వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంటపొలాల్లో పడిన విమానం, గాలిల్లో చక్కర్లు కొట్టి క్రాష్ ల్యాండ్, ఇద్దరు పైలట్ల మృతి..

|
Google Oneindia TeluguNews

వికారాబాద్‌లో జిల్లాలో ఓ విమానం క్రాష్ ల్యాండయ్యింది. బట్వార మండలం సుల్తాన్‌పూర్ సమీపంలో గల పంటపొలాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్, ట్రైనీ పైలట్ ఇద్దరు మృతిచెందారు. పైలట్ ప్రకాశ్ విశాల్ అని గుర్తించారు. ట్రైని పైలట్ వివరాలు తెలియాల్సి ఉంది. బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరిన తర్వాత 45 నిమిషాలకు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయని అధికారులు చెప్తున్నారు. గాలిలో చక్కర్లు కొట్టి కుప్పకూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.

విమానం టేకాఫ్ అయ్యే సమయంలో వాతావరణ పరిస్థితి బాగానే ఉంది. ఆ తర్వాత భారీ వర్షం, ఉరుమెలు, మెరుపులు రావడంతో వాతావరణ ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో విమానంలో గాలిలోనే చక్కర్లు కొట్టిందని స్థానికులు చెప్తున్నారు. అలా పది నిమిషాలు చక్కర్లు కొట్టి కుప్పకూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

aeroplene crash land at paddy field, two dead

విమానం ప్రమాదం తెలియగానే బేగంపేట ఎయిర్‌పోర్ట్ అధికారులు ఘటనాస్థలికి చేరుకొన్నారు. అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణంపై అన్వేషిస్తున్నారు. మరోవైపు మృతిచెందిన పైలట్ ప్రకాశ్ విశాల్ అధికారులు తెలిపారు. ట్రైనీ పైలట్ మహిళ అని తెలుస్తోంది. కానీ ఆమె వివరాలు తెలియాల్సి ఉంది. విమాన ప్రమాదం తర్వాత బురదలో కురుకున్నట్టు తెలుస్తోంది. వాతావరణ పరిస్థితుల సరిగా లేనందున ప్రమాదం జరిగిందని ఎయిర్‌ఫోర్స్ అధికారులు అంచనా వేశారు. దీనిపై శాఖపరంగా విచారిస్తున్నామని తెలిపారు.

English summary
aeroplene crash land in paddy field in vikarabad districkt. pilot prakash vishal, trainy pilots are dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X