వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిల్లి తప్పిపోయింది...! పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు...! పిల్లిని తెచ్చిస్తే 10వేల బహుమానం..!

|
Google Oneindia TeluguNews

పోలీస్ స్టేషన్లలో పెంచుకున్న కుక్కలు మాయమయ్యాని కేసులను చూశాం,కాని ఇంట్లో పెంచుకునే పిల్లి మాయమైందని ఓ విచిత్రమైన కేసు బంజారహిల్స్ పోలీసు స్టేషన్‌లో నమోదైంది. ఒక వ్యక్తి నిర్లక్ష్యం వల్ల తాను పెంచుకునే పిల్లి అదృశ్యమైందని, వారిపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ పిర్యాధు చేసింది.దీంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. చివరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సికింద్రబాద్ సమీపంలోని తిరుమలగిరిలో రాజేశ్వరి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పెంపుడు జంతువులు, పక్షులను పెంచుకుంటుంది. అయితే బంజారాహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌ 3లోని శ్రీనికేతన్‌కాలనీలో నివాసం ఉండే వ్యక్తితో పరిచయమై, ఈ నెల 13న ఫేస్‌బుక్‌ ద్వారా బ్లెస్సీ అనే పిల్లిని దత్తతకు ఇచ్చింది. అయితే పిల్లికి వ్యాక్సిన్ వేయించాలని వారం రోజుల క్రితం పిల్లిని దత్తత తీసుకున్న వ్యక్తికి ఫోన్ చేసింది.అయితే పిల్లిని దత్తత తీసుకున్న వ్యక్తి మూడు రోజుల పాటు ఇంటి చుట్టు తిరిగినా పిల్లిని ఇవ్వకపోగా ,పోంతన లేని సమాధానాలు చెప్పాడు.

a Surprised cat missing case was registerd at Banjarahills police station

దీంతో మూడు రోజుల పాటు తిరిగిన మహిళ చివరికి గట్టిగా నిలదీయడంతో పిల్లి ఎక్కడికో పారిపోయిందని చెప్పాడు. దీంతో పిల్లి అదృశ్యంపై ఆవేదన చెందిన రాజేశ్వరి బంజరాహిల్స్ పోలీసులను అశ్రయించి కేసు నమోదు చేయించింది. దీంతోపాటు పిల్లిని తెచ్చి ఇచ్చిన వారికి 10 వేల రుపాయల బహుమతి కూడ ఇస్తానని ప్రకటించి తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. కాగా పిల్లి కోసం పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీస్తున్నారు.

English summary
A strange case has been reported at Banjarahills Police Station. Rajeshwari, a software engineer from Tirumalagiri, complained to the police about the disappearance of a cat named Blessy.Surprised by the woman's complaint, the police went into full detail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X