వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ పై ఆ రోజుల్లో:తమిళనాడులో ఎపి తరహాలోనే తిరుగుబాటు

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపిలో చోటుచేసుకొన్న సంక్షోభ పరిణామాలే తమిళనాడు రాష్ట్ట్రంలో కూడ కన్పిస్తున్నాయి. తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తనకు కూడ ఎంఏల్ఏల మద్దతు .

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితులు 1984 లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ టి ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చోటుచేసుకొన్న పరిణామాలను గుర్తు చేస్తున్నాయి.నాదెండ్ల భాస్కర్ రావు ఎన్ టి ఆర్ పై తిరుగుబాటు చేశాడు.అయితే చివరకు ఎంఏల్ఏలంతా ఎన్ టి ఆర్ కే మద్దతుగా నిలిచారు. భాస్కర్ రావు మాత్రం ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు.తమిళనాడులో ఇదే తరహలో చోటుచేసుకొన్న పరిణామాల్లో ఎవరిది పైచేయిగా మారనుందోననే ఆసక్తి నెలకొంది.

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి 1984 లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నాదెండ్ల భాస్కర్ రావు నేతృత్వంలో తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు సమయంలో టిడిపికి ఇతర విపక్షాలు కూడ అండగా నిలిచాయి.

పార్టీ ఏర్పాటుచేసిన 9మాసాల్లోనే అధికారంలోకి తీసుకురావడంలో ఆనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు ఎన్ టి ఆర్ చరిష్మా కూడ తెలుగుదేశం పార్టీకి కలిసివచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.

అయితే ఎన్ టి ఆర్ నాయకత్వంపై నాదెండ్ల భాస్కర్ రావు నేతృత్వంలో తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు సమయంలో ఎంఏల్ఏలంతా ఎన్ టి ఆర్ వైపే నిలిచారు. దీంతో భాస్కర్ రావు మాత్రం తన పదవిని కోల్పోయారు.

తమిళనాడులో కూడ ఆంద్రప్రదేశ్ పరిణామాలే

తమిళనాడులో కూడ ఆంద్రప్రదేశ్ పరిణామాలే

1984 సంవత్సరంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొన్న పరిణామాలే తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం కన్పిస్తున్నాయి. ఎన్ టిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అమెరికాకు ఆయన శస్త్రచికిత్స నిమితం వెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చేసరికి నాదెండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ముప్పై రోజుల పాటు నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్నారు.1984 ఆగష్టు16 నుండి సెప్టెంబర్ 16వ, తేది వరకు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు.ఎంఏల్ఏలను కాపాడుకొనేందుకుగాను ఎన్ టి ఆర్ తనకు మద్దతిచ్చే ఎంఏల్ఏలను కర్ణాటకకు తరలించాడు. కర్ణాటక నుండి నేరుగా అసెంబ్లీకి ఎంఏల్ఏలతో వచ్చి బలపరీక్షలో విజయం సాధించాడు ఎన్ టి ఆర్.

పోలీసులను ప్రయోగించినా ఫలితం లేకపోయింది

పోలీసులను ప్రయోగించినా ఫలితం లేకపోయింది

తనకు మద్దతిచ్చే ఎంఏల్ఏలతో కర్ణాటకలో ఎన్ టి ఆర్ క్యాంప్ నిర్వహించాడు. 160 మందికి పైగా టిడిపి ఎంఏల్ఏలు కర్ణాటక నుండి నేరుగా రామకృష్ణ స్టూడియోకు తీసుకువచ్చారు ఎన్ టి ఆర్ .అయితే నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రిగా ఆనాడు బాద్యతలు నిర్వహిస్తున్నారు.అయితే ఆయన అప్పటి హైద్రాబాద్ నగర పోలీస్ కమీషనర్ విజయరామారావు, ఈస్ట్ జోన్ డిసిని అరవిందరావును పిలిచి రామకృష్ణ స్టూడియోలో క్యాంపులో ఉన్న ఎంఏల్ఏలను బయటకు తీసుకురావాలని ఆదేశించాడు. రామకృష్ణ స్టూడియో వద్దకు వెళ్ళిన అరవింద్ రావు ఎంఏల్ఏలను అడిగారు.అయితే తామంతా స్వచ్ఛంధంగానే ఎన్ టి ఆర్ కు మద్దతిస్తున్నట్టుగా ప్రకటించారు.దీంతో అరవింద్ రావు చేసేదేమీ లేక వెనుదిరిగారు. తమిళనాడు అపధ్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడ ఎంఏల్ఏలను నిర్భంధించారని వారిని విడిపించాలని పోలీసులను ఆదేశించారు.

