హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెల్యూట్ సార్: వికలాంగుడిని భుజాలపై ఎత్తుకుని వరదను దాటించారు(వీడియో)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురవగా.. మరికొన్ని జిల్లాల్లో మోస్తారు వాన పడింది. వికారాబాద్‌ జిల్లా, మహబూబ్‌ నగర్‌, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తారుగా వర్షం కురిసింది.

పలు జిల్లాల్లో భారీ వర్షాలు

పలు జిల్లాల్లో భారీ వర్షాలు

కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. నిజామాబాద్‌ జిల్లాలో కూడా జోరువాన కురిసింది. వరంగల్‌ జిల్లాలోని పలుచోట్ల సాధారణ వర్షపాతం నమోదైంది.

టెక్సాస్‌లో కాల్పులు: ఐదుగురు మృతి, 21మందికి తీవ్రగాయాలుటెక్సాస్‌లో కాల్పులు: ఐదుగురు మృతి, 21మందికి తీవ్రగాయాలు

మరో రెండ్రోజులపాటు..

మరో రెండ్రోజులపాటు..

ఇది ఇలా వుంటే, రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుండటంతో రాగల మరో రెండు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

నగరంలోని పలు ప్రాంతాల్లోనూ..

నగరంలోని పలు ప్రాంతాల్లోనూ..

హైదరాబాద్‌ మహా నగరంలోని నాంపల్లి, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, షేక్‌పేట్‌, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో జల్లుల నుంచి ఓ మోస్తారు వర్షం పడింది. వచ్చే రెండు రోజులు గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

సెల్యూట్ కొట్టాల్సిందే..

హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు పలు రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎల్బీనగర్ వద్ద వరదనీటిలో వెళ్లలేక ఇబ్బంది పడుతున్న ఓ వికలాంగుడిని ఎ. నాగమల్లు అనే ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ తన భుజాలపై ఎత్తుకుని దాటించాడు. వృత్తిపట్ల నిబద్ధత, మానవత్వం కలిగిన ఆ పోలీసును అక్కడివారు అభినందించారు. వరదనీటిని దాటిస్తున్న వీడియో వైరల్ కావడంతో సదరు పోలీసు అధికారిపై నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

English summary
Hyderabad: A traffic police inspector, A Nagamallu carried a man who had a plastered foot, on his back across a waterlogged road in LB Nagar, yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X