హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీ ఎఫెక్ట్.. అందుకే కేసీఆర్ ముందస్తు, మైనార్టీ రిజర్వేషన్లు ఇవ్వనివ్వం: అమిత్ షా నిధుల లెక్క

|
Google Oneindia TeluguNews

పరకాల/వరంగల్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షులు అమిత్ షా ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో అమిత్ షా మాట్లాడారు. మజ్లిస్ పార్టీ నేతలు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ చేతుల మీదుగా ప్రభుత్వం నడవాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

అలా నడవొద్దనుకుంటే బీజేపీకి ఓటు వేయాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల సమయంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్ర మోడీ హవా ఉంటుందని, అలాంటప్పుడు గెలవడం అసాధ్యమని కేసీఆర్ భావించారని, అందుకే ముందస్తు ఎన్నికలకు తెరలేపారని విమర్శించారు. ముందస్తు వల్ల తెలంగాణ ప్రజలపై అదనపు భారం పడిందని చెప్పారు.

కొడుకులు, కూతుళ్ల కోసమే కేసీఆర్ ముందస్తు

నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అమిత్ షా చెప్పారు. మోడీ వచ్చాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. తన కొడుకులు, కూతుళ్లను గెలిపించుకోవడానికే కేసీఆర్ ముందస్తు ఎన్నికలు అన్నారు. బీసీ కమిషన్‌కు మోడీ చట్టబద్దత కల్పించారన్నారు. ఇంత వరకు ఏ ప్రభుత్వాలు చేయని అద్భుతమైన కార్యక్రమాలు మోడీ చేశారని చెప్పారు.

మైనార్టీ రిజర్వేషన్ చట్ట విరుద్ధం, ఇవ్వం.. ఇవ్వనిచ్చేది లేదు

రిజర్వేషన్లు 51 శాతానికంటే ఎక్కువ ఉండరాదని సుప్రీం కోర్టు చెప్పిందని, కానీ మైనార్టీలకు ముస్లీంలు అంటూ కేసీఆర్ చెబుతున్నారని, మత ఆధారిత రిజర్వేషన్లు ఎందుకని అమిత్ షా ప్రశ్నించారు. మత ఆధారిత రిజర్వేషన్లు చట్ట వ్యతిరేకమని, అలాంటి చట్ట వ్యతిరేక రిజర్వేషన్లను బీజేపీ ఇవ్వదని, ఇవ్వనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చి, బీసీలకు అన్యాయం చేస్తారా, ఎస్సీలకు అన్యాయం చేస్తారా, ఎస్టీలకు అన్యాయం చేస్తారా చెప్పాలన్నారు. ఇలాంటి చట్టవిరుద్ధ ప్రకటనలు సరికాదని, తాము వాటిని జరగనిచ్చేది లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కొండలా అండగా ఉంటుందని, వీళ్ల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంటే బీజేపీ సహించేది లేదన్నారు. వీరి రిజర్వేషన్లకు ఎవరు కోతపెట్టినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.

నందమూరి సుహాసినికి గట్టి షాక్, తెరాసలో చేరిన కూకట్‌పల్లి కీలక నేత: కారణం ఇదీనందమూరి సుహాసినికి గట్టి షాక్, తెరాసలో చేరిన కూకట్‌పల్లి కీలక నేత: కారణం ఇదీ

