హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Priyanka Reddy Murder: 24 గంటల్లో పట్టుకొన్నారా? రక్షణ కల్పించే ప్రభుత్వాలు ఎక్కడ.. హేమ ఫైర్

|
Google Oneindia TeluguNews

డాక్టర్ ప్రియాంకారెడ్డి గ్యాంగ్‌రేప్ ఘటన తర్వాత తెలంగాణలో మహిళ భద్రతపై తీవ్రమైన చర్చ జరుగుతున్నది. అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ప్రియాంకారెడ్డి ఘటనపై నటి హేమ స్పందించారు. మహిళ రక్షణకు కట్టుబడి ఉండే ప్రభుత్వాలు, పోలీసు శాఖ ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా హేమ మాట్లాడుతూ..

అలా చేసి ఉంటే ప్రియాంకారెడ్డి బతికేది.. హత్యాఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డిఅలా చేసి ఉంటే ప్రియాంకారెడ్డి బతికేది.. హత్యాఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి

 పిల్లలపై అవగాహన కల్పించాలి

పిల్లలపై అవగాహన కల్పించాలి

డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యా సంఘటనలు జరిగినప్పుడే మహిళ భద్రత గురించి చర్చ జరుగుతుంది. ఇలాంటి చర్చలు జరగడం వల్ల ప్రయోజనం ఉండదు. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడంపైనే సమాజంలో మార్పు ఆశించవచ్చు. ఆడపిల్లకు తల్లి పరిస్థితులపై అవగాహన కల్పించాలి. పిల్లలకు లింగత్వంపై అవగాహన కల్పించాలి. సమాజంలో పరిస్థితులు చేస్తే భయకరంగా ఉన్నాయి. చిన్నారిపై లైంగిక దాడి జరుగుతున్నది. కూతురుపై తండ్రి, చెల్లెలిపై సోదరుడు రేప్ చేస్తున్నారు. సమాజంలో ఇలాంటి క్రూరులు ఉన్నారు అని నటి హేమ ఆవేదన వ్యక్తం చేశారు.

అమ్మాయిలు ఆపద సమయంలో

అమ్మాయిలు ఆపద సమయంలో

లైంగికంగా, అభ్యంతరకరంగా టచ్ చేస్తే తల్లిదండ్రులకు గానీ, టీచర్లకు గానీ చెప్పాలని చెప్పాలి. పసితనంలో వారికి ఇలాంటి హెచ్చరికలు చేస్తే ఇలాంటి ఘోరాలు జరుగడానికి ఆస్కారం ఉండదు. ప్రియాంక రెడ్డికే కాదు.. చాలా మంది అమ్మాయిలకు ఆపద సమయంలో ఏ నంబర్లకు ఫోన్ చేయాలో తెలియడం లేదు. అందుకే ఇలాంటి దారుణాలను మనం చూస్తున్నాం అని నటి హేమ అన్నారు.

గంటల తరబడి ఏడ్చాను

గంటల తరబడి ఏడ్చాను

ప్రియాంకారెడ్డి ఘటనతో షాక్ గురయ్యాను. గంటల తరబడి ఏడ్చాను. నా కూతురుకు ఈ దారుణ ఘటనను వివరించి జాగ్రత్తలు తీసుకొమని చెప్పాను. కనీసం కొంతైనా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ చర్చలో పాల్గోవడానికి నేను ఎంతో దూరం వచ్చాను. ఇలాంటి దారుణాలు జరిగిన తర్వాతనే అందరూ స్పందిస్తున్నారు. ఇలాంటివి తగదు అని నటి హేమ పేర్కొన్నారు.

నిఘా వ్యవస్థ వైఫల్యం

నిఘా వ్యవస్థ వైఫల్యం

పౌరుల రక్షణ కోసం ప్రధాన కూడళ్లలో సీసీటీవీలు అమర్చారు. కానీ ప్రతీ రోజు వాటి ద్వారా నిఘా పెట్టడం లేదు. ప్రియాంకారెడ్డి దారుణాలు జరిగిన తర్వాతనే సీసీటీవీలను చూస్తున్నారు. ప్రమాదాలు జరగకముందు సీసీటీవీలను చూస్తూ పోలీసులు ఇలాంటి ఘోరాలను నివారించాలి. ఆడపిల్ల బయటకు వెళ్తే రక్షణ కల్పించే ప్రభుత్వం కావాలి. చట్టాలను మరింత కఠినం చేయాలి అని నటి హేమ సూచించారు.

24 గంటల్లో పట్టుకొంటే ఏంటీ?

24 గంటల్లో పట్టుకొంటే ఏంటీ?

కంట్రోల్ రూమ్‌లో నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలి. అంతేకాని ప్రియాంకారెడ్డి లాంటి ఘటనలు జరిగిన తర్వాత 24 గంటల్లో పట్టుకోవడం జరిగిందని చెప్పుకొంటారు. నిందితులను పట్టుకొన్నామని చెప్పడం కంటే నేరాలు జరగకుండా నివారించాలి. అప్పుడే పోలీసు వ్యవస్థ మీద, ప్రభుత్వాల మీద నమ్మకం కలుగుతుంది అని హేమ ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Priyanka Reddy murder: Actress Hema reacted Priyanka Reddy murder in Hyderabad. Actress Hema questions the government and police system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X