకు ఇచ్చారు. ఇప్పుడు కేంద్రంలో బిజెపి ని ఒప్పించి పసుపు బోర్డు ఏర్పాటు చేసే దిశగా ధర్మపురి అరవింద్ కృషి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే తెలంగాణ బిజెపి నిజామాబాద్ ప్రజల నమ్మకాన్ని చూరగొనాలి అంటే పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో అధిష్టానాన్ని ఒప్పించాల్సి ఉంటుంది.

గతంలో పలు ఉద్యమాలు చేసినప్పటికీ పసుపు బోర్డు ప్రకటించని కేంద్రం

గతంలో పలు ఉద్యమాలు చేసినప్పటికీ పసుపు బోర్డు ప్రకటించని కేంద్రం

గతంలో రైతులు అనేక ఉద్యమాలు చేసిన సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయి. ఇక తాజాగా పోరుబాట పట్టిన రైతులు పసుపు బోర్డు కోసం వారణాసిలో మోడీపై సైతం నామినేషన్లు దాఖలు చేశారు. ఒక నామినేషన్ మినహాయించి మిగతా అందరి దగ్గర నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. అయినప్పటికీ తమ డిమాండ్స్ కేంద్ర ప్రభుత్వానికి తెలియాలని ఉద్దేశంతోనే, దేశవ్యాప్తంగా రైతుల సమస్యలపై చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే రైతులు ఎన్నికల బరిలోకి దిగారు.

పసుపు బోర్డు సాధన ధర్మపురి అరవింద్, తెలంగాణా బిజెపి విస్వసనీయతకు పరీక్ష

పసుపు బోర్డు సాధన ధర్మపురి అరవింద్, తెలంగాణా బిజెపి విస్వసనీయతకు పరీక్ష

ఇక ధర్మపురి అరవింద్ సైతం పసుపు పార్టీ ఏర్పాటు బీజేపీతోనే సాధ్యమవుతుందని, దాని కోసం తాను కృషి చేస్తానని చెప్పి మరి, ప్రజలకు హామీ ఇచ్చి మరి ప్రచారం నిర్వహించారు. బిజెపి జాతీయ నాయకులతో సైతం పసుపు వంటి విషయాలలో సానుకూల ప్రకటన చేయించారు. కానీ పసుపు బోర్డు సాధిస్తారా లేదా అన్నది ధర్మపురి అరవింద్ ముందున్న మొదటి సమస్య. అంతేకాకుండా బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని కూడా చెప్పిన అరవింద్ బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తారా లేదా అన్నది కూడా ఆయన ముందు ఉన్న సమస్యే . నిజామాబాద్ లో తెలంగాణ సీఎం కుమార్తె కల్వకుంట్ల కవితను ఓడించి విజయం అయితే సాధించాడు కానీ అసలు టాస్క్ ధర్మపురి అరవింద్ కి ఇప్పుడు మొదలైంది. పసుపు బోర్డు సాధన ధర్మపురి అరవింద్, బిజెపి ముందున్న మొదటి పరీక్ష. ఇది తెలంగాణ బీజేపీ విశ్వసనీయతకు పరీక్ష.

English summary
The people of Nizamabad said to Dharmapuri Aravind , who succeeded as MP from Nizamabad parliamentary constituency that he must be responsible for his victory . The time has come for Dharmapuri Aravind to keep his promise to the people during the Lok Sabha elections.The first task for the BJP in Telangana is started with Nizamabad voters and Aravind, who told to the farmers that before the polls that he would show the yellow board set up in 5 hours after winning as an MP. Aravind wrote it on a Bond Paper that he will fulfill his words in case of not standing on his words he will resign his designation as an MP , and now it is going to retain the question of Nizamabad farmers .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X