• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సాగర్ లో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం.!ఐనా కాంగ్రెస్ గెలుపు తథ్యం అంటున్న మాణిక్కం ఠాగూర్.!

|

హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కె.జానారెడ్డి గెలుపు తధ్యమని ఏఐసిసి వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ఉద్ఘాటించారు. సాగర్ లో సీఎం చంద్రశేఖర్ రావు లిక్కర్, పోలీస్, మనీ, పవర్ ను ఉపయోగిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. అధికార పార్టీ అప్రజస్వామిక విధానాలను నియంత్రించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలం అయిందని మాణిక్కం ఠాగూర్ మండిపడ్డారు. ప్రజల పక్షాన గొంతు వినిపించేందుకు జానారెడ్డి లాంటి సీనయర్ నాయకులు అసెంబ్లీ లో ఉండాలని మాణిక్కం ఠాగూర్ ఆకాంక్షించారు.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే జానారెడ్డి ని గెలిపించాలి..

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే జానారెడ్డి ని గెలిపించాలి..

అంతే కాకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే జానారెడ్డి ని గెలిపించాల సాగర్ ప్రజానికానికి మాణిక్కం ఠాగూర్ పిలుపునిచ్చారు. మానవతా రాయ్ ని పోలీస్ లు అరెస్ట్ చేసి హింసించడాన్ని ఈ సందర్బంగా మాణిక్కం ఠాగూర్ ఖండించారు. పోలీస్ లు సీఎం చంద్రశేఖర్ రావుకు ఏజెంట్లు గా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. టిఆర్ఎస్ మందు, డబ్బు పంచినా సాగర్ లో గెలుపు కాంగ్రెస్ దేనని, దుబ్బాకలో బీజేపీ విజయం నీటి బుడగ లాంటిదని తేలిపోయింది. 2018లో బీజేపీ 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని, సాగర్ లో కూడా బీజేపీ కి అదే రిపీట్ అవుతుందని మాణిక్కం ఠాగూర్ విమర్శించారు.

ఏకమైన కాంగ్రెస్ నేతలు..

ఏకమైన కాంగ్రెస్ నేతలు..

దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి అయిన ఏడు సంవత్సరాలు వరకు కూడా నాగార్జునసాగర్ నియోజకవర్గం తెలంగాణలో ఉందా లేదా అనే విషయం తెలవదు అన్నట్టుగా వ్యవహరించారని ఘాటుగా విమర్శించారు కాంగ్రెస్ పార్టీ మరో నేత పొన్నాల లక్ష్మయ్య. ఇప్పుడే తెలుసుకున్నట్లుగా, కాంగ్రెస్ పార్టీ నాగార్జునసాగర్లో అభివృద్ధి సరిగా చేయలేదని అపవాదు వేసే దౌర్భాగ్య స్థితికి ఈ ముఖ్యమంత్రి వచ్చాడని మండిపడ్డారు. ఏడు సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గం కనపడలేదా చంద్రశేఖర్ రావు అని సూటిగా ప్రశ్నించారు. రెండు మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ను పెట్టి అక్కడే కూర్చుని ఒకటిన్నర సంవత్సరాలు అయినా బిచ్చమెత్తుకుని పూర్తి చేస్తానని చంద్రశేఖర్ రావు చెప్పారని, కానీ ఎన్నికల సమయంలో ఇలాంటి మాటలు ప్రజలు నమ్మరన్న అంశాన్ని చంద్రశేఖర్ రావు గ్రహించాలని పొన్నాల తెలిపారు.

సాగర్ ప్రజల మద్యే ఉంటున్న రేవంత్ రెడ్డి..

సాగర్ ప్రజల మద్యే ఉంటున్న రేవంత్ రెడ్డి..

ఇదిలా ఉండగా తన సొంత రాష్ట్రం తమిళనాడులో సాధారణ ఎన్నికలు జరుగుతున్నప్పటికి తెలంగాణలో గెలుపు చారత్రక అవసరం కాబట్టి మాణిక్కం ఠాగూర్ తెలంగాణలో విస్త్రుతంగా పర్యటించి జానారెడ్డి లాంటి సీనియర్ నాయకుడి గెలుపును కాంక్షిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ నేత రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. రేపు నాగార్జున సాగర్ లో అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, జానారెడ్డి లాంటి సీనియర్ నేతకు మరోసారి అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి సాగర్ ప్రజానికానికి విజ్ఞప్తి చేసారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్బంగా కాంగ్రెస్ నేతల మద్య ఐఖ్యతా రాగం వినిపించడం ఆహ్వానించతగిన పరిణామని సీనియన్ నేతల్లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

  #Telangana severe Heatwaves : High Temperatures In Telangana మండుతున్న ఎండలు
  జానారెడ్డిని గెలిపిస్తే అంతా మంచి జరుగుతుంది..

  జానారెడ్డిని గెలిపిస్తే అంతా మంచి జరుగుతుంది..

  అంతే కాకుండా సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజులో ఒక లక్ష రూపాయల రుణమాఫీ చేశామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. అన్ని కులాల,మతాలకు సంబంధించిన విద్యార్థులకు స్కూల్స్, కాలేజీలో ఉచితంగా చదువుకోడానికి ఫీజ్ రీఎంబెర్స్మెంట్ ఇచ్చామని గుర్తుచేసారు. ఎస్సీ, ఎస్టీల సబ్ ప్లాన్ తో అన్ని గ్రామాలు, పట్టణాలో దళిత వాడలను అభివృద్ధి చేసామని, ఎన్ఆర్జీఎస్ స్కీం తో ఆ రోజులో కూడా చెరువు , కుంటాలను రైతుల కోసం అభివృద్ధి చేసిన అంశాన్ని జగ్గారెడ్డి గుర్తుచేసారు. సోనియా గాంధీ నాయకత్వం లో ఉపాధి హామీ అనే పధకం ద్వారా అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, ప్రతి కుటుంబానికి పని కలిగించి ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పిస్తూ ఆదుకుంది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అని జగ్గారెడ్డి తెలిపారు.

  English summary
  Congress would win the by election in Nagarjuna Sagar, stressed manikkam Tagore, AICC incharge Affairs Tpcc.CM Chandrasekhar Rao was highly utilizing of liquor, police, money and power in sagar Manikkam said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X