జనగామ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: డ్రైవింగ్ చేస్తూ నీలిచిత్రాలు చూస్తున్న ఆర్టీసీ డ్రైవర్, పట్టేశారిలా..

నావిగేషన్ కోసం ఇచ్చిన ట్యాబ్‌లను కొందరు ఆర్టీసీ డ్రైవర్లు దుర్వినియోగం చేస్తున్నట్లు ఈ ఘటన బట్టి తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

జనగామ: నావిగేషన్ కోసం ఇచ్చిన ట్యాబ్‌లను కొందరు ఆర్టీసీ డ్రైవర్లు దుర్వినియోగం చేస్తున్నట్లు ఈ ఘటన బట్టి తెలుస్తోంది. ఇటీవల ప్రవేశపెట్టిన మినీ వజ్ర బస్సులో ఓ డ్రైవర్ నీలిచిత్రాలు(బ్లూ ఫిల్మ్స్) చూస్తూ పట్టుబడ్డాడు. అది కూడా ప్రయాణికులతోపాటు కూడిన బస్సు నడుపుతూ కావడం గమనార్హం. ఇది గమనించిన నాగలింగం అనే ప్రయాణికుడు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి నాగలింగం తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్-2 డిపోకు చెందిన టీఎస్03జెడ్ 0340 నెంబర్ గల వజ్ర బస్సు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి వెళ్తోంది. బస్సు స్టేషన్‌ ఘన్‌పూర్ దాటగానే ఒక్కసారిగా కుదుపుకు లోనయింది.

A rtc bus driver seeing bluefilms while driving

దీంతో అనుమానం వచ్చిన నాగలింగం డ్రైవర్‌కేసి చూడగా నావికేషన్ కోసం ఉపయోగిస్తున్న ట్యూబ్‌లో నీలి చిత్రాలు చూస్తున్నట్లు గమనించాడు. వెంటనే బస్సు ఆపి డ్రైవర్‌ను నిలదీశాడు. అయితే, డ్రైవర్‌ మాత్రం నాగలింగంనే బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో బస్సుతో సహా జనగామ డిపోకు తీసుకెళ్లి అధికారులకు ఫిర్యాదు చేశాడు నాగలింగం.

డ్రైవర్ బుకాయిస్తుండటంతో ట్యాబ్‌లోని యూట్యూబ్‌లో ఉన్న నీలి చిత్రాలకు సంబంధించిన వీడియోలను చూపించారు. నావిగేషన్ కోసం ఆర్టీసీ సంస్థ ట్యాబ్‌లు ఏర్పాటు చేస్తే నీలి చిత్రాల కోసం వాటుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగలింగం ఫిర్యాదు అందుకున్న హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్.. ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి విషయాన్ని తెలిపారు. కాగా, డ్రైవర్‌పై తీసుకోవాలని నాగలింగం కోరారు.

English summary
A rtc bus driver seeing blue films while driving in Janagaon district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X