వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇష్టం లేకపోతే బదిలీ చేయండి, ఎంపీ నగేష్‌పై ఆదిలాబాద్ ఎస్పీ విసుర్లు

ఇష్టం లేకపోతే బదిలీ చేయించాలని ఆదిలాబాద్ ఎస్పీ శ్రీనివాస్ ఆదిలాబాద్ ఎంపీ నగేష్‌పై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.ఎంపీ నగేష్ ఇంట్లో చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్, బంగారు ఆభరణాలు స్వాధీనంపోలీసులపై ఎంపీ అనవ

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను రూ. 70వేల నగదును రికవరీ చేశారు.దొంగతనంపై ఆదిలాబాద్ ఎంపీ నగేష్ పోలీసులపై విమర్శలు చేయడంపై ఎస్‌పీ శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. ఇష్టం లేకపోతే బదిలీ చేయించాలని ఎంపీని కోరారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 27వ, తేదిన ఎంపీ నగేష్ ఇంట్లో దొంగలు పడ్డారు. తన ఇంట్లో నుంచి రూ. 17 లక్షల విలువైన బంగారం, రూ. 2.50 లక్షల విలువైన వెండి, రూ. 70వేల నగదు అపహరణకు గురైనట్టు ఎంపీ నగేశ్‌ ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన సొత్తులో సగమే దొంగ నుంచి పోలీసులు రీకవరి చేయగలిగారు.

Adilabad Sp Srinivas sensational comments on Mp Nagesh

తాజా రీకవరీ నేపథ్యంలో ఎంపీ నగేశ్‌పై జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎంపీ ఇంట్లో దొంగతనం జరిగితే.. దానికి తమపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. పోలీసులపై ఎంపీ నగేశ్‌ వ్యాఖ్యలు విచారకరమన్నారు.

ఎంపీకి ఇష్టం లేకపోతే తనను బదిలీ చేయించాలని ఎస్పీ శ్రీనివాస్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ దొంగతనం నేపథ్యంలో పోలీసులపై ఎంపీ నగేశ్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.

గొడం నగేశ్‌ ఇంట్లో గత నెల చివరివారంలో భారీ చోరీ జరిగింది. ఆదిలాబాద్‌ హౌజింగ్‌బోర్డు కాలనీలో ఎంపీ నగేశ్‌ నివసిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు అర్ధరాత్రి ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.

ఇంట్లోకి చొరబడిన దుండగులు అల్మారాలోని వస్తువులు చిందర వందరగా పడేసి, రూ.17 లక్షల విలువ చేసే బంగారం ఆభరణాలు, రూ.70 వేల నగదును ఎత్తుకెళ్లారు. కాగా, దొంగలు ఎంపీ ఇంట్లోని సీసీ కెమెరాలు ధ్వంసం చేసి సీసీ పుటేజ్‌ హార్డ్‌డిస్క్‌ను ఎత్తుకెళ్లారు. దీంతో పోలీసులకు సైతం ఎలాంటి ఆధారం లేకుండా పోయింది.

English summary
Adilabad Sp Srinivas sensational comments on Adilabad Mp Nagesh on Monday . Adilabad police recovered stolen ornaments from Mp Nagesh's house on monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X