హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నకిలీ వెబ్‌సైట్‌తో మోసం చేసిన ఘరానా మోసగాడు ఇతనే

నకిలీ వెబ్‌సైట్ సృష్టించి అమాయకులను మోసం చేసిన ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని అతను మోసం చేశాడు.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన వెబ్‌సైట్ మాదిరిగా మరో వెబ్‌సైట్‌ను తయారు చేసి అమాయకులను మోసం చేస్తున్న చెన్నైకి చెందిన ఓ ఘరానా మోసగాడిని హైదరాబాద్ సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ అవినాష్ మహంతి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎంఎస్‌ఎంఈ(మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్) కేంద్ర ప్రభుత్వ సంస్థ. చిన్న చిన్న సంస్థలు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటాయి.

అధికారిక వెబ్‌సైట్ మాదిరిగానే చెన్నైకి చెందిన కోల్‌తుంగ భూపతి ఎస్‌ఎంఈరిజిస్టార్.కామ్ (msmeregister.com) వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ వెబ్‌సైట్ గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో రావాలనే ఉద్దేశ్యంతో ప్రకటనల కోసం గూగుల్‌కు డబ్బులు చెల్లిస్తున్నాడు. దేశ వ్యాప్తంగా ఎంఎస్‌ఎంఈ కోసం గూగుల్‌లో శోధన చేసేవారికి ఇతడి వెబ్‌సైట్ ప్రకటన ముందుగా కన్పిస్తుంది.

Accused in cheating with fake website arrested

దీంతో ఇదే నిజమైన వెబ్‌సైట్ అనుకొని చాలమంది అందులోకి వెళ్లి దరఖాస్తు ఫారాలు నింపుతూ, రూ. 1500 నుంచి 2500 వరకు చెల్లిస్తున్నారు. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డబ్బులు చెల్లించిన తరువాత కాని తాము మోసపోయామని వినియోగదారులు గ్రహిస్తున్నారు.

ఇదే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఒక ప్లాస్టిక్ తయారీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గత ఏడాది డిసెంబర్‌లో ఎంఎస్‌ఎంఈలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం గూగుల్‌లో వెతుకుతుండగా భూపతికి సంబంధించిన వెబ్‌సైట్ కనపడింది.

దీంతో అందులోకి వెళ్లి దరఖాస్తు ఫారాన్ని నింపగానే, రూ. 1481లు చెల్లించాలంటూ సూచన రావడంతో క్రెడిట్ కార్డుతో చెల్లించాడు. 24 గంటలు గడిచినా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రాకపోవడంతో మరోసారి ఉద్యోగ్ ఆధార్ వెబ్‌సైట్ ద్వారా అసలైన వెబ్‌సైట్‌లోకి వెళ్లాడు. అందులో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా ఎలాంటి డబ్బు అడగలేదు.
దీంతో ఆ వెబ్‌సైట్ నకిలీదని గ్రహించి సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. ఫేక్ వెబ్‌సైట్ నిర్వహణ, ఆ సైట్‌లో చెల్లించే డబ్బంతా చెన్నైలోని బ్యాంకు ఖాతాలోకి వెళ్తుందని పోలీసులు గుర్తించారు.

మంగళవారం నిందితుడు భూపతిని అదుపులోకి తీసుకొని విచారించారు. పలు ప్రాంతాలల్లో ప్రజలు ఇతడి వెబ్‌సైట్‌లోకి వెళ్లి మోసపోయారని పోలీసులు గుర్తించారు. గతంలో ఇన్‌స్టా సర్వ్ పేమెంట్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, కేఆర్ ఇంటర్‌నెట్ అడ్వర్‌టైజర్స్, స్మూత్ ఎంటర్‌ప్రైజెస్, హెల్పింగ్ అట్యూటుడ్ చారిటబుల్ ట్రస్ట్, పుష్‌టెక్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను ఏర్పాటు చేసి నష్టపోయి, ఫేక్ వెబ్‌సైట్ బాట పట్టాడని పోలీసుల విచారణలో వెల్లడించాడు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 8 వేల మందికి పైగా ఈ ఫేక్‌వెబ్‌సైట్‌ను చూసి మోసపోయారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఏసీపీ రఘువీర్ తెలిపారు.

English summary
Accused in a case cheating youth creating fake website in Hyderabad of Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X