హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్! తిరుగులేని ముహూర్తంలో బీఆర్ఎస్ పత్రాలపై కేసీఆర్ సంతకం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశంలో కొత్త విధానాలకు నాంది పలకాల్సిన సమయం ఆసన్నమైందని భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) వ్యాఖ్యానించారు. శుక్రవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

14న ఢిల్లీ బీఆర్ఎస్ ప్రారంభిస్తామన్న కేసీఆర్

14న ఢిల్లీ బీఆర్ఎస్ ప్రారంభిస్తామన్న కేసీఆర్

డిసెంబర్ 14న ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని, అందరూ రావాలన్నారు కేసీఆర్. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు.. ప్రజలని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి పరివర్తన కోసమే బీఆర్ఎస్ ప్రారంభించినట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో 50 శాతం యువత ఉన్నారని, వాళ్లను మతోన్మాదులుగా మారుస్తున్నారని మండిపడ్డారు.

అమెరికాను మించి భారత్ ఎదుగుతుందన్న కేసీఆర్

అమెరికాను మించి భారత్ ఎదుగుతుందన్న కేసీఆర్

సమర్థవంతంగా పనిచేస్తే.. అమెరికాను మించిన శక్తివంతమైన ఆర్థికశక్తిగా భారత్ ఎదుగుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు పడిపోతున్నాయని, డాలర్ రూపాయి మారకం పతనమైందన్నారు. దేశంలో జలవివాదాలు ట్రిబ్యునళ్లలో దశాబ్దాలపాటు కొనసాగుతున్నాయని తెలిపారు. దేశానికి కొత్త వాటర్ పాలసీ అవసరం ఉందన్నారు కేసీఆర్.
అలాగే దేశంలో కొత్త అగ్రికల్చరల్ పాలసీ.. ఆర్థిక పాలసీ, విద్యుత్ విధానం అవసరం ఉందన్నారు.

ఢిల్లీలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్న కేసీఆర్

ఢిల్లీలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్న కేసీఆర్

మహిళల సాధికారత కోసం కూడా కొత్త విధానం కావాలన్నారు కేసీఆర్. దళితులను దూరం పెట్టాలనే ఆలోచనలు మూర్ఖత్వమేనని అన్నారు. తెలంగాణ కోసం పోరాడినప్పుడు ఎంతో మంది అవహేళన చేశారన్న కేసీఆర్.. ఇప్పుడు కూడా అలా జరుగుతుందని.. కానీ వెనుకడగు వేసేది లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ ద్వారా ప్రజల ముందుకు వస్తామన్నారు కేసీఆర్. తెలంగాణ కీర్తి కిరీటాన్ని భారతమాత కాళ్ల దగ్గరపెడతామన్నారు.

బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని ముహూర్తంలోనే కేసీఆర్ సంతకం

బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని ముహూర్తంలోనే కేసీఆర్ సంతకం

శుక్రవారం 1.20గంటలకు బ్రహ్మాండమైన ముహూర్తం ఉందని.. అప్పుడు పార్టీ పెడితే తిరుగులేదని పండితులు చెప్పారన్నారు కేసీఆర్. అందుకే ఆ సమయానికి బీఆర్ఎస్ ప్రారంభపత్రాలపై సంతకాలు చేసినట్లు కేసీఆర్ తెలిపారు. ఇందుకోసమే అందర్నీ ఇబ్బంది పెట్టానని.. ఈ కార్యక్రమానికి హాజరైన కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి, ప్రకాశ్ రాజ్, ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనేది బీఆర్ఎస్ నినాదమన్న కేసీఆర్

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనేది బీఆర్ఎస్ నినాదమన్న కేసీఆర్

ఇక అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనేది బీఆర్ఎస్ తొలి నినాదమని కేసీఆర్ స్పష్టం చేశారు. తాము దేశంలో అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే దేశ వ్యాప్తంగా 242 గంటల విద్యుత్ అందిస్తామన్నారు. మారుమూల గ్రామాలు, గిరిజన తాండాలకు కూడా అందిస్తామన్నారు. దేశంలో దళితబంధు, రైతుబంధు అమలు చేస్తామన్నారు.

జేడీఎస్‍‌తో కర్ణాటకలో బీఆర్ఎస్ పోటీ అంటూ కేసీఆర్

జేడీఎస్‍‌తో కర్ణాటకలో బీఆర్ఎస్ పోటీ అంటూ కేసీఆర్

జేడీఎస్ పార్టీతో కలిసి కర్ణాటకలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్నారు కేసీఆర్. తెలంగాణ పథకాలన్నీ కర్ణాటకలో కూడా అమలు చేస్తామని చెప్పారు. గతంలో ప్రకాశ్ రాజ్ తో కలిసి దేవెగౌడ, కుమారస్వామితో భేటీ అయినట్లు తెలిపారు. దేశంలో ఏ ప్రాంతం నుంచైనా మంచి నాయకులు వస్తామంటే బీఆర్ఎస్‌లో చేర్చుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. 14న ఢిల్లీలో జరిగే సమావేశంలో అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు కేసీఆర్. ఢిల్లీలో నూతన కార్యాలయం నిర్మాణమవుతోందని, మూడు నెలల్లో కంప్లీట్ అవుతుందన్నారు. దేశానికి మార్గదర్శనం చేస్తున్న సమయంలో తన వెంట ఉన్నవారందరికీ ధన్యవాదాలు చెప్పారు కేసీఆర్.

English summary
Ab ki bar kisan ki Sarkar: BRS chief KCR key comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X