హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆరోగ్యశ్రీ కార్డా, ప్రభుత్వ దవాఖానాలకు వెళ్లండి.. ప్రైవేట్ ఆసుపత్రుల నిరాకరణ..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణలో ఆరోగ్యశ్రీకి బ్రేకులు పడ్డాయి. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ కింద సేవలు అందిచేందుకు నిరాకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతున్న రోగులకు నిరాశే ఎదురవుతోంది. అక్కడి డాక్టర్లు, సిబ్బంది ప్రభుత్వాసుపత్రులకు వెళ్లండని సూచిచండంతో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వం నుంచి 1500 కోట్ల రూపాయల మేర బకాయిలు రావాల్సి ఉన్నందున శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని గురువారం నాడు ప్రకటించారు. ఆ క్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

ఆరోగ్యశ్రీ సేవలు బంద్

ఆరోగ్యశ్రీ సేవలు బంద్

తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్లు ప్రకటించింది ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం. శుక్రవారం నుంచి సేవలు బంద్ చేస్తామని గురువారం నాడు ప్రకటించిన నేపథ్యంలో వారితో ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే చర్చలు విఫలం కావడంతో ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. దాంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న రోగులు ఆరోగ్యశ్రీ సేవలు లేక బిక్కుబిక్కుమంటున్నారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం తీసుకోవడానికి ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నవారిని అక్కడి సిబ్బంది ప్రభుత్వాసుపత్రులకు వెళ్లండంటూ సూచిస్తున్నారు. దీంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు.

ఎంఐఎం నేతలకు భయపడుతున్నారా.. హైదరాబాద్ పాకిస్థాన్‌లో ఉందా.. రాజా సింగ్ నిప్పులు (వీడియో)

 మంత్రి వివరణ.. చర్చలు విఫలం

మంత్రి వివరణ.. చర్చలు విఫలం

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. 1500 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని ప్రైవేట్ ఆసుప్రతుల యాజమాన్యాలు చెబుతుండగా.. కేవలం 600 కోట్ల రూపాయలే బకాయిలు ఉన్నాయంటున్నారు ఈటల. ఎన్నికల నేపథ్యంలో బకాయిలు చెల్లించడానికి ఆలస్యమైందని అన్నారు.

శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలకు దూరం

శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలకు దూరం

ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో శుక్రవారం నుంచి ఆరోగ్య శ్రీ సేవలకు దూరంగా ఉంటామని గురువారం నాడు ప్రకటించారు. పాత బకాయిల చెల్లింపుపై పలుమార్లు ప్రభుత్వం గడువు ఇచ్చినప్పటికీ.. మాట మీద నిలబడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1500 కోట్ల రూపాయల మేర బకాయిలు ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సి ఉందని.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు ప్రైవేట్ ఆస్పత్రుల సంఘం రాష్ట్ర కార్యదర్శి టి. హరిప్రకాశ్.

<strong>కరెంట్ బిల్లుల్లో మోసం.. 30 రోజులు మించి బిల్లింగ్‌.. ఆ ప్రచారం నమ్మొద్దంటూ..!</strong>కరెంట్ బిల్లుల్లో మోసం.. 30 రోజులు మించి బిల్లింగ్‌.. ఆ ప్రచారం నమ్మొద్దంటూ..!

ఇప్పటికే పలు వాయిదాలు అంటూ..! రోగులకు అవస్థలు

ఇప్పటికే పలు వాయిదాలు అంటూ..! రోగులకు అవస్థలు

పాత బకాయిలకు సంబంధించి ఇదివరకు చాలాసార్లు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగాయి. పలు వాయిదాలు పెట్టినా కూడా ఇంతవరకు ఇచ్చిన మాటకు కట్టుబడి లేదంటున్నారు. గురువారం నాటితో ప్రభుత్వం విధించిన గడువు మరోసారి ముగియడంతో శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు హరిప్రకాశ్.

ప్రైవేట్ ఆసుప్రతుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతాయనే విషయం తెలియక చాలామంది వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డు అనుమతించకపోవడంతో వెనుదిరగాల్సి వస్తోంది.

English summary
Arogyasri Health services break down in telangana at private hospitals. Owners of private hospitals are stopped the services because of government's dues. The meeting with government also failed on friday. Private Hospital Owners decided to stop the aarogyasri services.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X