హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బుల్లితెర నటుడి అరెస్ట్: వ్యసనాలకు బానిసై ఎంతకు దిగజారాడంటే?..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి అనూహ్యంగా నటుడిగా మారిన అతగాడు.. జల్సాల కోసం అడ్డదారి తొక్కాడు. చోరీల ద్వారా వచ్చిన డబ్బుతో వ్యసనాలకు బానిసయ్యాడు. గత రెండేళ్లలో మొత్తం 16దొంగతనాలకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. వీటిపై దర్యాప్తు జరపగా ఎట్టకేలకు సదరు దొంగ పోలీసులకు చిక్కక తప్పలేదు.

ఎవరతను?:

ఎవరతను?:

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలోని లక్కారంరోడ్డు ప్రాంతానికి చెందిన బారి నాగరాజు(23) అలియాస్‌ నరేందర్‌ అలియాస్‌ గుంటూరు నరేంద్ర బతుకుదెరువు కోసం 2016లొ నగరానికి వచ్చాడు. డిగ్రీ మధ్యలో మానేసిన నరేంద్ర.. అంతకుముందు స్థానికంగా సెంట్రింగ్‌ కార్మికుడిగా పని చేశాడు.

ప్రొడక్షన్ సంస్థల్లో పనిచేశాడు..:

ప్రొడక్షన్ సంస్థల్లో పనిచేశాడు..:

స్వతహాగా సినిమా రంగంపై ఆసక్తి ఉండటంతో.. ఆ దిశగా ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే పలు ప్రముఖ స్టూడియోల్లో ప్రొడక్షన్ విభాగంలో కొన్నాళ్లు పనిచేశాడు. అదే సమయంలో ఓ కామెడీ షోలో నటించే అవకాశం కూడా దక్కించుకున్నాడు. అప్పటినుంచి క్రమంగా మద్యానికి ఇతరత్రా వ్యసనాలకు బానిసయ్యాడు.

నాలుగు బైక్ చోరీలు:

నాలుగు బైక్ చోరీలు:

జల్సాలకు డబ్బులు సరిపోకపోతుండటంతో.. చోరీ మార్గాన్ని ఎంచుకున్నాడు. గతంలో హుజూర్ నగర్ ప్రాంతంలో నాలుగు బైకులు దొంగతనం చేశాడు. గత రెండేళ్లలో మొత్తం 16 దొంగతనాలకు పాల్పడ్డాడు. ఎట్టకేలకు ఏప్రిల్ 10న రాచకొండ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

భారీ డబ్బు స్వాధీనం..

భారీ డబ్బు స్వాధీనం..

అతని నుంచి రూ.14,52,500 విలువైన 72 తులాల బంగారం, 310 గ్రాముల వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానం రాకుండా ఉండటానికి ఆ నగలను ప్రముఖ గోల్డ్ లోన్ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

English summary
TV actor Bari Nagaru, who turned as thief was held by Rachakonda Police on Monday. His native is Nalgonda, 2years back he came to city to search for job opportunities
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X