వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏసీబీ ఏఎస్పీ సునీతారెడ్డిపై సస్పెన్షన్ వేటు

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

లేడీ ఏఎస్పీతో సీఐ బాగోతం : కొత్త మలుపులు

హైదరాబాద్: పోలీస్‌శాఖలో అనైతిక వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తన వివాదాస్పద వ్యవహారశైలితో పోలీస్‌శాఖ పరువు తీసిందనే ఆరోపణలపై ఏసీబీ ఏఎస్పీ సునీతారెడ్డిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ఏసీబీ ఏఎస్పీ సునీతారెడ్డి, కల్వకుర్తి సీఐ మల్లికార్జునరెడ్డిల వ్యవహారాన్ని సునీత భర్త సురేందర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా బయటపెట్టడం, ఈ అనైతిక వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేసి సీఐ మల్లికార్జున రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం తెలిసిందే.

ACB ASP Sunita Reddy Suspended

డీజీపీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ మేరకు ఏఎస్పీ సునీతను సస్పెండ్ చేస్తూ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో సీఐ మల్లికార్జున్ రెడ్డిపై ఐజీ స్టీఫెన్ రవీంద్ర వేటు వేశారు. మల్లికార్జున్ రెడ్డిపై మాదాపూర్ పీఎస్‌లో కేసు కూడా నమోదైంది.

రాసలీలల వ్యవహారంపై ఏసీబీ ఏఎస్పీ సునీతారెడ్డి ఇంటికి మంగళవారం కేపీహెచ్‌బీ పోలీసులు వెళ్లారు. అక్కడ ఆమె స్టేట్‌మెంట్‌ను వారు రికార్డు చేశారు. అలాగే సీఐ మల్లికార్జున్‌రెడ్డిని కూడా పోలీసులు ప్రశ్నించారు.

అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించి ఐజీ స్టీఫెన్ రవీంద్ర డీజీపీకి తన నివేదిక అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా ఏఎస్పీ సునీతను సస్పెండ్ చేయాల్సిందిగా డీజీపీ ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది.

English summary
ACB ASP Sunita Reddy was Suspended by the police department on Tuesday evening. In regard of the extra marital affair with Kalvakurti CI Mallikarjun Reddy Sunita's husband Narendar Reddy catch the two accused in redhand. Later he complained to DGP about CI Mallikarjun Reddy behaviour. IG Stephen Ravindra enquired the whole matter and submitted his report to DGP. According to the report Government taken action against ASP Sunita Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X