హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఎస్ఎఫ్ఐపై ఏబీవీపీ ఘన విజయం, అధ్యక్షురాలిగా ఆర్తి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎనిమిదేళ్ల తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూవోహెచ్)లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విజయ దుందుభి మోగించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవితో పాటు మొత్తం ఆరు స్థానాల్లో బీజేపీ గెలిచింది. 2009 - 2010లో చివరిసారి ఏబీవీపీ గెలిచింది.

ఆ తర్వాత ఇప్పుడు పీహెచ్‌డీ స్కాలర్ ఆర్తి ఎన్ నాగపాల్ అధ్యక్షురాలిగా గెలుపొందారు. అక్టోబర్ 5వ తేదీన ఎన్నికలు జరిగాయి. 75 శాతం మంది ఓట్లేశారు. శుక్రవారం పోలింగ్‌ జరగ్గా శనివారం రాత్రి పొద్దు పోయేవరకు ఓట్ల లెక్కింపు జరిగింది. అధ్యక్షురాలిగా ఎన్నికైన ఆర్తీ నాగ్‌పాల్‌ సమీప ప్రత్యర్థి, ఎస్‌ఎఫ్‌ఐ అభ్యర్థి ఎర్రం నవీన్‌ కుమార్‌పై ఏకంగా 334 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

అదే ఐతే మాకు ఓటు వేయొద్దు, కత్తులు తిప్పుతారా, సంగతి చెప్తా: జానారెడ్డికి కేసీఆర్ వార్నింగ్అదే ఐతే మాకు ఓటు వేయొద్దు, కత్తులు తిప్పుతారా, సంగతి చెప్తా: జానారెడ్డికి కేసీఆర్ వార్నింగ్

After 8 years, ABVP sweeps University of Hyderabad students union polls

ఉపాధ్యక్షుడిగా అమిత్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా ధీరజ్‌, సంయుక్త కార్యదర్శిగా ప్రవీణ్‌ కుమార్‌, సాంస్కృతిక కార్యదర్శిగా అరవింద్‌, క్రీడాకార్యదర్శిగా నిఖిల్‌ గెలుపొందారు. కొన్నేళ్లుగా వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన ఎస్‌ఎఫ్ఐకి ఏబీవీపీ గెలుపు మింగుడుపడని విషయమే.

ఆర్తి ఎన్ నాగ్‌పాల్‌కు 1663 ఓట్లు రాగా, ఎస్ఎఫ్ఐ అభ్యర్థి ఎర్రమ్ నవీన్ కుమార్‌కు1329 ఓట్లు, యూనైటెడ్ డెమోక్రటిక్ అలయెన్స్ అభ్యర్థి శ్రీజ వాస్తవ్‌కు 842 ఓట్లు వచ్చాయి.

ఏబీవీపీ గెలుపుపై ఆ విద్యార్థి సంఘం సహ సంఘటన కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ... విద్యార్థులను కులాల పేరుతో విడగొడుతూ, వామపక్ష తీవ్రవాద భావజాలాన్ని చొప్పించాలని చూస్తున్న వామపక్ష కూటమికి హెచ్‌సీయూ విద్యార్థుల తీర్పు చెంప పెట్టులాంటిదని అన్నారు.

English summary
After an eight year hiatus, Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) on Saturday swept the University of Hyderabad (UoH) students union elections (2018-19) and bagged all top posts, including that of the university president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X