వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్కెను కోర్టులో హాజరు పరచండి: ఆప్ డిమాండ్, బంద్ ప్రశాంతం

|
Google Oneindia TeluguNews

వరంగల్: ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోని బలిమెల రిజర్వాయర్‌ దగ్గర అక్టోబర్‌ 24న బూటకపు ఎన్‌కౌంటర్‌లో దాదాపు 32 మంది మావోయిస్టులను పోలీసులు అతి కిరాతకంగా కాల్చి చంపారని ఢిల్లీ ప్రభుత్వ అధికార పార్టీ అయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ శాసన సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి పోమ్‌నాథ్‌ భారతి ఆరోపించారు.

గురువారం వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సోమనాథ్‌ భారతి మ్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అక్కిరాజు హరగోపాల్‌ (రామకృష్ణ), అతని అనుచరులను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని, ఆంధ్ర, ఒడిశా బార్డర్‌లో గ్రేహౌండ్స్‌ కేంద్ర రిజర్వ్‌ బలగాల కూంబింగ్‌ను వెంటనే ఆపేయాలని డిమాండ్‌ చేశారు.

AAP demonds to present RK efore the court

అక్టోబర్‌ 24న బూటకపు ఎదురుకాల్పులకు పాల్పడి అత్యంత కిరాతకంగా 32 మందిని కాల్చి చంపిన పోలీసులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన తీర్పు ప్రకారం హత్యానేరం మోపి చట్టబద్ధంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. గత వారం రోజులుగా రామకృష్ణను, అతని అనుచరులను పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకున్నారని, వారిని ఏ క్షణంలోనైనా బూటకపు ఎదురుకాల్పుల పేర కాల్చిచంపే అవకాశం ఉందని, అందులో భాగంగానే కూంబింగ్‌ ఆపరేషన్స్‌ను తీవ్రతరం చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడవిని మొత్తం జల్లడ పడుతోందని ఆయన ఆరోపించారు.

వెంటనే రామకృష్ణను, అతని అనుచరులను న్యాయస్థానం ముందు హాజరుపర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆమ్‌ ఆద్మీ పార్టీ సమన్వయ కర్త ప్రొఫెసర్‌ పి.ఎల్‌. విశ్వేశ్వర్‌రావు, వరంగల్‌ జిల్లా కన్వీనర్‌ శ్రీకాంత్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

బంద్ ప్రశాంతం

ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో ఇీవల 30 మంది మావోయిస్టులపై పోలీసుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా కేంద్ర కమిీ ఇచ్చిన ఐదు రాష్ట్రాల బంద్‌ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాలైన పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్‌ ప్రశాంతంగా జరిగింది.

ఈ ప్రాంతాల్లోని ఏటూరునాగారం, వాజేడు, మహాముత్తారం తదితర ప్రాంతాల్లో గురువారం బంద్‌ కారణంగా ఆర్టీసీ బస్సులు తిరగలేదు. బంద్‌ నేపద్యంలో ప్రతీకార దాడులకు పాల్పడే ఆవకాశాలున్నాయనే సంకేతాలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

బంద్‌ ప్రభావం ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులను, మావోల హిట్ లిస్టులో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని పోలీ'సులు హెచ్చరించారు. దాంతో ప్రజాప్రతినిధులు పట్టణ ప్రాంతాలకు తరలివెళ్లారు. ప్రభుత్వ కార్యాలయాలు, సెల్‌ టవర్లకు భద్రత కల్పించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృతంగా పోలీసులు తనిఖీలు నిర్వహించి అనుమానం ఉన్న వ్యక్తులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

English summary
Aam Admi Party MLA Somanath Barti demonded to present Moist Leader Ramakrishna alias RK before the court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X