• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కరోనా రెండోసారి వ్యాప్తి పచ్చి బూటకం -కార్పొరేట్ కంపెనీల లబ్ది కోసమే -ఆర్. నారాయణమూర్తి సంచలనం

|

భారత్ సహా ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృభిస్తుండటం, కొత్త కేసులు, మరణాల సంఖ్య అమాంతం పెరిగిపోవడంతో సర్వత్రా భయాందోళనలను వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు మరలా లాక్ డౌన్ లోకి వెళ్లిపోగా, మన దేశంలో మహారాష్ట్ర, పంజాబ్ లాంటి రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూను విధించాయి. కాగా, కరోనా వైరస్ రెండోసారి వ్యాప్తి చెందమనేది పచ్చి బూటమని, ఇదంతా కార్పొరేట్ కంపెనీలకు లబ్ది చేకూర్చడానికి జరుగుతోన్న కుట్ర అని కమ్యూనిస్టు ఉద్యమకారుడు, నటుడు ఆర్. నారాయణమూర్తి బాంబు పేల్చారు.

జగన్‌కు కేంద్రం భారీ షాక్ -పోలవరం తాజా అంచనాలకు ఆర్థిక శాఖ నో -అదే ప్రాజెక్టు వద్ద కొత్త లిఫ్ట్ ఇరిగేషన్‌జగన్‌కు కేంద్రం భారీ షాక్ -పోలవరం తాజా అంచనాలకు ఆర్థిక శాఖ నో -అదే ప్రాజెక్టు వద్ద కొత్త లిఫ్ట్ ఇరిగేషన్‌

సెకండ్ వేవ్ బూటకం..

సెకండ్ వేవ్ బూటకం..

కరోనా రెండోసారి వ్యాప్తి చెందటం అనేది పూర్తిగా బూటకమని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో హాస్యానందం సంస్థ ఏర్పాటు చేసిన కార్టూన్‌ ఎగ్జిబిషన్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. కార్పొరేట్‌ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే కరోనా రెండోసారి వ్యాప్తి అంటూ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎందుకంటే..

ఉత్పత్తుల అమ్మకాల కోసమే..

ఉత్పత్తుల అమ్మకాల కోసమే..

ప్రజల్లో కరోనా పట్ల భయాలను ఇంకాస్త పెంచి, కార్పొరేట్ సంస్థలు తయారు చేసే శానిటైజర్లు, మాస్క్‌లు, ఇతర మెడికల్‌ వస్తువులు అమ్ముకొని సొమ్ము చేసుకోవటానికే రెండో సారి వైరస్ వ్యాప్తి చెందుతోందనే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని, ప్రభుత్వాలు కేవలం కార్పొరేట్‌ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నాయని నారాయణమూర్తి ధ్వజమెత్తారు. ఇందుకు ఉదాహరణగా..

తిరుపతి పోరు: బీజేపీ సంచలనం -జనసేనకు విడిగా సొంత కమిటీ -దాసరికి చోటు -టికెట్ రత్నప్రభకే!తిరుపతి పోరు: బీజేపీ సంచలనం -జనసేనకు విడిగా సొంత కమిటీ -దాసరికి చోటు -టికెట్ రత్నప్రభకే!

అంబానీ, అదానీలకు లాభం..

అంబానీ, అదానీలకు లాభం..

కరోనా విలయకాలంలో దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలు మాత్రమే చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డారన్న నారాయణమూర్తి.. సరిగ్గా ఈ సమయంలోనే ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి కార్పొరేట్‌ శక్తులు మాత్రం వేల కోట్ల రూపాయిలు దండుకున్నాయని దుయ్యబట్టారు. కాగా, దేశంలో ప్రస్తుతం అమలవుతోన్న కొవిడ్ ప్రొటోకాల్ ప్రకారం.. కరోనా వైరస్ వ్యాప్తిపై, వ్యాక్సినేషన్ ప్రక్రియపై తప్పుడు ప్రకటనలు చేసినా, ఫేక్ సమాచారాన్ని వ్యాప్తి చేసినా ఆయా వ్యక్తులు లేదా సంస్థలు శిక్షార్హులు అవుతారు. కరోనా సెకండ్ వేవ్ ఫేక్ అంటూ నారాయణమూర్తి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రభుత్వం ఇంకా స్పందించాల్సిఉంది. కాగా,

పంచభూతాలనూ అమ్మేస్తున్నారు..

పంచభూతాలనూ అమ్మేస్తున్నారు..

విజయవాడలో జరిగిన కార్టూన్‌ ఎగ్జిబిషన్‌ లో మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నారాయణమూర్తి.. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశాన్నీ ప్రస్తావించారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటును ఇప్పుడు ఉన్నపళంగా ప్రైవేటుకు అప్పగించడం దారుణమన్నారు. పంచ భూతాలను కూడా అమ్ముకునే విధంగా కేంద్రంలోని మోదీ సర్కారు చర్యలు చేపడుతుందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే..

మోదీపై గట్టిగా పోరాడుదాం..

మోదీపై గట్టిగా పోరాడుదాం..


విశాఖపట్నం స్టీల్ ప్లాంటు కాపాడుకునే ఉద్యమంతోపాటు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఉద్యమానికి కూడా అందరూ మద్దతు పలకాలని ఆర్‌.నారాయణమూర్తి పిలుపునిచ్చారు. తెలంగాణలో శనివారం జరిగిన మరో కార్యక్రమంలోనూ కేంద్రంపై ఆయన నిప్పులు చెరిగారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో సీపీఐ(ఎంఎల్) -న్యూడెమెక్రసీ పార్టీ నిర్వహించిన రైతు పోరు గర్జన సభకు హాజరైన ఆయన.. కేంద్రంలోని మోదీ సర్కారుపై ఇంకా గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని, తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే ఫెడరల్ ఫ్రంట్ ప్రారంభించి, మోదీ, కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నారాయణమూర్తి అన్నారు.

English summary
tollywood Actor R. Narayana Murthy made Controversial comments on covid-19. speaking at an event in vijayawada on sunday, murthy said the second wave of coronavirus spread is a hoax. The move is aimed to benefit multinational companies, he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X