వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు రాష్ట్రాల్లో ఫిట్ నెస్ లేని స్కూలు బస్సులపై కొరడా .. 60 ఏళ్ళు దాటిన డ్రైవర్లున్నా సరే కఠిన

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో ఫిట్నెస్ లేని బస్సులపై కొరడా ఝుళిపిస్తున్నారు ఆర్టీఏ అధికారులు. పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో పాఠశాలలకు విద్యార్థులు చేరవేసే బస్సులు కండిషన్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తున్నారు. బస్సులకు ఫిట్నెస్ లేకుంటే నిర్దాక్షిణ్యంగా సీజ్ చేస్తామంటూ హెచ్చరించిన అధికారులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఒక ఎపీలోనే ఇప్పటి వరకు దాదాపు 400 కేసులు బుక్ అయ్యినట్టు తెలుస్తుంది.

మొన్న నారాయణ.. నిన్న చైతన్య సీజ్ .. ఏపీలో ఇక వారికి బ్యాడ్ టైం ప్రారంభమైనట్లేనా.. ?మొన్న నారాయణ.. నిన్న చైతన్య సీజ్ .. ఏపీలో ఇక వారికి బ్యాడ్ టైం ప్రారంభమైనట్లేనా.. ?

తెలుగు రాష్ట్రాల్లో ఫిట్ నెస్ లేని స్కూలు బస్సులపై కొరడా .. 60 ఏళ్ళు దాటిన డ్రైవర్లున్నా సరే కఠిన చర్యలు

తెలుగు రాష్ట్రాల్లో ఫిట్ నెస్ లేని స్కూలు బస్సులపై కొరడా .. 60 ఏళ్ళు దాటిన డ్రైవర్లున్నా సరే కఠిన చర్యలు

తెలుగు రాష్ట్రాల్లో ఫిట్నెస్ లేని బస్సులపై కొరడా ఝుళిపిస్తున్నారు ఆర్టీఏ అధికారులు. పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో పాఠశాలలకు విద్యార్థులు చేరవేసే బస్సులు కండిషన్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తున్నారు. బస్సులకు ఫిట్నెస్ లేకుంటే నిర్దాక్షిణ్యంగా సీజ్ చేస్తామంటూ హెచ్చరించిన అధికారులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఒక ఎపీలోనే ఇప్పటి వరకు దాదాపు 400 కేసులు బుక్ అయ్యినట్టు తెలుస్తుంది.

ఫిట్ నెస్ లేకుంటే బస్సులు సీజ్ చేస్తామని హెచ్చరించిన మంత్రి .. రంగంలోకి రవాణాశాఖ

ఫిట్ నెస్ లేకుంటే బస్సులు సీజ్ చేస్తామని హెచ్చరించిన మంత్రి .. రంగంలోకి రవాణాశాఖ

ఏపీలో ఫిట్నెస్ లేని స్కూలు బస్సులపై కూడా కొరడా ఝళిపిస్తున్నామని ప్రకటించారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని. ఫిట్నెస్ లేకుండా విద్యా సంస్థలకు సంబంధించిన బస్సులను నడిపితే సీజ్ చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే . ఇక ఫిట్నెస్ లేని బస్సులను నడిపే స్కూల్ యాజమాన్యాలు తమ పార్టీకి సంబంధించినవే అయినా సరే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఫిట్నెస్ లేకుండా నడుస్తున్న బస్సుల సమాచారాన్ని తమకు తెలిపితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్ని నాని ప్రకటించారు .స్కూల్ బస్సుల ఫిట్నెస్ చేయించుకోవడానికి సమయం ఇచ్చిన రావాణా శాఖ ఇప్పుడు ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేసే పనిలో బిజీగా ఉంది .

గుంటూరు జిల్లాలో ఫిట్ నెస్ లేని 68 బస్సులపై కేసులు

గుంటూరు జిల్లాలో ఫిట్ నెస్ లేని 68 బస్సులపై కేసులు

ఫిట్నెస్ లేని వాహనాలపై చర్యలు తీసుకోవడం లో భాగంగా గుంటూరు జిల్లాలో ఆర్టీఏ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. డీటీసీ రాజారత్నం ఆధ్వర్యంలో చేపట్టిన వాహన తనిఖీలలో ఫిట్నెస్ లేని 68 బస్సులపై ఇప్పటివరకూ కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా 21 బస్సులను ఇప్పటివరకు సీజ్ చేశారు'వివిధ విద్యా సంస్థలు విద్యార్థుల కోసం నడిపే స్కూల్ బస్సుల కండిషన్ పై దృష్టిసారించిన అధికారులు అన్ని బస్సులకు ఫిట్నెస్ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు.

60 ఏళ్ళు దాటితే డ్రైవర్ గా అనర్హుడు అంటున్న అధికారులు

60 ఏళ్ళు దాటితే డ్రైవర్ గా అనర్హుడు అంటున్న అధికారులు

స్కూలు బస్సు లను నిర్వహించే యాజమాన్యం 60 సంవత్సరాలు పైబడిన వారిని డ్రైవర్లుగా నియమించకూడదు అని, 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తి స్కూల్ బస్సు నడపడానికి అర్హుడు కాదని అధికారులు చెబుతున్నారు. ఇక అలాంటి వారితో బస్సులు నడిపించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. విజయవాడలో డీటీసీ మీరా ప్రసాద్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేస్తున్న అధికారులు ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తున్నారు.

హైదరాబాద్ లోనూ స్కూల్ , కాలేజ్ బస్సుల తనిఖీలు .. 71 కేసులు నమోదు

హైదరాబాద్ లోనూ స్కూల్ , కాలేజ్ బస్సుల తనిఖీలు .. 71 కేసులు నమోదు

ఇటు హైదరాబాద్ లోనూ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. హబ్సిగూడ దగ్గర ఆర్టీఏ అధికారులు, ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీల్లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కూలు, కాలేజీ బస్సులను సీజ్ చేశారు. ఈ నెల 12 నుంచి 30 వరకు ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఫిట్నెస్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ కిట్ లేకుండా నడుపుతున్న స్కూలు, కాలేజీ బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులను ఉపేక్షించబోమని అధికారులు చెబుతున్నారు. ఇక ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీ లో 71 కేసులు నమోదయ్యాయి.

English summary
The transport department officials conducted surprise checks and seized buses of various educational institutions hitting the road flouting the norms. In all, the officials seized 156 buses and registered aproximately 400 cases against the buses of educational institutions across the State . RTA officials in Guntur district have been conducting vehicle inspections as a result of taking action on non-fitness vehicles. The DTC Rajaratnam-based vehicle inspections have so far registered 68 cases of non-fitness buses. In addition, 21 buses have been sieged so far.Officials say the owners of school buses should not hire drivers over the age of 60 and a person over 60 is not eligible to operate a school bus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X