వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లంచం కోసం నరకం చూపిన అడిషనల్ కలెక్టర్ నగేష్ ... ఏసీబీ రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు

|
Google Oneindia TeluguNews

112 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇచ్చే విషయంలో లంచం డిమాండ్ చేసి, బాధితులను వేధింపులకు గురి చేసిన మెదక్ అడిషనల్ కలెక్టర్ గా పనిచేసిన నగేష్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీబీ అధికారులు నగేష్ తో పాటు మరో నలుగురు నిందితులపై న్యాయస్థానానికి రిమాండ్ రిపోర్ట్ ను సమర్పించారు. ఈ రిమాండ్ రిపోర్ట్ లో పలు షాకింగ్ విషయాలను ప్రస్తావించారు.

కోటి 40 లక్షల రూపాయల లంచం కేసు ... మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ పై వేటు ..మరో ముగ్గురిపై కూడా !!కోటి 40 లక్షల రూపాయల లంచం కేసు ... మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ పై వేటు ..మరో ముగ్గురిపై కూడా !!

కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో అడిషనల్ కలెక్టర్ నగేష్ వేధింపుల పర్వం

కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో అడిషనల్ కలెక్టర్ నగేష్ వేధింపుల పర్వం

ఈ రిమాండ్ రిపోర్టులో మెదక్ అడిషనల్ కలెక్టర్ గా పనిచేసిన నగేష్ బాధితులను ఎంతగా వేధింపులకు గురి చేశారో ఏసీబీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచం వేధింపుల కేసులో రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న అంశాలను చూస్తే.. చందానగర్ కు చెందిన కన్నెబోయిన లింగమూర్తి అనే వైద్యుడు మరో నలుగురితో కలిసి మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమి కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఎన్ ఓ సి అవసరం ఉంది . దీంతో నర్సాపూర్ తహసీల్దార్ సత్తార్ కు ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకున్నారు.అక్కడ నుండే వారికి తిప్పలు మొదలయ్యాయి .

 అడుగడుగునా లంచం కోసం బాధితులను ఇబ్బంది పెట్టిన నగేష్

అడుగడుగునా లంచం కోసం బాధితులను ఇబ్బంది పెట్టిన నగేష్

ఎన్వోసీ కోసం చేసిన దరఖాస్తు ఆర్డిఓ అరుణారెడ్డికి అక్కడి నుండి అప్పట్లో మెదక్ కలెక్టర్ గా ఉన్న ధర్మారెడ్డి వద్దకు చేరింది. చివరకు ఎన్వోసీ ఇచ్చే బాధ్యత అడిషనల్ కలెక్టర్ నగేష్ వద్ద ఆగింది.లింగమూర్తి, అడిషనల్ కలెక్టర్ నగేష్ ను కలిసి ఎన్వోసీ కావాలని అడగగా నగేష్ ఎన్వోసీ ఇవ్వడానికి కలెక్టర్ కు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేసేది లేక ఒప్పుకున్న డాక్టర్ లింగమూర్తి మొదటి విడతగా జూలై 31 వ తేదీన నగేష్ ను ఇంట్లో కలిసి 19.50 లక్షల రూపాయలు అందించారు. ఆ తర్వాత ఈ వ్యవహారం చూస్తున్న కిందిస్థాయి అధికారులకు కూడా లంచం ఇవ్వాల్సిందిగా అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు.

