వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైలో గెలుపు: మోడీకి మద్దతు, 2 మినహా మహారాష్ట్ర బీజేపీదే!

బృహన్ ముంబై కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. గతంలో 31 స్థానాలు గెలిచిన బీజేపీ ఇప్పుడు ఏకంగా 81 స్థానాలకు ఎగబాకింది. అద్భుత విజయంతో బీజేపీ సంబరాలు చేసుకుంటోంది.

|
Google Oneindia TeluguNews

ముంబై: బృహన్ ముంబై కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. గతంలో 31 స్థానాలు గెలిచిన బీజేపీ ఇప్పుడు ఏకంగా 81 స్థానాలకు ఎగబాకింది. అద్భుత విజయంతో బీజేపీ సంబరాలు చేసుకుంటోంది.

<strong>ముంబైలో శివసేన-బీజేపీ హవా: ముందే రిజైన్ చేసిన కాంగ్రెస్ చీఫ్</strong>ముంబైలో శివసేన-బీజేపీ హవా: ముందే రిజైన్ చేసిన కాంగ్రెస్ చీఫ్

ఈ విజయం పైన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. పారదర్శక పాలనకు ప్రజలు ఓటేశారని చెప్పారు. తమ విజయం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజల మద్దతు తేటతెల్లమవుతోందని చెప్పారు.

ప్రధాని మార్గదర్శకత్వంలో..

ప్రధాని మార్గదర్శకత్వంలో..

ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకంలో పని చేసి తాము ముంబైలో గెలుపొందామని చెప్పారు. బీజేపీకి మద్దతు పలికినందుకు ముంబై, మహారాష్ట్ర ప్రజలకు ఫడ్నవీస్ కృతజ్ఞతలు తెలిపారు.

మోడీకి ప్రజల మద్దతు

మోడీకి ప్రజల మద్దతు

ఈ గెలుపు ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజల మద్దతుకు నిదర్శనం అని ఫడ్నవీస్ అన్నారు. బీఎంసీలో 227 స్థానాలు ఉన్నాయి. బీజేపీ - శివసేన వేర్వేరుగా పోటీ చేశాయి. బీజేపీ 81 స్థానాలు, శివసేన 84 స్థానాలు గెలుచుకుంది.

కాంగ్రెస్‌కు షాక్

కాంగ్రెస్‌కు షాక్

కాంగ్రెస్‌ పార్టీ కేవలం 31 స్థానాలు గెలుచుకుంది. ఎన్సీపీ కేవలం 9 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) 9 స్థానాల్లోనూ, ఇతరులు 14 స్థానాల్లోనూ గెలుపొందారు.

బీజేపీదే బృహన్ ముంబై

బీజేపీదే బృహన్ ముంబై

స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో బీఎంసీని బీజేపీనే పాలిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రావ్ సాహెబ్ దన్వే అన్నారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులు తమ వైపు ఉన్నారని, తుది ఫలితాలు క్లియర్ అయ్యాక అంతా తేలిపోతుందన్నారు.

రెండు మినహా

రెండు మినహా

మహారాష్ట్రలో ముంబై, థానే మినహా ఎనిమిది మున్సిపాలిటీలను బీజేపీ కైవసం చేసుకుంది. ముంబైలో 81 సీట్లతో సత్తా చాటినప్పటికీ.. మేజిక్ ఫిగర్ 114 ఎవరికీ రాలేదు.పుణే, నాగపూర్, నాసిక్, ఉల్లాస్ నగర్, షోలా, అఖోలా, అమరావతి, పింప్రి మున్సిపాలిటీలని బీజేపీ కైవసం చేసుకుంది.

English summary
This is huge victory for the BJP and it is on the agenda of transparency said Maharashtra Chief Minister, Devendra Fadnavis following a resounding victory in the local body elections in Maharashtra. It is a vote for transparency he said at a press conference before which he was felicitated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X