వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్యాపింగ్: బాబుకు వికీలీక్స్ ఎఫెక్ట్, కెసిఆర్ భయపడ్తున్నారా(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హ్యాకింగ్ కుట్రకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన సమగ్ర విచారణ జరిపించాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ న్యాయవాద జేఎసీ నేతలు శనివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా న్యాయవాద జేఎసీ కన్వీనర్ కొంతం గోవర్దన్ రెడ్డి మాట్లాడారు. ట్యాపింగ్ జరిపేందుకు టెక్నాలజీ కావాలని ఏపీ పోలీసులు సింగపూర్‌కు చెందిన ఒక హ్యాకింగ్ నిపుణుల బృందాన్ని సంప్రదించారని చెప్పారు.

తెలంగాణ నేతల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ జరిపేందుకు చేసిన కుట్ర వికీలీక్స్ కథనం ద్వారా బయపడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో చంద్రబాబుపై సమగ్ర విచారణ జరిపించాలని సూచించారు.

అడ్వోకేట్ జెఎసి

అడ్వోకేట్ జెఎసి

తెలంగాణకు చెందిన 25 నుంచి 50 మంది ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ జరిపేందుకు చేసిన కుట్ర విషయంలో సమగ్ర దర్యాఫ్తు జరపాలని కోరారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జరిపిన కుట్రలో ఇది భాగమని, బాబుపై సమగ్ర విచారణ జరపాలన్నారు.

లోక్‌సత్తా

లోక్‌సత్తా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించి దొరికిపోయిన చంద్రబాబు పైన చర్యలు తీసుకునేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని కెసిఆర్ క్యాంపు కార్యాలయం వద్ద లోక్‌సత్తా శనివారం ధర్నా చేసింది.

లోక్‌సత్తా

లోక్‌సత్తా

చర్యలు తీసుకోవడంలో వెనుకాడటం పైన ఏమైనా లోపాయికారీ ఒప్పందం కుదిరిందా లేక మరో కారణంతోనైనా భయపడుతున్నారా అని ప్రశ్నించారు.

 లోక్‌సత్తా

లోక్‌సత్తా

ఈ సందర్భంగా లోక్ సత్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోల్కర్ రెడ్డి మాట్లాడారు. ఫోన్ సంభాషణలో ఉంది తన గొంతు కాదని ఇప్పటికీ చంద్రబాబు చెప్పలేదన్నారు.

లోక్‌సత్తా

లోక్‌సత్తా

అలాంటప్పుడు ఆయన పైన కేసు ఎందుకు నమోదు చేయలేదని లోక్ సత్తా ప్రశ్నించింది. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.

English summary
ADVOCATE JAC COMPLAINT ON CHANDRABABU AT BANJARA HILLs PS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X