వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోరం: ఇవాంకా వస్తోందని.. వీధి కుక్కలకు విషమిచ్చి..., ట్విట్టర్‌లో స్పందించిన కేటీఆర్

నగరంలో అంతర్జాతీయ సదస్సులో నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు కొన్ని ప్రాంతాల్లోని వీధి కుక్కలను పట్టుకొని వాటికి విషం ఇచ్చి చంపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : నగరంలో అంతర్జాతీయ సదస్సులో నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు కొన్ని ప్రాంతాల్లోని వీధి కుక్కలను పట్టుకొని వాటికి విషం ఇచ్చి చంపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Recommended Video

Ivanka Trump Visit : వైట్ హౌస్ నుంచి పర్యవేక్షణ, కనీవిని ఎరుగని సెక్యూరిటీ | Oneindia Telugu

హైదరాబాద్ లో జరిగే జీఈఎస్ లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాంకా కాన్వాయ్ తిరగనున్న బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో వీధికుక్కలను జీహెచ్ఎంసీ సిబ్బంది పట్టుకెళుతున్నారు.

పోలీసుల అత్యుత్సాహం: బిచ్చగాళ్లనుకుని.., ఇవాంకా ట్రంప్ వస్తుంటే మాత్రం.. చూసుకోవక్కర్లా?పోలీసుల అత్యుత్సాహం: బిచ్చగాళ్లనుకుని.., ఇవాంకా ట్రంప్ వస్తుంటే మాత్రం.. చూసుకోవక్కర్లా?

After Removing Beggars Ahead Of Ivanka Trump's Visit, Hyderabad Is Now Accused Of Poisoning Stray Dogs

నగరంలో వీధికుక్కల సంఖ్యను తగ్గించేందుకు ఆ మూగజీవాలకు విషం ఇచ్చి చంపేస్తున్నారని నగరంలోని జంతు సంరక్షణ సంస్థల ప్రతినిధులు ఆరోపిస్తుండగా.. దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు తాము విషం ఇవ్వడం లేదని చెబుతున్నారు.

యాడంగ వస్తందో.. యానంగ పోతదో: హోంమంత్రి నాయిని, ఇవాంకా టూర్‌ షెడ్యూల్లో మార్పు!?యాడంగ వస్తందో.. యానంగ పోతదో: హోంమంత్రి నాయిని, ఇవాంకా టూర్‌ షెడ్యూల్లో మార్పు!?

వీధికుక్కలను తీసుకువెళ్లి వాటికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసి డీవార్మింగ్, యాంటీరాబీస్ వ్యాక్సిన్ ఇచ్చి తిరిగి వాటిని వదిలివేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. తాము 'మా ఇంటి నేస్తం' పేరిట వీధి కుక్కల దత్తతకు ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా చేపట్టామంటూ వివరిస్తున్నారు.

ఖండించిన కేటీఆర్...

మరోవైపు ఈ విషయమై దక్కన్ క్రానికల్ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఉటంకిస్తూ ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఖండించారు. ఇది పూర్తిగా అసత్యమని, ఇలాంటి వార్తలు ప్రచురణకు ముందు జీహెచ్ఎంసీ అధికారుల వివరణ తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

English summary
The preparation of hosting US President Donald Trump's daughter Ivanka Trumps are so high that humans and animals both are bearing the brunt in Hyderabad. Last week, authorities in Hyderabad had picked up hundreds of beggars and street hawkers from the roads, the Greater Hyderabad Municipal Corporation (GHMC) is now being accused of poisoning stray dogs. local residents reports that street dogs have been caught and taken away by GHMC and are being poisoned to sanitise the city for Ivanka Trump’s visit. Animal rights activists have alleged that dogs have been found dead or seriously ill with symptoms of poisoning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X