నగదు మాత్రమే కాదు 8 చెక్కులు కూడా .. 3

నగదు మాత్రమే కాదు 8 చెక్కులు కూడా .. 3

నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో సర్వేయర్ గా పనిచేస్తున్న వసీం కు నాలుగు లక్షలు, అతని సూచన మేరకు మరో లక్ష గూగుల్ పే ద్వారా రాజీవ్ గౌడ్ కు బదిలీ చేశారు లింగమూర్తి. ఆ తర్వాత మరో మారు రెండో దఫాగా ఆగస్టు 7వ తేదీన 20.50 లక్షలు చెల్లించారు . దీంతో అడిషనల్ కలెక్టర్ నగేష్ కు 40 లక్షల రూపాయలు ముట్టినట్లు అయింది. ఇక కరోనా కారణంగా ఒప్పందంలో భాగంగా ఇవ్వవలసిన మిగతా 72 లక్షల రూపాయల నగదు సమకూర్చటం కష్టంగా ఉందని లింగమూర్తి తన ఇబ్బందిని అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో నగేష్ ఆయన నుండి 8 చెక్కులను తీసుకొని కలెక్టర్ జారీచేసిన ఎన్వోసీ ధ్రువపత్రాన్ని ఆగస్టు 31వ తేదీన లింగమూర్తి కి అందజేశారు.

లంచం పూర్తిగా అందలేదని వేధింపులు .. 10 ఎకరాల ల్యాండ్ ఇవ్వాలని డిమాండ్

లంచం పూర్తిగా అందలేదని వేధింపులు .. 10 ఎకరాల ల్యాండ్ ఇవ్వాలని డిమాండ్

లంచం పూర్తిగా అందకపోవడంతో పదేపదే వేధింపులకు గురిచేశారు నగేష్. లంచం సొమ్ము అందకపోవడంతో సర్వేతో పాటు, రికార్డులను సరి చేసే పని ఆపేసి నగేష్ పదేపదే ఫోన్ చేసి డబ్బు కావాలని వేధింపులకు దిగారు. డబ్బు దొరకడం లేదని చెప్పిన లింగమూర్తిని, వారు కొంటున్న స్థలంలో పది ఎకరాలు తాను చెప్పిన వారి పేరు మీద రాయమని ఒత్తిడి తెచ్చారు. అడిషనల్ కలెక్టర్ నగేష్ ను లింగమూర్తి తోపాటు కొనుగోలుదారులు బ్రతిమిలాడగా ఐదు ఎకరాల భూమి ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. తన బినామీ జీవన్ గౌడ్ పేరిట ఒప్పందం సిద్ధం చేయమని చెప్పాడు నగేష్.

Recommended Video

Pubs, Bars, Clubs And Restaurants Can Sell Liquor, Conditions Applied
వేధింపులు భరించలేకే ఏసీబీని కలిసిన బాధితులు .. అవినీతి తిమింగలాన్ని పట్టుకున్న ఏసీబీ

వేధింపులు భరించలేకే ఏసీబీని కలిసిన బాధితులు .. అవినీతి తిమింగలాన్ని పట్టుకున్న ఏసీబీ

నగేష్ వేధింపులు భరించలేని లింగమూర్తి అన్ని ఆధారాలను జాగ్రత్తగా భద్రపరిచారు. ఫోన్ రికార్డింగ్స్, ఆయనకు ఇచ్చిన చెక్కులు, ఎకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేసిన నగదు తదితర అన్ని వివరాలను తీసుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించి లబోదిబో మన్నారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి కోట్లకు పడగలెత్తిన అవినీతి తిమింగలాన్ని అడ్డంగా బుక్ చేశారు.
ఏసీబీ అధికారులకు చిక్కిన తర్వాత తనకు ఏ పాపం తెలీదని అడ్డంగా బుకాయించిన నగేష్ , ఏసీబీ అధికారులు ఆధారాలు చూపించి ప్రశ్నించటంతో ఖంగు తిన్నాడు . తాజాగా నగేష్ తో పాటు అడ్డంగా దొరికిన అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది .

English summary
It is learned that the bribery case , who was the Additional Collector of Medak Nagesh, demanded a bribe and harassed the victims in connection with the issuance of an NOC for 112 acres of land, has sparked outrage across the state. ACB officials have filed a remand report against Nagesh and four other accused in the case. Several shocking things were mentioned in this remand report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X