చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌కు భారీ ఎత్తున ఆ కెమికల్ లోడ్... ఇటీవలి బీరట్‌ పేలుళ్లకు కారణమదే...

|
Google Oneindia TeluguNews

లెబనాన్ రాజధాని బీరట్‌లో ఇటీవలి పేలుళ్లు ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురిచేశాయి. బీరట్‌కు 240కి.మీ దూరంలోని సైప్రస్ ద్వీపం వరకూ దాని శబ్దాలు వినిపించాయంటే ప్రమాద తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనలో దాదాపు 149 మంది మృతి చెందగా... 5వేల పైచిలుకు మంది గాయపడ్డారు. ఇంతటి ఘోర ప్రమాదానికి కారణం అమ్మోనియం నైట్రేట్. ఈ ఘటన తర్వాత భారత్‌లోని చాలా నగరాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నై నుంచి హైదరాబాద్‌కి 697 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ని తరలించబోతుండటం చర్చనీయాంశంగా మారింది.

Recommended Video

Lebanon : పేలుడు తో ఎలాంటి సంబంధం లేదన్న Israel | అమ్మోనియం నైట్రేట్ వల్లే నా? || Oneindia Telugu
హైదరాబాద్‌కి కెమికల్ లోడ్...

హైదరాబాద్‌కి కెమికల్ లోడ్...

చెన్నైలోని సరుకు రవాణా కేంద్రంలోని ఓ కంటైనర్‌లో నిల్వ ఉంచిన 697 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ ఈ వేలం ముగిసినట్లుగా అక్కడి అధికారులు తెలిపారు. సరైన భద్రతా నియమాలను పాటిస్తూ త్వరలోనే కార్గో ద్వారా ఆ కెమికల్‌ను హైదరాబాద్ తరలించనున్నట్లు చెప్పారు. అయితే ఇప్పటికే కొన్ని కెమికల్ కంటైనర్స్ హైదరాబాద్ తరలినట్లుగా పోలీసులు వెల్లడించారు.

అప్పట్లో సీజ్ చేసిన పోలీసులు...

అప్పట్లో సీజ్ చేసిన పోలీసులు...

హైదరాబాద్‌కు తరలిస్తున్న ఈ కెమికల్ లోడ్‌ను 2015లో చెన్నై పోలీసులు ఓ ఇంపోర్టర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. పేలుడు స్వభావం ఉన్న ఈ కెమికల్‌ను ఫర్టిలైజర్ గ్రేడ్ అని చెప్పి సదరు ఇంపోర్టర్ అధికారులను బురిడీ కొట్టించినట్లు తెలుస్తోంది. అయితే ఎట్టకేలకు కస్టమ్స్ తనిఖీల్లో అసలు నిజం బయటపడటంతో పోలీసులు ఆ కెమికల్‌ను సీజ్ చేశారు. అతని లైసెన్స్‌ని రద్దు చేశారు. సౌత్ కొరియా నుంచి దిగుమతి అయిన ఈ కెమికల్ అత్యంత ప్రమాదకరం కావడంతో... దీన్ని సురక్షిత పద్దతిలో నిల్వ చేశారు.

ఈవేలం ద్వారా విక్రయం...

ఈవేలం ద్వారా విక్రయం...

నిల్వ చేసిన కెమికల్‌లో 7 టన్నుల వరకూ వర్షం కారణంగా పాడైపోయిందని అధికారులు తెలిపారు. మిగిలిన 690 టన్నులను ఈ వేలం వేసినట్లు చెప్పారు. అయితే ఇంత భారీ మొత్తంలో కెమికల్‌ను హైదరాబాద్‌కి చెందిన ఏ సంస్థ కొనుగోలు చేసిందన్నది తెలియరాలేదు. బీరట్ ఘటన తర్వాత విశాఖపట్నంలో 18,500 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఉన్నట్లు నిర్దారించిన అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు కూడా భారీ ఎత్తున కెమికల్ లోడ్ వెళ్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు.

English summary
Safety concerns over the storage of ammonium nitrate, in the shadow of the explosion of the chemical in Beirut, were addressed as the substance has been e-auctioned and is being shipped to Hyderabad, sources said on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X