వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చైన్‌స్నాచర్లపై పోలీసుల కాల్పులు: లైంగిక దాడి చేసి మహిళ దారుణ హత్య

|
Google Oneindia TeluguNews

నల్గొండ: జిల్లాలోని చింతపల్లి మండలం పాలెంతండాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా అది పేలిపోయింది. ఈ ప్రమాదంలో మోహన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు గ్రామానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లైంగిక దాడి చేసి మహిళ దారుణ హత్య

దుండిగల్ పోలీస్ స్టేషన్‌పరిధిలో ఓ గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. మృతదేహం పాక్షికంగా కుళ్లిపోయి ఉండడంతో ఆమెకు సంబంధించిన వివరాలు లభ్యం కాలేదు.

పోలీసుల కథనం ప్రకారం.. బాచుపల్లి గ్రామ పరిధిలోని దేవేందర్‌నగర్ సమీపంలో తెలుగు విశ్వవిద్యాలయం వెనుక అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ శవం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై నాగేంద్రబాబు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

A youth allegedly died due to cellphone blast

మహిళ నాలగైదు రోజుల క్రితం మృతి చెందడంతో మృతదేహం పాక్షికంగా కుళ్లిపోయింది. దీంతో ఆమెను గుర్తుపట్టడానికి ఆధారాలేమీ లభించలేదు. మృతురాలి ఒంటిపై వంకాయ రంగు చీర, జాకెట్ ధరించి ఉంది. 35 నుంచి 40 ఏళ్లు వయసు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

వివరాలు తెలిసిన వారు దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, మహిళ మృతదేహం పక్కనే మూడు ఖాళీ బీరు బాటిళ్లు పడి ఉండడం చూస్తే ఆమెపై లైంగికదాడి జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అనంతరం ఆ దుండగులే ఆమెను హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చైన్ స్నాచర్‌పై పోలీసుల కాల్పులు

హైదరాబాదులోని వనస్థలిపురంలో ఇద్దరు చైన్ స్నాచర్లపైన యాంటీ చైన్ స్నాచింగ్ టీం సోమవారం ఉదయం కాల్పులు జరిపింది. చైన్ స్నాచింగ్ సమయంలో.. పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు పారిపోయాడు. దీంతో, యాంటీ స్నాచింగ్ టీం కాల్పులు జరిపింది. పోలీసులు ఎల్బీనగర్ పరిసరాల్లో గాలిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. అనురాధ అనే మహిళ ఒంటరిగా వెళుతుండగా ఆమె మెడలోంచి 11 తులాల బంగారు గొలుసును చైన్ స్నాచర్లు ఎత్తుకెళ్లారు. బాధితురాలు అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమైంది. సమాచారం అందుకున్న యాంటీ చైన్ స్నాచింగ్ టీం పోలీసులు.. రెండు నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకుని చైన్ స్నాచర్ల వెంటపడ్డారు.

ఐదునిమిషాలపాటు చేజ్ చేసిన పోలీసులు.. కాల్పులు జరిపారు. కాగా, బ్లాక్ పల్సర్‌పై వచ్చిన ఆ చైన్ స్నాచర్లు తప్పించుకుపోయారు. వారి కోసం ఆ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. కాగా, అల్వాల్ ప్రాంతంలో మరో చైన్ స్నాచింగ్ జరిగింది.

English summary
A youth allegedly died due to cell phone blast in Nalgonda district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X