• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రవితేజ అలా ఇరుక్కున్నాడా: ఎన్నో ప్రశ్నలు-మరెన్నో అనుమానాలు, ఏది నిజం!?

|

హైదరాబాద్: శుక్రవారం ఉదయం సిట్ ఎదుట నటుడు రవితేజ హాజరు కానున్నారు. ఆయన తెలుగు టాప్ హీరో. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి కళ్లు ఆయన పైనే ఉన్నాయి. రవితేజకు నిజంగానే డ్రగ్ రాకెట్ గ్యాంగుతో సంబంధాలున్నాయా?

చదవండి: రవితేజ చుట్టు ఉచ్చు?: డ్రగ్ ముఠాతో పరిచయం ఎలా.. విస్తుపోయే అంశాలు?

అవి ఎంత వరకు నిజం? లేదంటే తన సోదరుడు భరత్ వాడిన ఫోన్ వల్ల ఇరుక్కుపోయారా? మరేదైనా కారణం ఉందా? అనే చర్చ సాగుతోంది. మరోవైపు రవితేజను ప్రశ్నించేందుకు సిట్ ప్రశ్నావళి సిద్ధం చేసింది. రవితేజ విషయంలో అందరిలో ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు ఉన్నాయి.

తమ్ముడు భరత్ వల్ల ఇరుక్కుపోయాడా?

తమ్ముడు భరత్ వల్ల ఇరుక్కుపోయాడా?

రవితేజ విషయంలో ఎన్నో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంగా ఆయన తన సోదరుడు భరత్ వల్ల ఇరుక్కుపోయి ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన భరత్ డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. పోలీసులకు పట్టుబడ్డాడు. జైలుకు వెళ్లాడు. అందుకే రవితేజ అతనికి కొంత దూరం పాటించాడు. అయితే, రవితేజ ఫోన్ అతను వాడటం వల్లే కెల్విన్ కాల్ లిస్టులో రవితేజ పేరు ఉందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  Celebrities Drinking Aloe Vera To Escape SIT Interrogation
  భరత్‌ను పట్టించుకోలేదనుకున్నారు కానీ..

  భరత్‌ను పట్టించుకోలేదనుకున్నారు కానీ..

  భరత్ విషయంలో రవితేజ పట్టించుకోనట్లుగా వ్యవహరించారనే వాదనలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఏకంగా రవితేజనే డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం సంచలనంగా మారింది. అయితే, రవితేజకు నేరుగా సంబంధాలు ఉండి ఉండకపోవచ్చునని కూడా అంటున్నారు. కానీ సిట్ ఆషామాషీగా నోటీసులు ఇచ్చి పిలవదనే మరో మాట కూడా వినిపిస్తోంది.

  వీటితో రవితేజను నిందించవచ్చా?

  వీటితో రవితేజను నిందించవచ్చా?

  రవితేజ డ్రగ్ సప్లయర్ కెల్విన్‌తో సెల్ఫీలు దిగిన ఆధారాలు సిట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే కెల్విన్ ఫోన్‌లో రవితేజ నెంబర్ ఉందని గుర్తించారని తెలుస్తోంది. మరోవైపు, జిషాన్ మాస్ మహారాజ పేరు చెప్పారు. అయితే, వీటి వల్లే ఆయనను నిందించగలమా అని అభిమానులు అంటున్నారు. అభిమానులుగా చెప్పి సెల్ఫీలు దిగవచ్చునని అంటున్నారు. అలాగే, సోదరుడు ఇతని ఫోన్ వాడటం కూడా జరిగి ఉండవచ్చునని అంటున్నారు.

  మరి జీషన్ మాటేమిటి?

  మరి జీషన్ మాటేమిటి?

  సెల్ఫీలు, ఫోన్ వాడకంపై సమాధానాలు దొరికినప్పటికీ.. రవితేజ తన వద్ద డ్రగ్స్ కొన్నట్లుగా జీషన్ చెప్పారని చెబుతున్నారు. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడిందని అంటున్నారు. అంటే రవితేజ కూడా డ్రగ్ ఎడిక్టా అనే చర్చ సాగుతోంది.

  చార్మీ ముమైత్ లను ప్రశ్నించాక.. సిట్ వ్యూహం ఏమిటి?

  చార్మీ ముమైత్ లను ప్రశ్నించాక.. సిట్ వ్యూహం ఏమిటి?

  చార్మీ, ముమైత్ ఖాన్‌లు ఇచ్చిన సమాచారం ఆధారంగా రవితేజను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారని తెలుస్తోంది. అందుకే రవితేజ విచారణ తేదీ రెండుసార్లు మారి చివరకు 28వ తేదీకి ఫిక్స్ అయిందని అంటున్నారు. కాగా, రవితేజ రాక నేపథ్యంలో సిట్ కార్యాలయం వద్ద పూర్తిస్థాయిలో భద్రత ఏర్పాటు చేయనున్నారు.

  English summary
  On Friday, actor Ravi Shankar Raju Bhupathiraju, popularly known as Ravi Teja, would appear before the SIT. His brother Bharath, who died in a road accident in the city recently, was arrested in a drugs case a few years ago.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X