హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ పోలీసులపై కరోనా పంజా.. ముగ్గురు ఉన్నతాధికారులకు..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: ప్రపంచాన్ని కోవిడ్-19 గడగడ లాడిస్తోంది. ఇప్పటికే ఈ మాయదారి రోగం పలు దేశాధినేతలను సైతం కలవరపెట్టింది. అమెరికాలో అయితే ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఇక భారత్ కూడా కరోనా వైరస్ కేసుల్లో పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే కోవిడ్-19 విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే ఏపీలో 400కు పైగా కరోనా వైరస్ కేసులు నమోదు కాగా తెలంగాణలో కూడా అంతే స్థాయిలోనమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణలో పోలీసులకు కోవిడ్-19 వ్యాపించడం కలవరపెడుతోంది.

ఓటు వేసిన వైఎస్ జగన్: మాస్కు లేకుండా: కోవిడ్ నిబంధనల ఉల్లంఘన అంటోన్న టీడీపీఓటు వేసిన వైఎస్ జగన్: మాస్కు లేకుండా: కోవిడ్ నిబంధనల ఉల్లంఘన అంటోన్న టీడీపీ

ఇప్పటి వరకు మహారాష్ట్ర పోలీసులను వణికించిన కరోనావైరస్ తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ పోలీసులను కూడా వణికిస్తోంది. తాజాగా ముగ్గురు సీనియర్ పోలీస్ ఉన్నతాధికారులకు కరోనా వైరస్ వచ్చినట్లు సమాచారం. ఇందులో అడిషనల్ డీజీ ర్యాంక్‌లో ఉన్న మహిళా పోలీస్ అధికారికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. మరొకరు అడిషనల్ డీజీ ఇంకొకరు జాయింట్ కమిషనర్ ర్యాంకులో ఉన్న పోలీస్ అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. వీరంతా హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోనే పోస్టింగుల్లో ఉన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 2004 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన పోలీస్ అధికారి, పోలీస్‌ శాఖలో కీలక పోస్టులో ఉన్న ఆఫీసర్‌కు గురువారం పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. తెలంగాణలో కోవిడ్-19 వచ్చిన తొలి ఐపీఎస్ అధికారి ఈ ఆఫీసర్ కావడం విశేషం.

After Mumbai, Hyderabad IPS officers tested positive for Covid-19

ఢిల్లీలో తబ్లీఘీ జమాత్‌కు వెళ్లి వచ్చిన వారిని ఈ ఐపీఎస్ అధికారి నేతృత్వంలోనే గుర్తించడం జరిగింది.మర్కాజ్‌లో పాల్గొన్న వారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించడంలో ఈ పోలీస్ అధికారే నేతృత్వం వహించారు.ఇక ఇతని నేతృత్వంలోనే కోవిడ్-19 కాంటాక్ట్స్‌ను గుర్తించడం,నగరంలో వ్యాధిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కీలకంగా వ్యవహరించారు. ఇదిలా ఉంటే శుక్రవారం రోజున మరో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లకు కరోనా సోకింది. ఇందులో ఒకరు మహిళా పోలీస్ అధికారి. వీరిద్దరు 1988 బ్యాచ్ 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు. మొత్తానికి వీరికి కరోనా రావడంతో వారి వద్ద పనిచేసే సిబ్బందిని కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. అంతేకాదు వారు పనిచేస్తున్న కార్యాలయాలను కూడా శానిటైజ్ చేశారు.

మొత్తం మీద ఒక్క బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లోనే 20 కరోనా కేసులు నమోదైనట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 180 మంది పోలీస్ సిబ్బందికి కరోనా వచ్చినట్లు తెలుస్తోంది. ఇక కరోనా సోకిన ప్రభుత్వ ఉద్యోగుల్లో 50శాతం మంది పోలీస్ ఉద్యోగులే ఉండటం విశేషం.

English summary
Few senior IPS officers from Hyderabad have been tested positive for Covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X