వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగరేణి సిగలో సాంకేతిక ముద్ర: ఇతర కంపెనీలను ఆకర్షిస్తున్న 'లాంగ్ వాల్'

|
Google Oneindia TeluguNews

కరీంనగర్: తక్కువ ఖర్చుతో బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా సింగరేణి సంస్థ ప్రవేశపెట్టిన అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టు (ఏఎల్‌పీ) విజయవంతమైంది. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా సింగరేణి అద్భుత ఫలితాలు సాధించడంతో కోల్‌ ఇండియా పరిధిలోని పది కంపెనీల ప్రతినిధులు ఏఎల్‌పీని సందర్శించి ఈ విధానాన్ని తమ కంపెనీల్లో ప్రవేశపెట్టేందుకు అధ్యయనం చేస్తున్నారు.

బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవడానికి అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టు (ఏఎల్‌పీ)ను సింగరేణి ప్రారంభించింది. సంస్థ పరిధిలో భూగర్భ గనులు, ఉపరితల గనుల్లో గరిష్ఠంగా 300 మీటర్ల వరకే బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో అంతకన్నా ఎక్కువ లోతులో ఉన్న బొగ్గును వెలికి తీసేందుకు రూ.1219 కోట్లతో ఏఎల్‌పీని ప్రారంభించింది.

సెంటినరీ కాలనీ సమీపంలోని 652.16 హెక్టార్ల పరిధిలోని జీడీకే 10, 10ఏ గనుల్లో కనిష్ఠంగా 294 నుంచి గరిష్ఠంగా 644 మీటర్ల లోతులోని బొగ్గును వెలికితీసేందుకు దీనిని వినియోగిస్తున్నారు. 2014 అక్టోబరు 10న ఏఎల్‌పీ బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది. ఏఎల్‌పీ ఏడాది బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 2.80 మిలియన్‌ టన్నులు.

singareni

2015 మార్చి నాటికి ఆరు లక్షల టన్నులు, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 17.5 లక్షల టన్నులు, ఈ ఏడాది ఇప్పటి వరకు 10.50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించింది. సాధారణంగా లాంగ్‌వాల్‌ ప్రాజెక్టులు ప్రారంభించిన నాలుగేళ్లకు లక్ష్యాన్ని చేరుకుంటాయి. కానీ ప్రారంభించిన మూడేళ్లలోపే ఏఎల్‌పీ ఆ లక్ష్యం దిశగా పయనిస్తోంది.

2015-16 ఆర్థిక సంవత్సరంలో ఏఎల్‌పీ రూ.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. భూగర్భ గనిలో ఒక్కో కార్మికుడు సగటు రోజుకు 1.5 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా ఏఎల్‌పీ గనిలో 4.5 టన్నులుగా ఉంది. అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు.

ప్రస్తుతం ఏఎల్‌పీ గనిలో 60 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. వీటిని 35 ఏళ్లలో పూర్తిగా వెలికితీయాలి. భారీ ఉత్పత్తి లక్ష్యం కావడంతో లాంగ్‌వాల్‌ యంత్రాలను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. యంత్రాల దగ్గర నుంచి నేరుగా రవాణా ప్రదేశానికి బెల్టు ద్వారానే బొగ్గు సరఫరా అవుతుంది. ఇందుకు చైనా నుంచి తొమ్మిది కిలోమీటర్ల పొడవైన కన్వేయర్‌ బెల్టును తెప్పించారు.

వెలికితీత ఇలా...:

సాధారణంగా భూగర్భ గని అంటే ఉపరితల నుంచి ఏటవాలుగా తవ్వుకుంటూ బొగ్గు పొర ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు. కానీ అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టు (పంచ్‌ఎంట్రీ) గని భిన్నంగా ఉంటుంది. ఉపరితల గని ద్వారా బొగ్గును వెలికి తీసిన ప్రాంతంలోని బొగ్గు పొరలను నేరుగా తొలిచి లోపలికి ప్రవేశించే విధానం కేవలం ఈ ఒక్కగనిలోనే ఉంది.

ఆసియా ఖండంలోనే పంచ్‌ఎంట్రీ విధానంతో బొగ్గు గనిని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఇందులో ఒక ద్వారం నుంచి కార్మికులు, మరో ద్వారం నుంచి యంత్రాలు, వేరే ద్వారం నుంచి కన్వేయర్‌ బెల్టు, ఇతర సరుకులు రవాణా చేయడానికి మరో మార్గాన్ని వినియోగిస్తారు.

250 మీటర్ల లోతులో ఉన్న బొగ్గు పొరలను వెలికి తీసేందుకు మానవశక్తి ద్వారా సాధ్యం కాకపోవడంతో లాంగ్‌వాల్‌ విధానంతో ఉత్పత్తికి ప్రణాళికలు చేశారు. విజయవంతంగా ఇప్పటికే ఒక బొగ్గు పొర మొత్తాన్ని తొలిచిన లాంగ్‌వాల్‌ యంత్రాన్ని ఈ నెల మొదటి వారంలో మరో బొగ్గు పొరకు అనుసంధానించనున్నారు.

English summary
Adriyala project success in Singareni.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X