హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. 3 కోట్లకుపైగా ఆస్తుల గుర్తింపు: లంచం తీసుకున్న సీఐ, ఏఎస్ఐ చంచల్‌గూడ జైలుకు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: షాబాద్ ఇన్‌స్పెక్టర్ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్‌కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉస్మానియా ఆస్పత్రిలో సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిద్దరినీ ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

షాబాద్ సీఐ శంకరయ్యకు సంబంధించి ఏసీబీ అధికారులు భారీగా ఆదాయానికి మంచిన ఆస్తులను గుర్తించారు. రెండు ఇళ్లు, 11 ఇళ్ల స్థలాలు, బంగారు ఆభరణాలు, 41 ఎకరాల వ్యవసాయ భూమి, రూ. 17,88 లక్షల నగదు సహా రూ. 3.58 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. శుక్రవారం ఎల్బీనగర్‌లోని సీఐ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

ACB unearths Rs 3.5 crore worth assets from Shabad CIs residence in Hyderabad

కాగా, భూ వివాదానికి సంబంధించి కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు షాబాద్ సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్ పోలీస్ స్టేషన్లోనే రూ. 1.2 లక్షల లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు సదరు పోలీసు అధికారి నివాసాల్లో సోదాలు నిర్వహించి భారీ ఆస్తులను గుర్తించారు.

English summary
The Anti-corruption Bureau (ACB) officials on Friday unearthed Rs 3 crore worth assets from Shabad Circle Inspector's residence here at LB Nagar in Hyderabad. The officials also recovered property documents and are also verifying his bank lockers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X