వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈఎస్‌ఐ కుంభకోణంలో మరోముగ్గురి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ఇఎస్ఐ కుంభకోణంలో మరో ముగ్గురిని ఎసీబీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. వెంకటేశ్వర హెల్త్ కేర్ ఎండీ అరవింద్ రెడ్డితో పాటు కె.లిఖిత్ రెడ్డి, కె.రామిరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకోవడంతో ఈ కుంభకోణానికి సంబంధించి మొత్తం అరెస్ట్ లు 13కు చేరాయి. ఇఎస్ఐ డైరెక్టర్ పద్మతో కలసి అరవింద్ రెడ్డి అక్రమాలకు పాల్పడినట్టు ఎసిబీ అధికారులు గుర్తించారు. ఇఎస్ఐకి పరికరాలు సరఫరా చేసినట్టుగా నకిలీ పత్రాలను సృష్టించి అవినీతికి పాల్పడ్డారు.

తెలంగాణా ఈఎస్ఐ మందుల భారీ కుంభకోణం .. విస్తుబోయే వాస్తవాలు.. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి అరెస్ట్ తెలంగాణా ఈఎస్ఐ మందుల భారీ కుంభకోణం .. విస్తుబోయే వాస్తవాలు.. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి అరెస్ట్

ఈఎస్‌ఐకి పరికరాలు సరాఫరా చేసినట్టుగా పత్రాలు సృష్టించి అరవింద్‌రెడ్డి అవినీతీకి పాల్పడినట్టుగా గుర్తించారు. జాయింట్ డైరక్టర్‌ పద్మతో కలిసి అక్రమాలకు తెరతీసినట్టు ఏసీబీ అధికారులు తేల్చారు. కాగా 2013 నుంచి ఈయన అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. కాగా భూపాలపల్లి జిల్లా నందిగామ జిల్లాకు చెందిన అరవింద్ రెడ్డి ఔషధ తయారీ సంస్థలోని కార్మీకులకు ఈఎస్ఐ ద్వార వైద్యసేవలు అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ACB arrested three more people in connection with ESI scam

కార్మీకులకు వైద్య పరీక్షలు నిర్వహించి,మెడిసిన్ సరఫరా చేసినట్టు రికార్డులు సృష్టించారు. కార్మీకుల పేరుతో ఒక్కోటి రూ.18 వేల వరకు ఉండే వివిధ రకాల పరీక్షల కిట్స్‌ మరియు ఇతర వైద్య పరికరాలను తెప్పించి, వాటిని కార్మీకులకు ఇవ్వకుండా పక్కదారి పట్టించి సోమ్ము చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గత వారం రోజులుగా కొనసాగుతున్న ఏసీబీ విచారణలో ఈ కుంభకోణంలో ఎవరి పాత్ర ఎంత ఉందనే సమాచారాన్ని ఏసీబీ అధికారులు రాబడుతున్నారు.

English summary
ACB arrested three more people in connection with the multi-crore scam relating to supply of medicine to despensaries and esi hospitals across telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X