వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిండినీళ్లలో మత్తు కలిపి కల్లు తయారీ..! సుర ప్రియులారా.. జర భద్రం..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : లాక్ డౌన్ సందర్బంగా దేశం మొత్తం షడ్ డౌన్ అయ్యింది. ఎంతో మందికి ఇష్టమైన మద్యపానం మీద కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. మద్యం అందుబాటులో లేక చాలా మంది మందుబాబులు స్వీయ నియంత్రణ కోల్పోయిన మానసిక రోగులుగా మారిన ఉందాతాలు కూడా వెలుగులోకి వచ్చాయి. మద్యపానం దొరకకపోడంతో మద్యపాన ప్రియులు కల్లును సేవిస్తున్నట్టు తెలుస్తోంది. కల్లు వ్యాపారలు ఇదే అదునుగా కల్తీ కల్లును తయారు చేస్తూ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టు తెలుస్తోంది.

అక్రమ దందాలకు అడ్డులేకుండా పోతోంది. ప్రజల బలహీనతే లక్ష్యంగా కల్తీకి పాల్పడుతున్న కేటుగాళ్లు..

అక్రమ దందాలకు అడ్డులేకుండా పోతోంది. ప్రజల బలహీనతే లక్ష్యంగా కల్తీకి పాల్పడుతున్న కేటుగాళ్లు..

రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంబించిపోవడంతో సుదూర ప్రాంతాలనుండి రావాల్సి కల్లు రవాణాను రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. దీంతో మద్యం దొరక్క, కల్లు దొరక్క సుర ప్రియులు బ్లాక్ మార్కెట్ ను ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఐతే వ్యాపారులు ఇదే అదనుగా అక్రమ వ్యాపారానికి తెర లేపినట్టు తెలుస్తోంది. సహజసిద్దంగా చెట్ల ద్వారా లభించే కల్లును కల్తీ చేస్తూ అక్రమ దందాకు పాల్పడుతున్నారు కొంత మంది కేటుగాళ్లు. అలా కల్తీ చేసిన కల్లును అక్రమంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కొంత మంది మద్యం వ్యాపారులు.

కఠినంగా అమలవుతున్న లాక్ డౌన్ ఆంక్షలు.. మద్యం అందుబాటు లేక పిచ్చెక్కిపోతున్న మందుబాబులు..

కఠినంగా అమలవుతున్న లాక్ డౌన్ ఆంక్షలు.. మద్యం అందుబాటు లేక పిచ్చెక్కిపోతున్న మందుబాబులు..

లాక్ డౌన్ స‌మ‌యంలో లిక్కర్ దొర‌క్క‌పోవ‌డంతో మందుబాబులు క‌ల్లు సేవించడం పై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అయితే ఇదే స‌మయంలో కొంద‌రు ప్ర‌బుద్దులు క‌ల్లు పేరుతో ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్నారు. మదురైలో మత్తు కోసం నిద్ర మాత్రలు కలిపిన పానియాన్ని కల్లు పేరుతో అమ్ముతోన్న‌ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సారా, కల్లు విక్రయాలు ఊపందుకున్నాయి. మదురై కరుప్పాయి ఊరని వీరవంజన్‌ ఓడైపట్టి ఏరియాలో కల్లు విక్రయిస్తున్నట్టు కరుక్కూరని పోలీసులకు సమాచారం అందింది.

జోరుగా కల్తీ కల్లు.. ఏదో ఒకటి అనుకుంటున్న తాగుబోతులు..

జోరుగా కల్తీ కల్లు.. ఏదో ఒకటి అనుకుంటున్న తాగుబోతులు..

వెంటనే స్పందించి అక్క‌డికి వెళ్లిన‌ పోలీసు అధికారులు గోమతిపురంలో రామ్‌కుమార్, శేఖర్, మణికంఠన్, ఈశ్వరన్‌ను అరెస్ట్ చేసి స్టేష‌న్ కు త‌ర‌లించారు.
విచారణలో పులిసిపోయిన గంజి నీళ్లలో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపి కల్లు తయారు చేసి అమ్ముతున్న‌ట్లు తేలింది. వారి వ‌ద్ద నుంచి నిద్ర మాత్రలు కలిపిన సుమారు 150 లీటర్ల నకిలీ కల్లును స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఘగటనలు తమిళ‌నాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా కల్తీ క‌ల్లు విక్ర‌యాలు జోరందుకున్నాయి. కాక‌పోతే కొన్ని చోట్లు పిండినీళ్లలో మ‌త్తు ప‌దార్థాలు క‌లిపి క‌ళ్లు పేరుతో అమ్ముతున్నట్టు నిర్ధారణ జరిగింది.

కల్తీ మద్యాన్ని అరికట్టాలి.. ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగాలంటున్న పేద ప్రజలు..

కల్తీ మద్యాన్ని అరికట్టాలి.. ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగాలంటున్న పేద ప్రజలు..

ఏ రూపంలో ఉన్నా కల్తీ మద్యం కల్తీ మద్యమే. పగలంతా కాయ కష్టం చేసే నిరుపేదలు రెండు పెగ్గులు సేవించడం ద్వారానే సేద తీరుతారు. కాని లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో మద్యం ఎక్కడా దొరకకపోవడంతో కల్లును ఆశ్రయిస్తున్నారు మద్యం ప్రియులు. కల్లు ఎక్కడ నుంచి వచ్చింది. అందులో ఎలాంటి విషపదార్థాలు కలిపారు, తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే కనీస పరిజ్ఞానం లేకుండా వ్యాపారులు అమ్మే కల్లును సేవిస్తూ ప్రాణాలమీదకు తెచ్చకుంటున్నారు కొంత మంది అమాయకులు. లాక్ డౌన్ సమయంలో లాభాపేక్షతో ఆలోచిస్తున్న కొంత మంది వ్యాపారులు నిరుపేదల ప్రాణాలగురించి ఏ మాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆక్సైజ్ అధికారులు ఇలాంటి దందాలకు పాల్పడుతున్న వారిపట్ల మరింత కఠినంగా వ్యవహరించాలనే డిమాండ్ వినిపిస్తోంది.

English summary
Alcohol enthusiasts seem to be serving tady because they cannot find alcohol. Tady businesses seem to be making the most of the adulterated tady of the poor people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X