హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా లవర్‌తో పెళ్లి జరిపించండి... కేటీఆర్‌కు మొర పెట్టుకున్న యువతి

|
Google Oneindia TeluguNews

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రోజుల వందలాది ప్రజాసమస్యలు వస్తుంటాయి. వాటిని అధికారులకు చెప్పి పరిష్కారం చూపించడమో లేదంటే తన పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించడమో చేస్తుంటాడు. ఈ నేపథ్యలంనే సామాజిక మాధ్యమాల్లో సైతం ఆయన పలు సమస్యలకు స్పందించి పరిష్కారం చూపి ప్రజాదారణ పోందుతున్నాడు. అయితే నేడు ఓ కేటీఆర్ వద్దకు ఓ అమ్మాయి తన లవర్‌తో పెళ్లి చేయమని పార్టీ కార్యాలయానికి వచ్చింది.

యువతి,యువకులు ప్రేమించుకోవడం కామన్, విభేదాలు వస్తే విడిపోవడం కూడ కామన్, కాని కొంత మంది పూర్తి ఎమోషనల్‌గా ఉంటారు. ఈనేపథ్యంలోనే ఓ యువతి తన ప్రియుడు మోసం చేశాడంటూ టీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకుంది. ప్రియుడితో పెళ్లి చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను వేడుకుంది.

a young woman complaint on her lover to trs party working president ktr

వనపర్తి జిల్లా వెల్లటూరుకు చెందిన యువతి ,కృష్ణా జిల్లాకు చెందిన అశోక్‌ అనే యువకుడిని ప్రేమించింది. అయితే యువతిని ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడని, దీంతో సదరు యువతి కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాధు చేయగా 20 రోజుల్లో తనను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొన్నాడని తెలిపింది. అయితే పెళ్లికి ఒప్పుకుని సంవత్సరం గడుస్తున్నా పెళ్లి ఊసే ఎత్తడంలేదని కేటీఆర్ ముందు తన ఆవేదను చెప్పుకుని కన్నీరు మున్నిరయింది. దీంతో పార్టీ కార్యాలయంలో ఉన్న నేతలు ఆమేను ఓదార్చారు. ఇక ఈ సమస్యను పరిష్కరించేందుకు టీఆర్ఎస్ మహిళ విభాగానికి సహకరించాలని చెప్పారు.

English summary
a young woman from Vellatur of vanaparthy district loved with Ashok of Krishna district.but he refused get marrage ,and she came to trs office to meet party working president ktr to resolve the issue at hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X