బదిలీకి గురైన పోలీసు అధికారులు

బదిలీకి గురైన పోలీసు అధికారులు

రామకృష్ణ స్టూడియోలో క్యాంపులో ఉన్న ఎంఏల్ఏలను తీసుకురావడంలో వైఫల్యం చెందారనే కోపంతో అప్పటి సిటీ కమీషనర్ విజయరామారావు, ఈస్ట్ జోన్ డిసిపి అరవింద్ రావులను నాదెండ్ల భాస్కర్ రావు బదిలీ చేశారు.విజయరామారావు స్థానంలో డి.ప్రభాకర్ రావును సిటీ కమీషనర్ గా నియమించారు నాదెండ్ల భాస్కర్ రావు. ప్రభాకర్ రావు డిజిపిగా రిటైరయ్యారు.

ఎన్ టి ఆర్ పై చంద్రబాబునాయుడు తిరుగుబాటు

ఎన్ టి ఆర్ పై చంద్రబాబునాయుడు తిరుగుబాటు

1984 లో నాదెండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు సమయంలో ఎంఏల్ఏలను కాపాడడంలో క్యాంపుకు తరలించడంలో చంద్రబాబునాయుడు కీలకంగా వ్యవహరించారు.అయితే 1994 లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి ఎన్ టి ఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే ఏడాది కూడ తిరగకముందే పార్టీలో సంక్షోభం ఏర్పడింది. ఎన్ టి ఆర్ సతీమణి లక్ష్మీపార్వతి పార్టీ, ప్రభుత్వ వ్యవహరాల్లో జోక్యం పెరిగిపోతోందనే నెపంతో చంద్రబాబునాయుడు నేతృత్వంలో తిరుగుబాటు నిర్వహించారు. చంద్రబాబునాయుడు వైస్రాయి హోటల్ లో తనకు మద్దతిచ్చే ఎంఏల్ఏలను ఉంచారు. అయితే ఆనాడు ఎన్ టి ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.అయితే పోలీసులను ప్రయోగించి హోటల్ పై దాది చేయించలేదు ఎన్ టి ఆర్.హోటల్ ముందుకు వెళ్ళి ఎంఏల్ఏలను తనతో కలిసిరావాలని ఆయన కోరారు. హోటల్ లోనికి వెళ్ళేందుకు ఎన్ టి ఆర్ ను పోలీసులు అనుమతించలేదు.

అన్నాడిఎంకె ఎంఏల్ఏలు క్యాంపుల

అన్నాడిఎంకె ఎంఏల్ఏలు క్యాంపుల

జయలలిత సమాధి వద్ద అమ్మ నిజాలు మాట్లాడాలని తనని కోరిందని శశికళపై నిప్పులు చెరిగారు తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. సెల్వం తనను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడంతో శశికళ జాగ్రత్త పడ్డారు. పార్టీ కార్యాలయంలో ఎంఏల్ఏలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే నాలుగు బస్సుల్లో ఎంఏల్ఏలను క్యాంపులకు తరలించింది శశికళ. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు మద్దతుగా ఉన్న ఎంఏల్ఏలను కూడ కర్ణాటక రాష్ట్రానికి క్యాంపుకు తరలించారు ఎన్ టి ఆర్ .

తమిళనాడులో ఎవరిది పై చేయి

తమిళనాడులో ఎవరిది పై చేయి

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ టి ఆర్ పై నాదెండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు చేసిన సమయంలో ఎన్ టి ఆర్ విజయం సాధించారు.అయితే నెలరోజుల పాటు మాత్రమే నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1995 లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్ టి ఆర్ ఎంఏల్ఏల మద్దతును కూడగట్టుకోలేకపోయారు. దీంతో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.ఇక తమిళనాడులో అన్నాడిఎంకె శాసనసభపక్ష నాయకురాలిగా శశికళ ఎన్నికయ్యారు. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు గవర్నర్ ఆమోదించారు.అయితే ఎంఏల్ఏలు ఎవరి వైపు ఎక్కువగా ఉంటే వారిదే పైచేయిగా మారే అవకాశం ఉంది. తమిళనాడులో క్షణ క్షణానికి పరిస్థితులు మారుతున్నందున ఏం జరుగుతోందో చూడాలి.

English summary
Political developments in Tamil Nadu over the past few days resemble, in many ways, the drama that had played out during the August 1984 coup by Nadendla Bhaskara Rao against Chief Minister N.T. Rama Rao in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X