• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏంటమ్మా అలా ఇచ్చావు బైట్-ఇంకోసారి రిపీట్ చేయొద్దు-హీరో శ్రీకాంత్‌కు నటుడు నరేష్ వార్నింగ్

|

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంపై నటీనటుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఘటనపై సీనియర్ నటుడు నరేష్ స్పందించిన తీరు పట్ల అభ్యంతరాలు వ్యక్తమవడం... ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చుకోవడం తెలిసిందే.అంతటితో ఈ వివాదానికి ఇక ముగింపు పలికినట్లేనని అంతా భావించారు.కానీ నటుడు నరేష్ మరోసారి ఈ విషయంపై స్పందించారు. హీరో శ్రీకాంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు నరేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

'శ్రీకాంత్... నా బైట్‌పై నీ స్పందన చూశాను... ఏంటమ్మా అలా ఇచ్చావు బైట్... కచ్చితంగా సాయి ధరమ్ తేజ్ స్పీడ్‌లో లేడు... బురదలో జారిపడ్డాడు... నేను చెప్పినదానికి మీడియాలో తేడాగా వస్తే కొంతమంది పెద్దలు ఫోన్లు చేశారు... దీంతో వెంటనే నేను వివరణ ఇచ్చాను...బైట్స్ ఇచ్చేముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి...చనిపోయినవాళ్ల గురించి నేను చెప్పలేదు.. జనరల్‌గా ఇండస్ట్రీలో జరిగింది చెప్పాను.బైక్స్‌ను చాక్లెట్లలా పిల్లలకు ఇవ్వం.వాళ్లు పెద్దవాళ్లు.యాక్సిడెంట్స్ నాకు జరిగాయి... చాలామందికి జరిగాయి...కానీ ఆవిధంగా మాట్లాడటం నొప్పించింది.నా కళ్ల ముందు నువ్వు హీరోగా రావడం చూశాను.మంచి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నావు.మా ఎన్నికల్లో పోటీ చేసి దురదృష్టవశాత్తు ఓడిపోయావు.దయచేసి ఇంకొకసారి ఇలా బైట్స్ ఇవ్వొద్దు.బైట్స్ ఇచ్చే ముందు జాగ్రత్త.' అంటూ నరేష్ శ్రీకాంత్‌ను హెచ్చరించారు.

actor naresh warns hero srikanth over his comments against him regarding sai dharam tej accident

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌పై మొదట నరేష్ వీడియో బైట్ ద్వారా స్పందించిన సంగతి తెలిసిందే. బైక్ రైడ్స్ విషయంలో తన కొడుకు నవీన్,సాయి ధరమ్ తేజ్‌లకు తాను కౌన్సెలింగ్ ఇవ్వాలని అనుకున్నానని... కానీ ఇంతలోనే తేజు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని వ్యాఖ్యానించారు. నరేష్ చేసిన వ్యాఖ్యలతో సాయి ధరమ్ తేజ్‌కు బైక్ రేసింగ్‌లకు వెళ్లే అలవాటు ఉందేమోనన్న అనుమానాలు కలిగాయి. ఈ నేపథ్యంలో మొదట బండ్ల గణేష్ నరేష్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఆ తర్వాత హీరో శ్రీకాంత్ కూడా నరేష్ వ్యాఖ్యలను తప్పు పట్టారు.

శ్రీకాంత్ ఏమన్నారంటే... :

'సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి అందరికీ తెలిసిందే.చాలా చిన్న యాక్సిడెంట్... కామన్‌గా జరిగిదే... రోడ్డుపై ఇసుక వల్లే స్కిడ్ అయి పడిపోయాడు.త్వరగా కోలుకుంటాడు... కోలుకోవాలని మనస్పూర్తిగా దేవుడిని కోరుతున్నాను. దయచేసి వీడియో బైట్లు పెట్టేముందు ఆలోచించి పెట్టండి.నాకు తెలిసిన యువతలో సాయి ధరమ్ తేజ్ చాలా మెచ్యూర్డ్. నాకు తెలుసు... అతను రాష్ డ్రైవింగ్ చేసే వ్యక్తి కాదు. కుటుంబ సభ్యులంతా టెన్షన్‌లో ఉన్న సమయంలో... ఆ వీడియో బైట్స్ వారిని మరింత ఆందోళన గురిచేస్తాయి. నరేష్ పెట్టిన బైట్‌లో చనిపోయినవాళ్ల గురించి ప్రస్తావించకుండా ఉంటే బాగుండేదని అనిపించింది. ఇటువంటి బైట్స్ ఎవరూ పెట్టవద్దని కోరుకుంటున్నాను.త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.' అని శ్రీకాంత్ పేర్కొన్నారు.

బండ్ల గణేష్ స్పందించిన వెంటనే నరేష్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.'నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇద్దరూ కలిసి వెళ్లిన మాట వాస్తవమే గానీ... ఇద్దరూ ఒక ఛాయ్ షాపు ఓపెనింగ్‌కి వెళ్లారు. అక్కడి నుంచి ఎవరికి వారు వస్తున్నప్పుడు ఇద్దరు సెపరేట్‌గా ఉన్నారు. వీళ్లెవరూ రేసులో లేరు. ఆ సమయంలో సాయి ధరమ్ తేజ్ సాధారణ స్పీడ్ 60,70కి.మీ వేగంతో వెళ్తున్నాడు. రోడ్డుపై ఉన్న మట్టి కారణంగానే ప్రమాదం జరిగింది. అంతే తప్ప ఇది నిర్లక్ష్యం కాదు.యాక్సిడెంట్ మాత్రమే.కాబట్టి బిడ్డలు బాగుండాలని కోరుకుంటాం తప్ప వేరే ఆలోచన లేదు.' అని నరేష్ చెప్పుకొచ్చారు. నరేష్ వివరణతో వివాదం సద్దుమణిగిందని అంతా భావించారు.కానీ నరేష్ శ్రీకాంత్‌కు కౌంటర్ ఇవ్వడంతో ఈ వివాదాన్ని మళ్లీ రేపినట్లయింది. నరేష్ కౌంటర్‌పై శ్రీకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.

English summary
The war of words between the actors over the mega hero Sai Dharam Tej road accident continues. On Tuesday,Naresh given strong counter to the remarks made by the hero Srikanth against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X