హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అభయ్ హత్య కేసు: కోర్టు సంచలన తీర్పు, రొమాంటిక్ క్రైం స్టోరీ నుంచి.. అసలేం జరిగింది?

|
Google Oneindia TeluguNews

Recommended Video

అభయ్‌ కిడ్నాప్, హత్య మిస్టరీ

హైదరాబాద్: దాదాపు రెండేళ్ల క్రితం హైదరాబాదులో కలకలం రేపిన అభయ్ అనే పదో తరగతి బాలుడు కిడ్నాప్, హత్య కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు గురువారం శిక్ష విధించింది. ముగ్గురు నిందితులకు న్యాయస్థానం జీవితకాలం శిక్ష విధించింది.

ఇలా సంభాషణ: ఆంధ్ర గ్యాంగ్‌తో కలిసి అభయ్ కిడ్నాప్, హత్య ఇలా సంభాషణ: ఆంధ్ర గ్యాంగ్‌తో కలిసి అభయ్ కిడ్నాప్, హత్య

2016లో పదో తరగతి విద్యార్థి అభయ్‌ను కిడ్నాప్ చేసిన నిందితులు చిన్నసాయి అలియాస్ శేషు, రవి, మోహన్‌లు ఆ తర్వాత అతనిని హత్య చేశారు. వారు డబ్బుల కోసమే ఈ పని చేశారు. ఇప్పుడు వారికి న్యాయస్థానం శిక్ష విధించింది.

నాడు ఏం జరిగిందంటే

నాడు ఏం జరిగిందంటే

అభయ్ హత్య కేసులో నిందితులు ముగ్గురు సినిమా నటులుగా ఎదగడం కోసం డబ్బులు అవసరమని భావించి, కిడ్నాప్ కథకు తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. తద్వారా నిందితులు సినిమా ద్వారా హీరోలం అవుదామనుకొని విలన్లు అయ్యారు. నిందితులు ముగ్గురు కూడా అభయ్ హత్యకు రెండు రోజుల ముందు ఒక రొమాంటిక్ క్రైం కథ సినిమా చూసి, దానిని ఫాలో అయ్యారు. ఆ సినిమాను చూసి ఇన్ స్పైర్ అయ్యారు.

అభయ్ లైఫ్‌స్టైల్ చంపేసింది!: హీరోలు కావాలనుకొని, విలన్లు (పిక్చర్స్)అభయ్ లైఫ్‌స్టైల్ చంపేసింది!: హీరోలు కావాలనుకొని, విలన్లు (పిక్చర్స్)

 ఒక రొమాంటిక్ క్రైమ్ కథతో ఇన్‌స్పైర్ అయ్యారు కానీ

ఒక రొమాంటిక్ క్రైమ్ కథతో ఇన్‌స్పైర్ అయ్యారు కానీ

ఒక రొమాంటిక్ క్రైమ్ కథ ద్వారా ఇన్‌స్పైర్ అయిన వారు అభయ్‌ను ఉద్దేశ్యపూర్వకంగా వారు చంపుదామనుకోలేదు. అయితే, అతనికి నోటితో పాటు ముక్కుకు కూడా ప్లాస్టర్ వేశారు. దీంతో అతను ఊపిరాడక చనిపోయాడు. అతను చనిపోయాక కూడా అభయ్ కుటుంబ సభ్యులను బెదిరించి డబ్బులు తీసుకోవాలని భావించారు.

 తండ్రి నుంచి రూ.10 కోట్లు డిమాండ్ చేశారు

తండ్రి నుంచి రూ.10 కోట్లు డిమాండ్ చేశారు

అభయ్ చనిపోయిన తర్వాత గది నుంచి ట్రాలీలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో మృతుడి సెల్‌ఫోన్‌ను, కళ్లజోడును విసిరేశారు. మృతదేహాన్ని రైల్లో తీసుకెళుతూ డబ్బు డిమాండ్‌ చేయాలనే వ్యూహం పన్నారు. స్టేషన్లో నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌కు మూడు టికెట్లు కొన్నారు. రాత్రి 10గంటలకు అభయ్‌ అత్తయ్యకు ఫోన్‌ చేసి రూ.10కోట్లు డిమాండ్‌ చేశారు. అంత డబ్బు లేదని చెప్పిన అభయ్‌ తండ్రి రాజ్‌కుమార్‌ పోలీసులకు సమాచారం అందించాడు.

