హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెటిఆర్ ఎఫెక్ట్: లోకేష్‌ని కేంద్రమంత్రిని చేయాలని బాబుపై ఒత్తిడి! 'తెలంగాణ' కంట్రోల్‌పై డైలమా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి అద్భుత విజయం సాధించి పెట్టారు. ఈ నేపథ్యంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరు తెలుగు తమ్ముళ్లలో చర్చకు వస్తోంది.

గెలుపోటముల విషయాన్ని పక్కన పెడితే... తెలంగాణ సీఎం కెసిఆర్ తనయుడు కెటిఆర్ తన సత్తా చూపించికున్నట్లుగా లోకేష్ కూడా రాజకీయంగా సత్తా చాటాలంటే ఆయనకు ఏదైనా పదవి ఇవ్వాలని టిడిపి జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన ఒత్తిడి పెరుగుతోందని వార్తలు వస్తున్నాయి.

కొందరు టిడిపి నేతలు.. ముఖ్యంగా యువ నాయకులు లోకేష్‌ను రాజ్యసభకు పంపించాలని లేదా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారట. లోకేష్‌కు ఏపీలో ఎమ్మెల్సీ పదవి ఇస్తే, రాజ్యసభకు పంపిస్తే.. వచ్చే లాభ నష్టాల పైన బేరీజు కూడా వేస్తున్నారట.

 after ktr's rise, telugudesam sees lokesh dream

లోకేష్‌కు ఏపీ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెడితే.. తెలంగాణలో తిరిగేందుకు ఆస్కారం పెద్దగా లభించదని, కాబట్టి రాజ్యసభకు పంపించడమే సముచితమని పలువురు నాయకులు సూచిస్తున్నారని తెలుస్తోంది.

రాజ్యసభకు.. ఆ తర్వాత కేంద్రమంత్రిగా అయితే తెలంగాణలోను పార్టీని కాపాడుకోవచ్చునని సూచిస్తున్నారంటున్నారు. లోకేష్‌ను ఏపీకి పరిమితం చేస్తే మాత్రం తెలంగాణలో పార్టీ తమ కంట్రోల్ నుంచి పోతుందని కొందరు చెబుతున్నారని తెలుస్తోంది.

అయితే, దీని పైన చంద్రబాబు స్పందించడం లేదని తెలుస్తోంది. నారా లోకేష్‌కు పదవి ఇస్తే అది తొందరపాటు అవుతుందని ఆయన భావిస్తున్నారా? లేక 2019 దాకా ఆగుదామనుకుంటున్నారా? తెలియాల్సి ఉంది. అయితే, ఆయనను రాజ్యసభకు పంపించడం సరైనదని కొందరు నేతలు గట్టిగా అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది.

English summary
After Telangana CM KCR gave the additional portfolio to Minister KT Rama Rao, Now Telugudesam Party leaders seeing at Nara Lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X