తెలంగాణకు ఇదీ నిధుల వరద

తెలంగాణ అభివృద్ధి కోసం మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నో నిధులు ఇచ్చిందని అమిత్ షా చెప్పారు. తెలంగాణకు ఏడు రెట్ల నిధులు ఇచ్చినట్లు తెలిపారు. 13వ ఆర్థిక సంఘంలో కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రానికి రూ.16వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని అమిత్ షా తెలిపారు. 14వ ఆర్థిక సంఘంలో 2014 నుంచి 2018 వరకు ఒక లక్ష 15 వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని చెప్పారు. ఇంత బడ్జెట్ నిధులను తెలంగాణ అభివృద్ధికి ఇచ్చామని చెప్పారు. ముద్ర బ్యాంక్ ద్వారా రుణాల కోసం 15వేల కోట్లు, స్మార్ట్ సిటీల కోసం రూ.124 కోట్లు, అమృత్ మిషన్ కోసం రూ.834 కోట్లు, రైల్వే ప్రాజెక్టులకు రూ.19వేల కోట్లకు పైగా, అర్బన్ మిషన్ కోసం రూ.వెయ్యి కోట్లకు పైగా నిధులు, ప్రధానమంత్రి అవాస్ యోజన కింద రూ.1,221 కోట్లు, వెనుకబడిన జిల్లాల కోసం రూ.900 కోట్లకు పైగా, రోడ్ల ప్రాజెక్టుల కోసం రూ.40వేల కోట్లకు పైగా, మహిళల అభివృద్ధి కోసం రూ.1055 కోట్లు, ఆర్య కోసం రూ.2వేలకు పైగా కోట్లు, రామగుండం ఫెర్టిలైజర్స్ ప్లాంట్ కోసం రూ.5వేల 200కు పైగా కోట్లు, మెదక్‌లోని మానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తుల కర్మాగారాల కోసం రూ.1,703 కోట్లు, ఎయిమ్స్ కోసం రూ.1200 కోట్లు, సనత్ నగర్ ఈసీఐఎల్ ఆసుపత్రి కింద రూ.1,200 కోట్లు, సర్వశిక్షా అభియాన్ కోసం రూ.1300 కోట్లుకు పైగా, నక్సల్స్ ప్రభావిత జిల్లాల కోసం రూ.400 కోట్లకు పైగా ఇచ్చారని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన రూ.1లక్ష 15వేలకు అధనంగా మరో రూ.లక్షా పదిహేనువేల కోట్లు తెలంగాణకు ఇచ్చిందని అమిత్ షా చెప్పారు. అన్నీ కలిపి తెలంగాణ అభివృద్ధికి కలిపి రూ.2 లక్షల 30 వేల కోట్లకు పైగా ఇచ్చినట్లు తెలిపారు.

బీజేపీ వస్తే అధికారికంగా సెప్టెంబర్ 17

యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌కు అరకొర నిధులు ఇచ్చిందని అమిత్ షా చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుంపటిగా మార్చిందని విమర్శించారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన కేసీఆర్ ఆ హామీని నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ తాను ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని నెరవేర్చలేదన్నారు. మజ్లిస్ పార్టీకి భయపడి సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం లేదని, బీజేపీ వస్తే నిర్వహిస్తామన్నారు. బీద, బడుగు వర్గాల కోసం కోసం మోడీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ తీసుకు వచ్చిందని, కానీ కేసీఆర్ పేదలకు అన్యాయం చేసేలా ఆ సంక్షేమ పథకాన్ని తెలంగాణలో అమలు చేయడం లేదన్నారు. రైతు ఆత్మహత్యలు తెలంగాణలో ఉన్నాయని చెప్పారు. కానీ రైతుల కోసం మోడీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రైతులకు మద్దతు ధర భారీగా పెంచిందన్నారు.

కేసీఆర్‌ను కాంగ్రెస్, లెఫ్ట్ ఢీకొట్టలేవు

ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు నిర్జీవమైపోతున్నాయని, దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం తగ్గిపోయిందని, ఆ పార్టీ కనుమరుగు అవుతోందని అమిత్ షా చెప్పారు. అలాంటి పార్టీలు కలిసి కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కోలేవని, కేవలం బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అని అమిత్ షా చెప్పారు. గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతుండగా, బీజేపీ ఒక్కో రాష్ట్రంలో విజయం సాధిస్తూ వస్తోందన్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో తెరాసకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ కూటమికి వ్యతిరేకంగా, తెలంగాణ అభివృద్ధికి గ్యారెంటీ ఇచ్చే బీజేపీకి ఓటు వేయాలన్నారు. అందరూ రెండు చేతులు లేపి పిడికిలి బిగించి, గట్టిగా సింహగర్జన చేయాలని సభికులకు సూచించారు. భారత్ మాతాకీ జై అని నినాదాలు చేశారు.

English summary
Bharatiya Janata Party (BJP) chief Amit Shah public meeting in Parkal on Sunday. He said that Narendra Modi government gave above Rs.2 lakh 30 thousand crores for Telangana development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X