హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓయూలో యువకుడి మృతదేహం, ఉద్రిక్తత ఎందుకు?: అసలేం జరిగింది?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సమయం తర్వాత మరోసారి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందుకు విశ్వవిద్యాలయంలో బుధవారం లభించిన యువకుడి మృతదేహం కారణమైంది. అయితే, ఆ యువకుడు వర్సిటీ విద్యార్థే అని భావించిన విద్యార్థులు నిరసనకు దిగారు.

ఉద్యోగ ప్రకటనలను జారీ చేయని ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఆ యువకుడు చనిపోయాడని విద్యార్థులు ఆందోళన చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, తమ బస్తీకి చెందిన యువకుడి మృతదేహాన్ని తమకు అప్పగించాలని మాణికేశ్వర్‌ నగర్‌ బస్తీ వాసులు ఆందోళన చేశారు. ఓవైపు విద్యార్థులు పోలీసులపై రాళ్ల దాడి చేస్తే.. బస్తీ వాసులు విద్యా ర్థులపై దాడికి దిగారు.

మృతుడు ఎవరు? అసలేం జరిగింది?

ఓయూ ప్రధాన లైబ్రరీ వెనక ఉన్న వాటర్‌ ట్యాంకుపైకి చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులకు ట్యాంకులో ఓ యువకుడి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి మృతదేహాన్ని బయటకు తీసి రోడ్డుపై ఉంచారు. ట్యాంకు గోడపైనే మృతుని సెల్‌ఫోన్‌, దుస్తులు లభించడంతో, సెల్‌ ఫోన్‌ నుంచి ఓ నెంబరుకు ఫోన్‌ చేశారు. దీంతో వర్సిటీ పక్కనే ఉన్న మాణికేశ్వర్‌ నగర్‌కు చెందిన సైదులు వచ్చి, ఆ యువకుడి పేరు బత్తుల సిలారిబాబు అలియాస్‌ బాబా (20) అని, తన తమ్ముడని చెప్పాడు.

A youth dead body appeared in OU Campus Water Tank

ఈ నేపథ్యంలో పోలీసులు మృతదేహాన్ని తరలించడానికి ఏర్పాటు చేశారు. ఇంతలో, ఆ మృతదేహం ఓ నిరుద్యోగ యువకుడిదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని విద్యార్థులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తరలించేది లేదని తేల్చిచెప్పారు. వారి ఆందోళన కొనసాగుతుండగా, బస్తీ నుంచి రెండు గ్రూపులుగా వచ్చిన మహిళలు ఆ మృతదేహం తమ బస్తీకి చెందిన యువకుడిదని, శవాన్ని తమకు అప్పగించాలని విద్యార్థులతో వాగ్వాదానికి దిగారు.

పోలీసులు మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేయగా, పోలీసులపై రాళ్లు రువ్వారు. మూడు కార్లను ధ్వంసం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టిన పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.

గొడవపెట్టుకుని బయటికి వెళ్లాడు

రెండు రోజుల కిందట తనతో గొడవపడి వెళ్లిపోయాడని, ఇంటికి రాలేదని శ్రీహరిబాబు తల్లి సౌడమ్మ చెప్పారు. అయితే, శ్రీహరి బంధువుల ఇంటికి వెళ్లాడని భావించామని, ఈ మృతదేహం తన కుమారుడిదేనని శ్రీహరిబాబు తల్లి సౌడమ్మ తెలిపారు. ఇందుకు అతని మెడలో తాను కట్టిన తాయెత్తే సాక్ష్యమని చెప్పారు.

A youth dead body appeared in OU Campus Water Tank

ఇది ఇలా ఉండగా, వర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఆందోళనలో పాల్గొన్న ఎమ్మె ల్యే సంపత్ కుమార్‌, టీడీపీ అధికార ప్రతినిధి రాజారాం యాదవ్‌ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని సంపత్, రాజారాం ఆరోపించారు.

కాగా, తమ బస్తీలో ఉంటూ బస్తీకి చెందిన యువకుడి మృతదేహాన్ని ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారంటూ మాణికేశ్వర్‌ నగర్‌ బస్తీవాసులు విద్యా ర్థులపై దాడికి దిగారు. వారిని బస్తీలోకి రాకుండా అడ్డుకున్నారు. కాగా, ఈ ఘటనలో పోలీసులపై దాడికి పాల్పడిన విద్యార్థులపై కేసులు నమోదు చేస్తామని ఈస్ట్‌ జోన్‌ డీసీపీ డాక్టర్‌ రవీందర్‌ తెలిపారు.

ఆత్మహత్యా?.. హత్యా?

ఓయూ నీళ్ల ట్యాంకులో లభించిన యువకుడి మృతదేహంపై విద్యార్థులు, పోలీసులు, బస్తీవాసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నీళ్ల ట్యాంకులో అంత లోతుగా నీరు లేదని విద్యార్థులు చెబుతున్నారు. ట్యాంకుకు పై నుంచి లోపలి వరకు ఒక పక్క నుంచి మెట్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

A youth dead body appeared in OU Campus Water Tank

మృతుడు తన దుస్తులు, సెల్‌ఫోన్‌, చెప్పులు ట్యాంకు గోడపై పెట్టి లోపలికి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే, ట్యాంకు పైనుంచి దూకితే అతని తలకు, ఇతర అవయవాలకు గాయాలు అయ్యే అవకాశం ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. కానీ, అలా జరగలేదని తెలిపారు.

మృతుడి కళ్లు, నాలుక పూర్తిగా బయటకు వచ్చి ఉండటాన్ని బట్టి చూస్తే అది హత్యే అని విద్యా ర్థులు, బస్తీ వాసులు భావిస్తున్నారు. పోలీసుల సమగ్ర దర్యాప్తు అనంతరం ఆత్మహత్యా? లేక హత్యా అనేది తేలే అవకాశాలున్నాయి.

English summary
A youth dead body appeared in OU Campus Water Tank. Police investigation continous in this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X