హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహమూద్ అలీ మనవడిపై ర్యాగింగ్ కేసు: తమను కాపాడాలంటూ పోలీసులకు వేడుకోలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మనవడు ఫరాన్‌పై పంజాగుట్ట పోలీసులకు ఓ ఫిర్యదు అందింది. అతడు ర్యాగించే స్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కొందరు విద్యార్థులు భయాందోళనలు వ్యక్తం చేశారు.

ఫరాన్ నుంచి తమను కాపాడాలంటూ ఓ విద్యార్థి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హోంమంత్రి మనవడు ఫరాన్ బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు.

కాగా, ఫరాన్ తమను ర్యాగింగ్ చేస్తున్నాడంటూ అదే కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థి రియాన్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం రియాన్ మీడియాతో మాట్లాడాడు. తన చేతికి అయిన గాయాలను రియాన్ మీడియాకు చూపించాడు. ఫరాన్ నుంచి తమను కాపాడాలని కోరాడు.

 A student lodge complaint on home minister mahmood ali grandson over ragging

బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న యువకుడి హత్య

గంజాయి, వైట్‌నర్‌లకు బానిసగా మారి స్థానికులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న యువకుడు హత్యకు గురయ్యాడు. తనకు రూ. 2వేలు కావాలని ఓ వ్యక్తిని బెదిరించడంతో అతను ఇవ్వలేదు. దీంతో తన వద్ద ఉన్న కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించిన నిందితుడిపై ఎదురుదాడి చేసి హత్య చేశాడు బాధితుడు. ఘటనపై ముషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఫయాజ్ అలియాస్ ఫర్వేజ్(23) చిన్నప్పటి నుంచి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. గంజాయి, వైట్‌నర్ తాగుతూ అవసరాల కోసం స్థానికులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు.

శుక్రవారం రాత్రి కూడా భోలక్‌పూర్‌లో బారాత్ జరుగుతుండగా సద్దాం హుస్సేన్ అనే వ్యక్తి వద్దకు వెళ్లిన ఫర్వేజ్ తనకు రూ. 2వేలు కావాలని డిమాండ్ చేశాడు. డబ్బులేదని చెప్పడంతో అతడిపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు ఫర్వేజ్. అప్రమత్తమైన సద్దాం.. ఫర్వేజ్ చేతిలోని కత్తిని లాక్కుని తన స్నేహితుడు గౌస్ సహకారంతో అతని పొట్టపొడిచాడు. తీవ్రరక్తస్రావం కావడంతో ఫర్వేజ్ కిందపడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అతడ్ని గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సద్దాం, గౌస్‌లపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
hyderabad student lodge complaint on home minister mahmood ali grandson over ragging.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X