ఇద్దరు నిర్మాతలను గట్టిగా పిండిన తెలుగు హీరో!!
ఒక కథానాయకుడికి సినిమా చేసేటప్పుడు రెమ్యునరేషన్ మూడుసార్లుగా ఇస్తారు. అడ్వాన్స్‌గా కొంత, షూటింగ్ ప్రారంభమయ్యాక మరికొంత, షూటింగ్ పూర్తవగానే మిగతా అమౌంట్ చెల్లిస్తారు. ఏ సినిమాకైనా ఇది సహజంగా జరిగేదే. అయితే ఒక తెలుగు కథానాయకుడు షూటింగ్ సమయంలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న సినిమాకు ఒక పేచీ పెట్టాడు. షూటింగ్ జరుగుతున్నసమయంలోనే మొత్తం అమౌంట్ ఇచ్చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆ నిర్మాత కూడా మొత్తం అమౌంట్ ఇచ్చేశాడు.

డబ్బింగ్ సమయంలో పేచీ
అయితే సదరు హీరోగారు ఆ సినిమా డబ్బింగ్ సమయంలో మళ్లీ పేచీ పెట్టాడు. డబ్బింగ్ చెప్పాలంటే రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అగ్రిమెంట్లో అది లేదుకదా అని నిర్మాత అడిగితే డబ్బింగ్ చెప్పనన్నాడు. చేసేదేమీ లేక సదరు హీరోకు అదనంగా మరో రెండుకోట్ల రూపాయలు చెల్లించి మరీ ఆ నిర్మాత డబ్బింగ్ చెప్పించుకున్నారు. అంత క్రేజ్ తెచ్చుకున్న ఆ సినిమా తీరా విడుదలైన తర్వాత మొదటి రోజు మొదటి ఆటకే అట్టర్‌ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

రూ.2 కోట్లు కావాలంట!!
ఇదంతా జరిగిపోయిన సంగతి. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే సదరు కథానాయకుడుగారు షూటింగ్లో ఉన్న మరో సినిమాకు సంబంధించిన నిర్మాతతో పేచీపెట్టాడు. . ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఒక పాట, డబ్బింగ్ చెప్పడం మిగిలింది. అవి పూర్తి కావాలంటే రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇటీవలే ఇలాంటి సంఘటన జరిగింది.. మీరు కూడా రూ.2 కోట్లు ఇచ్చేయండి పని పూర్తయిపోతుందని చెప్పారు. ఆ నిర్మాత షాక్ తిన్నాడు.

బిజినెస్ అంతంతమాత్రంగానే జరుగుతోంది
ఎందుకంటే ఆ సినిమాకు బిజినెస్ అంతంతమాత్రంగానే జరుగుతోంది. దాంతోపాటు ఖర్చు కూడా బాగా పెరిగింది. ఇటువంటి సమయంలోనే హీరోగారు పారితోషికం తగ్గించుకొని నిర్మాతకు సహకరించాలికానీ పేచీ పెట్టడం ఏమిటని ఫిల్మ్‌నగర్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరి నిర్మాత ఆ డబ్బులు ఇస్తారా? లేదంటే హీరోగారు డబ్బింగ్ చెబుతారా? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు.!! సదరు హీరోకు ఫ్లాపులున్నా వరుసగా చేతిలో సినిమాలుంటాయి. మాస్, కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరు.