వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సు సీటు కోసం ప్రయాణికుల గొడవ.. తాళాలతో పరారైన యువకుడు..!

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ ప్రయాణికులలో చోడవరం ప్రయాణికులు వేరయా ఉన్నట్టు ఉంది యవ్వారం.. సాధారణంగా బస్సులో ప్రయాణం చేస్తుంటే సీట్ల కోసం కోట్లట సర్వ సాధరణంగా జరుగుతుంటుంది. ఇది పల్లేటూళ్లోనైతే మరింత ఎక్కువగా ఉంటాయి.ఇలాంటీ గొడవలను సర్ధిచెప్పేందుకు ఓక్కోసారి బస్సులో ఉన్న డ్రైవర్‌, కండక్టర్లకు తలప్రాణం తోకకు వస్తుందంటారు..అయితే బస్సులో ప్రయాణికుల మధ్య గొడవ జరగడంతో అసలు బస్సే ఎట్లా వెళుతుందో చూస్తా అంటూ ఘర్షనకు దిగిన యువకుడు ఏకంగా బస్సు తాళాలనే తీసుకుని పారి పోయిన విచిత్ర సంఘటన చోడవరంలో జరిగింది.

ఆర్టీసీ బస్సులో సీటు గోడవ

ఆర్టీసీ బస్సులో సీటు గోడవ

ఆర్టీసీ బస్సు సీటు కోసం ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. చివరకు బస్సు పట్టుకొని ఓ యువకుడు పరారీ అయ్యాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి చోడవరంలో చోటు చేసుకుంది. పాడేరు డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు విశాఖ నుంచి చోడ వరం మీదుగా పాడేరు వెళ్లేందుకు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద రాత్రి 7.45 గంటలకు ఆగింది. పాడేరు మోదకొండమ్మ జాతరకు వెళ్తున్న వారితో బస్సు కిటకిటలాడుతుంది.

తాళాలు పట్టుకుని పరారైన యువకుడు

తాళాలు పట్టుకుని పరారైన యువకుడు

ఈ నేపథ్యంలో సీటు కోసం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరి చాలసేపు వాగ్వాదం కొనసాగుతోంది. ఎవ్వరు చెప్పిన ఆ యువకుడు సీటు కోసం ఘర్షణ కొనసాగిస్తున్నాడు.ఇంతలో బస్‌ను డ్రైవర్ ఆపాడు, వారిని వారించిన ఊరుకోకపోవడంతో క్రిందికి బాత్‌రూంకు వెళ్లాడు. ఇంతలో ఆ యువకుడి తుంటరి ఆలోచన వచ్చింది. అసలు బస్సు పోతేనే గదా సీట్ల గొడవ అనుకున్నాడు. దీంతో నాకు సీటు లేకుండా బస్సు ఎలా వెళతావో చూస్తానంటూ బస్సు స్టీరింగ్ దగ్గరికి వెళ్లాడు. ఇంకేముంది అక్కడ ఉన్న తాళాన్ని పట్టుకుని పరారయ్యాడు.

ప్రయాణికుల కోసం మరో బస్సును తెప్పించిన వైనం

ప్రయాణికుల కోసం మరో బస్సును తెప్పించిన వైనం

ఇక డ్రైవర్‌ వచ్చి చూసుకునే సరికి స్టీరింగ్‌కు తాళాలు లేకపోవడంతో ఖంగుతిన్నాడు. బస్సులో ఉన్న ప్రయాణికులను విచారించినా యువకుని ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ఎల్‌.రామకృష్ణ సిబ్బందితో వెళ్లి పరారైన యువకునితో కలిసి వచ్చిన వారిని విచారించినా ప్రయోజనం లేకపోయింది. ప్రయాణికులు ఇబ్బంది పడడంతో చేసేది లేక విశాఖ నుంచి వచ్చిన మరో బస్సులో వారిని పంపించారు. పరారైన యువకుని గురించి గాలిస్తున్నారు.

English summary
a young man escaped with bus key, because of clashes between the passengers in chodavaram , police was booked against him
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X