హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ దాడులు: బయటపడ్డ నోట్ల గుట్టలు, ఆభరణాలు, ఆస్తుల పత్రాలు

|
Google Oneindia TeluguNews

యాదాద్రి భువనగిరి: మరో భారీ అవినీతి తిమంగలం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి చిక్కింది. యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు, ఆభరణాలు లభ్యమయ్యాయి. గురువారం ఓ వ్యక్తికి సంబంధించిన ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్ విషయంలో మధ్యవర్తి ప్రభాకర్‌తో కలిసి రూ. 20 వేలు లంచం తీసుకున్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ దేవానంద్‌పై కేసు నమోదు చేశారు.

రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం అడిగాడు..

రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం అడిగాడు..

సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి చిక్కారు. హైదరాబాద్ యాప్రాల్‌కు చెందిన డాక్టర్ సత్యం మడె అనే స్థిరాస్థి వ్యాపిర 2008లో ఆలేరు మండలం కొలనుపాకలో స్వీస్‌లైప్ గ్రీన్ ఏవెన్యూ అనే వెంచర్ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు విక్రయిస్తున్నారు. అందులోని ఐదు నివాస స్థలాలను ఇటీవల కొందరికి అమ్మి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడానికి యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. అయితే, ఆ వెంచర్ గ్రామ పంచాయతీ అనుమతులతో చేసిందని, వాటికి రిజస్ట్రేషన్ చేయమంటూ సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ సాకులు చెప్పాడు. ఆ తర్వాత డాక్యుమెంట్‌కు రూ. 10 వేల చొప్పున లంచం అడిగాడు.

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

తాను అంత ఇవ్వలేనని బాధితుడు చెప్పాడు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర ఉన్న ప్రిన్స్ దస్తావేజు లేఖరుల కార్యాలయంలోని దస్తావేజు లేఖరి సహాయకు డు ప్రభాకర్ మధ్యవర్తిత్వంతో మొత్తం రూ. 20 వేలు ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దేవానంద్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Recommended Video

ఒక్క రోజు ముందే సీతారాముల కల్యాణం!! || Oneindia Telugu
సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో.. 76 కోట్ల నగదు, ఆభరణాలు సీజ్..

సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో.. 76 కోట్ల నగదు, ఆభరణాలు సీజ్..


లంచంగా తీసుకోబోయిన డబ్బు, తీసుకున్నట్లుగా తెలిపే ఆధారాలు సేకరించిన క్రమంలో దేవానంద్ నివాసంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ మేడిపల్లిలోని దేవానంద్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ. 76,09,500 నగదు, 27.03 గ్రాముల బంగారు ఆభరణాలు, 7.09 ఎకరాల ల్యాండ్ డాక్యుమెంట్లు, 200 గజాల్ ఫ్లాట్‌కు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ తెలిపారు. నిందితులిద్దరినీ హైదరాబాద్‌లోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు.

English summary
ACB officials raids in yadagirigutta sub registrar house: Huge money and ornaments seized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X