హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆడపిల్లంటే చిన్నచూపు: జయసుధ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆడపిల్లని చిన్నచూపు చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ అన్నారు. శనివారం గొల్కోండ హోటల్‌లో రాజశ్రీ చారిటబుల్‌ ట్రస్ట్‌ రూపొందించిన ‘సేవింగ్‌ గర్ల్‌ చైల్డ్‌' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువుకున్న కుటుంబాల్లో కూడా ఆడపిల్ల పుట్టిందంటే చులకనభావం ఉందన్నారు.

స్వచ్ఛభారత్‌ వంటి కార్యక్రమంలో పాల్గొంటున్న సెలబ్రిటీలు సమాజంలో ఉన్న ఆడపిల్లల వివక్ష, మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా ముందుకు రావాలన్నారు. ఆడపిల్లల అమ్మకాలు ఉన్న నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతాల్లో ఆడ శిశువులను సంరక్షించడానికి ముందుకు వచ్చిన రాజశ్రీ చారిటబుల్‌ ట్రస్ట్‌కు అభినందనలు తెలిపారు.

ఆడపిల్లంటే చిన్నచూపు: జయసుధ

ఆడపిల్లంటే చిన్నచూపు: జయసుధ

శనివారం గొల్కోండ హోటల్‌లో రాజశ్రీ చారిటబుల్‌ ట్రస్ట్‌ రూపొందించిన ‘సేవింగ్‌ గర్ల్‌ చైల్డ్‌' వెబ్‌సైట్‌ను ప్రారంభించడానికి వచ్చిన సినీ నటి జయసుధ.

ఆడపిల్లంటే చిన్నచూపు: జయసుధ

ఆడపిల్లంటే చిన్నచూపు: జయసుధ

నివారం గొల్కోండ హోటల్‌లో రాజశ్రీ చారిటబుల్‌ ట్రస్ట్‌ రూపొందించిన ‘సేవింగ్‌ గర్ల్‌ చైల్డ్‌' వెబ్‌సైట్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ విద్యావంతుల కుటుంబాల్లో కూడా ఆడపిల్ల పుట్టిందంటే చులకనభావం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆడపిల్లంటే చిన్నచూపు: జయసుధ

ఆడపిల్లంటే చిన్నచూపు: జయసుధ

స్వచ్ఛభారత్‌ వంటి కార్యక్రమంలో పాల్గొంటున్న సెలబ్రిటీలు సమాజంలో ఉన్న ఆడపిల్లల వివక్ష, మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా ముందుకు రావాలన్నారు. ఆడపిల్లల అమ్మకాలు ఉన్న నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతాల్లో ఆడ శిశువులను సంరక్షించడానికి ముందుకు వచ్చిన రాజశ్రీ చారిటబుల్‌ ట్రస్ట్‌కు అభినందనలు తెలిపారు.

 ఆడపిల్లంటే చిన్నచూపు: జయసుధ

ఆడపిల్లంటే చిన్నచూపు: జయసుధ

స్వచ్ఛభారత్‌ వంటి కార్యక్రమంలో పాల్గొంటున్న సెలబ్రిటీలు సమాజంలో ఉన్న ఆడపిల్లల వివక్ష, మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా ముందుకు రావాలన్నారు. ఆడపిల్లల అమ్మకాలు ఉన్న నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతాల్లో ఆడ శిశువులను సంరక్షించడానికి ముందుకు వచ్చిన రాజశ్రీ చారిటబుల్‌ ట్రస్ట్‌కు అభినందనలు తెలిపారు.

ఆడపిల్లంటే చిన్నచూపు: జయసుధ

ఆడపిల్లంటే చిన్నచూపు: జయసుధ

నల్లగొండ జిల్లాలకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతంలోని అనాథ పిల్లలను ఆదరించేందుకు ‘సేవింగ్‌ గర్ల్‌ చైల్డ్‌' వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు రాజశ్రీ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ రాజశ్రీ సజ్జాద్‌ తెలిపారు.

ఆడపిల్లంటే చిన్నచూపు: జయసుధ

ఆడపిల్లంటే చిన్నచూపు: జయసుధ

ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జనరల్‌ మేనేజర్‌ పాండురంగమూర్తి, వెబ్‌సైట్‌ను డిజైన్‌ చేసిన ఇన్వర్స్‌సెలాజిక్స్‌ ప్రతినిధి దినేష్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ అమరపాలి మాట్లాడుతూ బాల్యవివాహాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి నిలుపుదల చేయాల్సిన బాధ్యత అంగన్‌వాడీ కార్యకర్తలపై ఉందన్నారు. సమాజంలో చైతన్యం వచ్చినప్పుడే ఆడశిశువుల పురిటి హత్యలు తగ్గుతాయన్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ జాయింట్‌ డైరక్టర్‌ శ్యాంసుందరి మాట్లాడుతూ ఆడశిశువులను కడతేర్చకుండా శిశువిహార్‌లకు అప్పగించాలని కోరారు.

నల్లగొండ జిల్లాలకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతంలోని అనాథ పిల్లలను ఆదరించేందుకు ‘సేవింగ్‌ గర్ల్‌ చైల్డ్‌' వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు రాజశ్రీ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ రాజశ్రీ సజ్జాద్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జనరల్‌ మేనేజర్‌ పాండురంగమూర్తి, వెబ్‌సైట్‌ను డిజైన్‌ చేసిన ఇన్వర్స్‌సెలాజిక్స్‌ ప్రతినిధి దినేష్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

English summary

 Saving a girl child website launched by Actress Jayasudha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X