అభయ్ హత్య షాక్: నటులుగా ఎదిగేందుకు, 'ఒక రొమాంటిక్ క్రైం' సినిమా చూసి..అభయ్ హత్య షాక్: నటులుగా ఎదిగేందుకు, 'ఒక రొమాంటిక్ క్రైం' సినిమా చూసి..

 లైఫ్ స్టైల్ చూసి

లైఫ్ స్టైల్ చూసి

ఆ తర్వాత 11గంటల సమయంలో నిందితులు రైలెక్కి మరోసారి ఫోన్‌ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అభయ్ లైఫ్ స్టయిల్ అతని ప్రాణాలు తీసిందని చెప్పవచ్చు. నిత్యం అతను కొత్త కొత్త గాడ్జెట్స్, మార్కెట్లోకి వచ్చే కొత్త కొత్త మోడల్ ఫోన్స్ వాడుతుండటం వల్ల వారు బాగా ధనవంతులు అయి ఉంటారని నిందితులు అనుమానించారు.

 సోషల్ మీడియాలో క్రిమినల్ మెథడ్స్ చూసి

సోషల్ మీడియాలో క్రిమినల్ మెథడ్స్ చూసి

అంతకుముందు నిందితులు డబ్బులు సంపాదించేందుకు రాంచీ తదిదతర ప్రాంతాలకు వెళ్లారు. పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించేందుకు మల్టీలెవల్ కంపెనీల్లో పని చేశారు. అక్కడ ఎంత పని చేసినా ఎక్కువ డబ్బులు రాలేదు. దీంతో వారు వెనక్కి తిరిగి వచ్చారు. అనంతరం అదిలాబాదులోని పని చేసి, ఆ తర్వాత హైదరాబాద్ వచ్చారు. వాళ్లు ఎక్కడా స్థిరపడకుండా డబ్బులు సంపాదించాలనే కోరికతో నిత్యం ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి వాటిని చూసేవారు. అందులోని క్రిమినల్ మెథడ్స్ చూసి డబ్బులు సంపాదించుకోవాలని భావించేవారు.

అభయ్ హత్య కేసులో ట్విస్ట్: వంటమనిషి పావే, వెనక పెద్ద ముఠాఅభయ్ హత్య కేసులో ట్విస్ట్: వంటమనిషి పావే, వెనక పెద్ద ముఠా

 తండ్రి హవాలా వ్యాపారం చేస్తారని

తండ్రి హవాలా వ్యాపారం చేస్తారని

అభయ్ లైఫ్ స్టయిల్ చూసి అతని తండ్రి ధనవంతుడు అని నిందితులు భావించారు. కానీ వారు అంతగా ఉన్న వారు కాదు. అంతేకాదు, అభయ్ తండ్రి హవాలా వ్యాపారం చేస్తారని కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. కానీ అభయ్ తండ్రి ఎలాంటి హవాలా వ్యాపారం లేదు.

 రెండు కారణాలు, ఓ నిందితుడు ముందే తెలుసు

రెండు కారణాలు, ఓ నిందితుడు ముందే తెలుసు

అభయ్ కుటుంబం వద్ద పెద్ద ఎత్తున డబ్బులు ఉన్నాయని నిందితులు భావించడానికి రెండు కారణాలు. వారికి మంచి ఏరియాలో సొంత ఇల్లు ఉండటం, మరొకటి అభయ్ నిత్యం కొత్త కొత్త గాడ్జెట్స్ వాడటం. మార్కెట్లోకి వచ్చే ప్రతి మోడల్ సెల్ ఫోన్, గాడ్జెట్స్‌ను అభయ్ వాడుతుండేవాడు. నిందితుల్లో ఒకరైన చిన్నసాయి.. అభయ్‌కు ముందు నుంచే తెలుసు. కాబట్టి, అభయ్ చిన్నపిల్లాడు కాబట్టి.. తెలిసో, తెలియకో తమ వద్ద బాగా డబ్బుందని చెప్పి ఉంటాడు.

English summary
Life sentence to three youth in Tenth student Abhay murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X