హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయం కాదు, సమాధానం చెప్పు: రేవంత్ రెడ్డిపై పిటిషన్ వేసిన అడ్వోకేట్ ఏమన్నాడంటే?

|
Google Oneindia TeluguNews

Recommended Video

రేవంత్ రెడ్డి పై రాత్రంతా విచారణ, కీలక సమాచారం

హైదరాబాద్: తాను ఫిర్యాదు చేసిన దాని కంటే పెద్ద మొత్తంలో రేవంత్ రెడ్డి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని లాయర్ రామారావు అన్నారు. కాంగ్రెస్ నేత, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ పైన రామారావు ఫిర్యాదు మేరకు సోదాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. దీనిపై సదరు లాయర్ మీడియాతో మాట్లాడారు.

ఐటీ, ఈడీ అధికారుల సోదాల్లో రేవంత్ రెడ్డికి చెందిన భారీ అక్రమాస్తులు వెలుగు చూస్తున్నాయని చెప్పారు. సాయి మౌర్య సంస్థలో షేర్లు తీసుకున్నట్లు రేవంత్ చెప్పారని అన్నారు. రేవంత్ ఇంట్లో సోదాలు మాత్రమే జరిగాయన్నారు. ఢిల్లీ నుంచి స్పెషల్ టీమ్ వచ్చిందని చెప్పారు. అధికారుల సోదాల్లో అనేక అక్రమాలు బయటపడుతున్నాయన్నారు.

రేవంత్ చుట్టు బిగుస్తోన్న ఉచ్చు: తెరపైకి ఓటుకు నోటు, అరెస్ట్‌కు రంగం? రంగంలోకి డీఆర్ఐరేవంత్ చుట్టు బిగుస్తోన్న ఉచ్చు: తెరపైకి ఓటుకు నోటు, అరెస్ట్‌కు రంగం? రంగంలోకి డీఆర్ఐ

రేవంత్ ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు

రేవంత్ ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు

రేవంత్ రెడ్డి ట్యాక్స్‌లను ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు చేశారని లాయర్ రామారావు తెలిపారు. జూబ్లీహిల్స్ సొసైటీలో రేవంత్ అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఐటీ దాడులను రాజకీయ కక్షగా చెప్పడం కాకుండా అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే బాగుంటుందని అన్నారు.

నోటీసులకు సమాధానం చెప్పకుండా

నోటీసులకు సమాధానం చెప్పకుండా

పోలీసులు అడుగుతున్న వాటికి సమాధానం చెప్పకుండా రాజకీయ కుట్ర అనడం సరికాదని లాయర్ రామారావు అన్నారు. తాను రెండు నెలలు ఇన్వెస్టిగేషన్ చేసి కేసు వేశానని చెప్పారు. అక్రమాస్తులు కూడబెట్టిన రేవంత్ రెడ్డికి మద్దతు తెలపడం ఏమాత్రం సరికాదన్నారు. సాయి మౌర్య కంపెనీ ద్వారా అక్రమాలు జరిగాయన్నారు. నోటీసులకు సమాధానం చెప్పకుండా రాజకీయ కుట్ర అనవద్దన్నారు.

 ఉప్పల్‌లో భూదందా, నేను చెప్పింది గోరంతే

ఉప్పల్‌లో భూదందా, నేను చెప్పింది గోరంతే


ఉప్పల్‌లో భూదందా కూడా బయటపడిందని లాయర్ రామారావు చెప్పారు. ఎన్నికల అఫిడవిట్‌ను పరిశీలిస్తే అక్రమాలు బయటపడతాయని చెప్పారు. 19 డొల్ల కంపెనీలు, రూ.400 కోట్ల అక్రమార్జనపై ఫిర్యాదు చేశానని అన్నారు. తాను చెప్పింది గోరంత అని, బయటపడుతోంది మాత్రం కొండంత అన్నారు.

 నా ఫిర్యాదుతో ఈడీ సోదాలు

నా ఫిర్యాదుతో ఈడీ సోదాలు


తాను ఇచ్చిన ఫిర్యాదుతోనే రేవంత్ రెడ్డి ఇంటిపై ఈడీ సోదాలు నిర్వహిస్తోందని లాయర్ రామారావు చెప్పారు. 19 సంస్థలే అనుకుంటే, మరికొన్ని డొల్ల కంపెనీలు ఈ సోదాల్లో వెలుగు చూశాయన్నారు. సాయి మౌర్య రియల్ ఎస్టేట్ సంస్థలో రేవంత్ కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పారు. సోదాలకు పదిహేను రోజుల ముందే ఐటీ నుంచి రేవంత్‌కు నోటీసులు వెళ్లాయని చెప్పారు.

రేవంత్ పై నాకు వ్యక్తిగత వైరం లేదు

రేవంత్ పై నాకు వ్యక్తిగత వైరం లేదు


రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని అడ్వోకేట్ రామారావు చెప్పారు. అలాగే తనకు ఏ రాజకీయ పార్టీతోను సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఈటీ, ఐటీ పారదర్శక విచారణ చేస్తాయని తాను అనుకుంటున్నానని చెప్పారు. చిన్నప్పటి నుంచి తనకు స్టీఫెన్‌సన్‌తో పరిచయం ఉందని చెప్పారు.రేవంత్ రెడ్డి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని సీబీఐకి గతంలోనే ఫిర్యాదు చేశానని చెప్పారు. ఆయనకు పెద్దలు సపోర్ట్ చేయడం సరికాదని చెప్పారు. ప్రచారం పేరిట తప్పించుకోవాలని రేవంత్ చూస్తున్నారని అన్నారు. ఉప్పల్ భూస్కాంలో స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టాడన్నారు.

English summary
Advocate Ramarao press meet, who files money laundering case against Revanth Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X